రాబోయే 2016 భారత ఆటోఎక్స్పో వద్ద మహీంద్రవాహనాలు
స్వదేశ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా, రాబోయే ఆటో ఎక్స్పో కోసం చర్చలు జరుపుకుంటోంది. ఎందుకనగా బహుశా "XUV ఏయిరో " కాన్సెప్ట్ వలన కావచ్చు. ఈ SUVస్పోర్టి కూపే బాడీ శైలిలో నిర్మించబడింది. మరియు ఇది డోంట్- మెస్ - విత్- మీ అనే ప్రత్యేక వైఖరి తో రాబోతోంది. ఈ ఏయిరో కాన్సెప్ట్ లో భాగంగా మహీంద్రా సంస్థ నుండి క్వాంటొ ఫెస్లిఫ్ట్ ని కూడా ఆశిస్తున్నారు. E2O ఫోర్ డోర్ మరియు వారి ప్రముఖ SUV లకు కొన్ని ఆఫ్-రోడ్ వెర్షన్లు తో రాబోతోందని ఆశిస్తున్నారు. మహీంద్రా ఆటో ఎక్స్పో కోసం కొన్ని వాహనాలని పరిచయం చేయబోతోందని అనిపిస్తుంది. ఇక్కడ వారి వాహనాల టేక్ ఆఫ్ కనిపిస్తుంది.
ఎక్స్ యూ వి ఏయిరో కాన్సెప్ట్;
మహీంద్రా నుండి ఒక SUV కూపే ఆలోచన ని మాత్రమే ఇక్కడ పరిగణించవచ్చును. ముందుగా, ఇది XUV 500 స్పోర్టీయర్ వెర్షన్. రెండవది, ఒక స్పోర్ట్స్ కారు వంటి పడే రూఫ్ లైన్ని పొందుతారు. ఇప్పటిదాకా మార్కెట్లో BMW X6 మరియు మెర్సిడెస్ GLE Coupe వంటి కార్లు మాత్రమే స్పోర్టీయర్ వెర్షన్ ని కలిగి ఉన్నాయి. మూడవది.ఇది XUV500 ఆధారంగా రూ.16 లక్షలుగా వచ్చింది. అది ప్రారంభించిన కొన్ని రోజులకే కొనుగోలుదారులు మధ్య మంచి ప్రజాదరణ పొందుతుంది. అంతే కాకుండా ఇప్పుడు ఇంత తక్కువ ధరకు వచ్చే ఇంకో వాహనం లేదు. మేము ఈ వాహనం భారత మార్కెట్లో రాబోతున్న రోజు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. కానీ తయారుదారు నుండి ఇప్పటిదాకా దీని ప్రారంభం గురించి ఎటువంటి సమాచారం రాలేదు.
E2o 4 డోర్;
మహీంద్ర యొక్క ఆకాంక్షలు అన్నీ ఈ ఎలక్ట్రిక్ e2o అనే వాహనం మీదనే ఆధారపడి ఉంది. మరియు తయారీదారు ఖచ్చితంగా దీనికి భవిష్యత్తులో మంచి ఉత్పత్తిగా తీర్చిదిద్దబోతున్నాడు. ఈ కారణంగా, ఈ కారు యొక్క 4 డోర్ వెర్షన్ ప్రదర్శనని చేయనున్నారు. ఇప్పుడు పెద్ద భారత నగరాల్లో వాహనానికి ఎక్కువ పాండిత్యము జోడిన్చాబోతున్నారు. ఎందుకంటే వారి దృష్టి మొత్తం ఇటువంటి వాహనాల మీదనే ఉన్నది. చిన్నగా ఉన్నటువంటి ఈ వాహనం యొక్క బాహ్యపు తీరుతెన్నులు మరియు దాని తక్కువ ధర వలన ఈ వాహనాన్ని అందరూ ప్రేమిస్తారు. కాలుష్యానికి వ్యతిరేఖంగా ఉండే వారందరూ ఈ 4-డోర్ వెర్షన్ కారుని ఈ దేశంలో ఇష్టపడతారు. ఎందుకంటే ఇప్పటికే 2-డోర్ వెర్షన్ అందుబాటులో ఉంది
క్వాంటో ఫేస్లిఫ్ట్;
నిజాయితీగా చెప్పాలంటే నేను కూడా ఒక మహీంద్ర అభిమానిని. ఈ క్వాంటో వాహనం ఇతర మహీంద్రా వాహనాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అంతేకాక ఇది కేవలం డిజైను పరంగా మాత్రమే కాదు. డ్రైవింగ్ డైనమిక్స్ అలాగే మైలేజ్ కూడా భిన్నంగానే ఉంటుంది. అయితే రహస్య చిత్రాలని చూస్తే తయారీదారు ఆటో ఎక్స్పోలో మరొక ఫేస్లిఫ్ట్ వాహనాన్ని తీసుకురావడానికి ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. అయితే దీని ప్రాదమిక బాడీ షెల్ (కారు ఆకృతి లో ఒక పెద్ద మార్పు లేదు) అదే విధంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. దీని 1.5 లీటర్ మోటారు మరింత అభివృద్ధి చెంది ఉంటుందని భావిస్తున్నారు. కారు యొక్క అంతర్గత భాగాలు కూడా మరింత అభివృద్ధి చెంది ఉంటాయని భావిస్తున్నారు.
శాంగ్యాంగ్ టివోలి;
మహీంద్రా పెవిలియన్ లో మరొక కారు కోసం చూసినట్లయితే అది శాంగ్యాంగ్ టివోలి. ఇది ఒక కాంపాక్ట్ శూV. ఈ కారణంగా, ఇది 8 నుండి 14 లక్షల రూపాయల ధర బ్రాకెట్లో ఉంటుంది. దీని తయారీదారు భారతదేశంలో రెండు సార్లు పరీక్ష జరుపుకుంటూ ఉండగా ఈ వాహనం కనిపించింది.
ప్రస్తుత SUVల యొక్క నవీకరణ అంశాలు;
భారత ఆటో ఎక్స్పో 2014 మాదిరిగానే, తయారీదారు థార్ లేదా, స్కార్పియో లేదా బొలెరో ఆధారంగా, కొన్ని మార్పులు చేయబడిన వాహనాలని తీసుకు వస్తారని భావిస్తున్నారు.