2015 డిసెంబర్ 30 న మహీంద్రా రేవా యొక్క 'ఫెస్టివల్ ఆఫ్ గుడ్నెస్ ' కోసం 'లక్కీ డ్రా'
డిసెంబర్ 30, 2015 12:39 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ:
మహీంద్రా రేవా డిసెంబర్ 30, 2015 న e2o యజమానుల కొరకు 'లక్కీ డ్రా' నిర్వహిస్తున్నాము అని ప్రకటించింది. ఈ ప్రకటన అక్టోబర్ 3 నుంచి నవంబర్ 15, 2015 వరకు వాహనతయారి సంస్థచే జరిపిన 'ఫెస్టివల్ ఆఫ్ గుడ్నెస్' ప్రమోషన్ కార్యక్రమం వరకూ కొనసాగింపుగా వస్తుంది. ఈ డ్రా హోటల్ మోనార్క్, బ్రిగేడ్ రోడ్, బెంగుళూర్ లో 11-00 గంటల నుండి 12-30 గంటల వరకూ జరుగుతుంది.
డ్రాలో పాల్గొనే అర్హత ముందు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనే దానిపైన ఆధారపడి ఉంటుంది. టెస్ట్ డ్రైవ్ తీసుకున్న కొనుగోలుదారులు మరియు ఒక నిర్దిష్ట కాలంలో (అక్టోబర్ 3, 2015 నుండి నవంబర్ 15, 2015) కారు కొనుగోలు చేసుకొనే వారికి మాత్రమే ఇద్దరికి సింగపూర్ ట్రిప్ బంపర్ ప్రైజ్ గెలుచుకునే అర్హత పొందుతారు.
'ఫెస్టివల్ ఆఫ్ గుడ్నెస్ ' కార్యక్రమం e2o ప్రోత్సహించడానికి రేవా ద్వారా నిర్వహింపబడింది. విద్యుత్ కార్ల తయారీదారులు ఆటొమొబైల్ ఎవరైతే కొంటారో వారికి ఒక స్క్రాచ్ కార్డు అందించి దాని స్క్రాచ్ చేయడం ద్వారా వచ్చిన బహుమతులు అందించడం జరుగుతుంది. ఇతర హామీ బహుమతులు రూ. 60,000 విలువగల ఐఫోన్ కొరకు ఇ-వోచర్లు ప్రతి (8 విజేతలకు), రూపాయలు. 50,000 గల LED TVలు ప్రతి(4 మంది విజేతలు), రూపాయలు. 13,500 గల 22ktగోల్డ్ కాయిన్ ప్రతి (8 విజేతలు), రూ. 4,900 ప్రతి (8 విజేతలు) రూ. 1,000 ప్రతి (72 విజేతలు) కూడా ఉన్నాయి. ఈ ఆఫర్, పథకం కింద అమ్మబడిన 100 కార్లకు చెల్లుబాటు అవుతుంది. ఎవరైతే లక్కీ డ్రాలో పాల్గొంటారో వారికి అదనంగా 'హౌ మహీంద్రాe20 ఈజ్ డ్రివెన్ బై గుడ్నెస్ ' అనే దాని గురించి రాయమని అడుగుతారు. ఈ ఈవెంట్ మహీంద్రా యొక్క ఉద్యోగుల కోసం మరియు మహీంద్రా గ్రూప్ సరఫరాదారులు / సంస్థలు / పాల్గొనే భాగస్వాములు / వ్యాపార అసోసియేట్స్ కి వర్తించదు.
మహీంద్రా ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కారు తయారీదారులతో చేతులు కలిపారు.