#LiveFromFrankfurt: భారతదేశానికి ప్రతేఖమైన బాలెనో అనగా వైఆర్ఎ ని బహిర్గతం చేసిన సుజికీ

మారుతి వైఆరే కోసం raunak ద్వారా సెప్టెంబర్ 16, 2015 05:05 pm ప్రచురించబడింది

ఈ ఎలైట్ ఐ20 పోటీదారుడు బహుశా భారతదేశం లో ఒక కొత్త పేరుతో తదుపరి నెల ప్రారంభం కావచ్చు మరియు ఉత్పత్తి ఇప్పటికే మనేసర్ ప్లాంటులో ప్రారంభించబడినది!

జైపూర్: సుజుకి కొనసాగుతున్న 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో వైఈర్ఎ అనగా బాలెనో యొక్క ఆరంగేట్రం చేసింది. మిగిలిన ప్రపంచానికి అది కొత్త బాలెనో కాని భారతదేశంలో  ప్రాముఖ్యత చెందని ఆ పేరు ని మారుతీ సంస్థ కొనసాగించదలుచుకోలేదు. ఎస్-క్రాస్ నుండి ఎస్ ఎక్స్4 ని తీసేసిన విధంగా ఈ బాలెనో పేరు ని మారుతీ సంస్థ కనసాగించదలుచుకోలేదు. వైఆర్ఎ యొక్క ప్రధాన ప్రత్యర్థి ఎలైట్ ఐ 20 అవ్వచ్చు. హ్యుండాయి కాకుండా ఇది విడబ్లు పోలో, ఫియట్ పుంటో ఈవో మరియు హోండా జాజ్ వంటి వాటితో కూడా పోటీ పడవచ్చు.  

 

కొలతల నుండి మొదలు పెడితే, ఈ హాచ్ 3995mm పొడవు, 1745mm వెడల్పు మరియు 1470mmఎత్తు ని కలిగి ఉంది. బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే, హోండా జాజ్ ప్రస్తుతం దాని విభాగంలో 354 లీటర్ల బూట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అయితే, కొత్త బాలెనో   355 లీటర్లు అందిస్తుంది. 

ఇంజిన్లు పరంగా, ప్రపంచవ్యాప్తంగా, బాలెనో సుజుకి యొక్క కె12బి 1.2 లీటర్ మోటారు యొక్క డ్యుయల్ జెట్ మోటార్ ని కలిగియుండి 89Bhpశక్తిని మరియు 120Nm టార్క్ ని అందిస్తుంది. అయితే, 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ 110Bhp శక్తిని మరియు 170Nm టార్క్ ని వరుసగా 2000 మరియు 3500Rpm మధ్య లో అందిస్తుంది. ఇంజిన్లు ప్రామాణిక 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ వ్యవస్థ తో జతచేయబడి ఉంటుంది. భారతదేశం లో, ఇది 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డిడి ఐఎస్200 డీజిల్ ఇంజిన్ ని పొంది ఉంటుందని అంచనా. అంతేకాక, మారుతి 1.0 లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ని కూడా అందించవచ్చు. ఇది సియాజ్ వలే  భారతదేశం లో ఎస్ హెచ్ విఎస్ హైబ్రిడ్ టెక్ ని పొందే అవకాశం ఉంది.      

డిజైన్ గురించి మాట్లడుకుంటే, ఇది చాలా సాధారణమైనది మరియు సొగసైనది. దీని ముందరభాగం చూస్తుంటే, స్విఫ్ట్ నుండి ప్రేరణ తీసుకొని రూపొందించబడినట్టుగా తెలుస్తుంది. అయితే, వెనుక భాగం చుట్టబెట్టిన టైల్లాంప్స్ మరియు ఏటవాలు రూఫ్లైన్ ని కూడా కలిగి ఉంది. ఇది ఎల్ఇడి  టైల్లాంప్స్ తో పాటూ పగటిపూట నడుస్తున్నఎల్ఇడి లతో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉంది. దీనిలో క్యాబిన్ సిల్వర్ చేరికలు మరియు క్రోమ్ హెడ్లైట్స్ తో నల్లని థీమ్ తో సాధారణ  లేఅవుట్ ని కలిగి ఉంది. అంతేకాక, దీనిలో సమాచార వ్యవస్థ ఎస్-క్రాస్ మరియు సియాజ్ లో ఉన్నటువంటి అదే 7-అంగుళాల స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థను కలిగి ఉంది.  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి వైఆరే

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience