• English
  • Login / Register

లియోనార్డో డికాప్రియో ఫోక్స్వాగెన్ కుంభకోణం సినిమా యొక్క హక్కులను పొందారు

అక్టోబర్ 16, 2015 11:51 am raunak ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫోక్స్వాగెన్ కుంభకోణంపై ఇంకా రాయనున్న సినిమా నవల యొక్క హక్కులను ఈ నటుడు చేజిక్కించుకున్నారు. త్వరలోనే ఈ కుంభకోణం హాలీవుడ్ హంగులు అద్దుకుని వెండితెరపై తలుక్కుమననుంది! 

జైపూర్:

లియోనార్డో డికాప్రియో వారు ఫోక్స్వాగెన్ డీజిల్ కుంభకోణం యొక్క సినిమా హక్కులను అందుకున్నారు. దాదాపు 11 మిలియన్ కార్లను ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసిన అతి పెద్ద కుంభకోణం ఇది. న్యూ యార్క్ టైంస్ నవలా రచయత అయిన జాక్ ఏవింగ్ గారు రాయనున్న నవల మీద ఆధారపడి ఈ సినిమా రానుంది. 

ఈ ఫోక్స్వాగెన్ కుంభకోణం గత నెల అధికారికంగా యూఎస్ లో ఇంకా ఇతర దేశాలలో మేము కుంభకోణానికి పాల్పడ్డాము అని బహిర్గతంగా ఒప్పుకున్న నాడు బయట పడింది. వీరు ఎమిషన్ నారంస్ కి తగినట్టుగా వీరి వాహనాలు ఉన్నట్టూ మభ్య పెట్టే ఒక సాఫ్ట్‌వేర్ ని తయారు చేసి అమలు చేశారు. పరీక్షలను దాటి వచ్చిన తరువాత ఈ కార్ల  TDCi డీజిల్ ఇంజిన్లు దాదాపు 40 రెట్లు ఎమిషన్ నారంస్ కంటే ఎక్కువ ఇది విడుదల చేస్తుంది.

 

లీయొనార్డో డికాప్రియో యొక్క ప్రొడక్షన్ స్టూడియో అప్పియన్ మరియూ పారామౌంట్ పిక్చర్స్ వారు ఈ సినిమాని నిర్మించనున్నారు. అయినప్పటికి, ఈ నటుడు ఇందులో నటించేదీ లేనిదీ అనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు. ఇది కాకుండా, ఫోక్స్వాగెన్ వారు భారతదేశంలోని పోలో హ్యాచ్‌బ్యాక్ లను ఉపసంహరించుకున్నారు . ఇది ఈ కుంభకోణానికి సంబంధం లేకుండా, మరేదో హ్యాండ్ బ్రేక్ లోపం కారణంగా అని తెలిపారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience