• English
  • Login / Register

రాబోయే Mahindra Thar 5-door కోసం ట్రేడ్‌మార్క్ చేయబడిన 7 పేర్లలో “ఆర్మడ ”

మహీంద్రా థార్ రోక్స్ కోసం rohit ద్వారా డిసెంబర్ 20, 2023 09:44 pm సవరించబడింది

  • 156 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మిగిలిన పేర్లను థార్ ప్రత్యేక ఎడిషన్ؚల కోసం ఉపయోగించే అవకాశం ఉంది, లేదా వేరియెంట్ؚల కోసం పేరు పెట్టడానికి కొత్త వ్యూహాన్ని కూడా అనుసరించవచ్చు (టాటా అనుసరించిన విధానం).

Mahindra Thar 5 door

సంవత్సరం కంటే ఎక్కువ సమయం నుండి ఎంతగానో ఎదురుచూస్తున్న SUVలలో మహీంద్రా థార్ 5 డోర్ ఒకటి. దీని విడుదల 2024లో షెడ్యూల్ చేయబడింది, ఇటీవల ఈ SUV ప్రొడక్షన్ؚకు సిద్ధంగా ఉన్న మోడల్ؚని టెస్ట్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం మహీంద్రా, థార్ 5-డోర్ల ప్రొడక్షన్ వర్షన్ కోసం పేరును ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నట్లు కనిపిస్తోంది, ఇటీవల 7 పేర్లను ట్రేడ్ؚమార్క్ చేసింది.

ఏ పేర్లు ట్రేడ్ؚమార్క్ చేయబడ్డాయి?

మహీంద్రా ఈ క్రింది పేర్లకు ట్రేడ్ؚమార్క్ؚలను ఫైల్ చేసింది:

  • థార్ ఆర్మడా

  • థార్ కల్ట్

  • థార్ రెక్స్

  • థార్ రాక్స్

  • థార్ సవన్నా

  • థార్ గ్లేడియస్

  • థార్ సెంచూరియన్

ఇది కూడా చూడండి: మారుతి జిమ్నీ Vs మహీంద్రా థార్ – ఏ 4X4 పెట్రోల్ ఆటోమ్యాటిక్ వేగవంతమైనది?

వీటిలో ఉత్తమ ఎంపిక ఏది కావచ్చు?

5-door Mahindra Thar render

ఈ ఏడు పేర్లలో,  రాబోయే 5-డోర్ల మహీంద్రా SUV కోసం ‘థార్ ఆర్మడా’ పేరు మొదటి స్థానంలో ఉండవచ్చు. మహీంద్రా ఈ పేరును ఎంచుకుంటే, మరొక 6 ఇతర థార్-ఆధారిత ట్రేడ్ؚమార్క్ؚలు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాయి.

ఈ కారు తయారీదారు థార్ 5 డోర్ల వేరియెంట్ؚల కోసం ఈ పేర్లను ఉపయోగిస్తుందని భావిస్తున్నాము. ఇటీవల టాటా, తన వేరియెంట్ల పేర్లను, నవీకరించిన నెక్సాన్, హ్యారియర్, మరియు సఫారీ SUVల నుండి కేవలం అక్షరాల నుండి పదాలకు మార్చింది. కొత్తగా ట్రేడ్ؚమార్క్ చేసిన గుర్తింపుల నుండి కొన్నిటిని థార్ 3-డోర్ల మోడళ్ళ లైన్అప్ కోసం కూడా ఉపయోగించవచ్చు.

అలాగే, ఈ ట్రేడ్ؚమార్క్ؚలు థార్ 3-డోర్ మరియు 5-డోర్ల వర్షన్ؚలు రెండిటి ప్రత్యేక ఎడిషన్ؚలను కూడా మహీంద్రా విడుదల చేసే అవకాశం గురించి కూడా సూచిస్తున్నాయి, అంతర్జాతీయ మార్కెట్ؚలలో రాంగ్లర్ SUVల ఎడిషన్ؚలను జీప్ ఇలాగే విడుదల చేసింది.

పవర్ؚట్రెయిన్ؚలు మరియు విడుదల టైమ్ؚలైన్

మహీంద్రా థార్ 5-డోర్, 3-డోర్ వర్షన్ؚలో ఉన్న అదే 2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ؚలతో పెంచిన అవుట్ؚపుట్ؚలతో వస్తుందని అంచనా. రెండు ఇంజన్ؚలు మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికలను పొందుతాయి. థార్ 5 డోర్ రేర్-వీల్-డ్రైవ్ (RWD) మరియు 4-వీల్-డ్రైవ్ (4WD) ఎంపికను కూడా అందించవచ్చు.

Mahindra Thar 5 door rear

మరింత ఎక్కువ ఆచరణాత్మకమైన థార్ అమ్మకాలు 2024 మొదటి సగంలో మొదలవుతాయని ఆశిస్తున్నాము, దీని అంచనా ధర రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఇది మారుతి జిమ్నీ కి భారీ ప్రత్యామ్నాయం కావచ్చు, అలాగే ఇది త్వరలోనే విడుదల కాబోతున్న 5-డోర్ల ఫోర్స్ గుర్ఖాతో పోటీ పడుతుంది.

మూలం

ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా థార్ ఆటోమ్యాటిక్ 

was this article helpful ?

Write your Comment on Mahindra థార్ ROXX

2 వ్యాఖ్యలు
1
D
deepak chaudhary
Jan 14, 2024, 9:17:28 PM

Gladius is also good name armada look like old version car

Read More...
    సమాధానం
    Write a Reply
    1
    V
    vivekanand pattar
    Dec 19, 2023, 11:57:39 AM

    ARMADA Name is a Very well Suited for the 5 door Version of Thar.

    Read More...
      సమాధానం
      Write a Reply

      సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

      *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

      ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

      • లేటెస్ట్
      • రాబోయేవి
      • పాపులర్
      ×
      We need your సిటీ to customize your experience