• English
  • Login / Register

Sonet ఫేస్‌లిఫ్ట్ విడుదల తేదీని ఖరారు చేసిన Kia

కియా సోనేట్ కోసం anonymous ద్వారా నవంబర్ 30, 2023 06:33 pm ప్రచురించబడింది

  • 65 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2020 లో భారతదేశంలో విడుదల చేయబడిన కియా సోనెట్, దాని మొదటి నవీకరణను పొందనుంది.

Kia Sonet facelift

  • కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లో రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త LED DRLలు, కొత్త కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

  • కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, ఫ్రెష్ క్యాబిన్ థీమ్ మినహా ఈ కారు క్యాబిన్ చాలావరకు ఒకేలా ఉంటుంది.

  • ఇందులో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీల కెమెరా, ADAS టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

  • కొత్త సోనెట్ కారు ప్రస్తుత మోడల్ మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలను పొందుతుంది.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో డిసెంబర్ 14 న ఆవిష్కరించబడుతుంది, దీని ధరకి సంబంధించిన వివరాలు 2024 ప్రారంభంలో వెళ్లడవుతాయి. ఈ సబ్-4 మీటర్ల SUV కారు 2020 లో విడుదల అయిన తరువాత మొదటిసారి కొత్త నవీకరణ పొందబోతోంది. ఈ కారులో సెల్టోస్ SUVని పోలిన డిజైన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.

ఫేస్‌లిఫ్ట్ కియా సోనెట్ ఎక్స్టీరియర్

Kia Sonet facelift exterior changes

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ సమయంలో అనేకసార్లు గుర్తించబడింది. ఈ కారు యొక్క చైనా మోడల్ కూడా కవర్ లేకుండా కనిపించింది. కొత్త సోనెట్ కారులో ఇన్సర్ట్స్, నవీకరించిన LED హెడ్ ల్యాంప్స్ మరియు కొత్త DRLలతో కొత్త డిజైన్ గ్రిల్ ఉంది. అయితే ఈ కారులో కొత్త ఎయిర్ డ్యామ్, కొత్త డిజైన్ బంపర్ ఉన్నప్పటికీ ఫాగ్ ల్యాంప్స్ లోపించాయి.

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కొత్త అల్లాయ్ వీల్స్ రూపంలో మాత్రమే నవీకరణలు ఉన్నాయి. వెనుక భాగంలో, సెల్టోస్ వంటి కొత్త కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ మరియు కొత్త బంపర్ ఉన్నాయి.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ నవీకరణలు

కొత్త సోనెట్ కారు డ్యాష్ బోర్డ్ డిజైన్ లో పెద్దగా మార్పులు ఉండవు. క్యాబిన్ లోపల, మధ్యలో ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలాగే AC కంట్రోల్స్లో కొన్ని మార్పులను చూడవచ్చు. వీటితో పాటు సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త బ్లాక్ అండ్ టాన్ క్యాబిన్ థీమ్ కూడా పొందవచ్చు.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు

కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు, కియా కొత్త సోనెట్లో 360-డిగ్రీల కెమెరా వ్యవస్థ కూడా ఉండవచ్చని మేము భావిస్తున్నాము. సబ్-4m SUV ఫీచర్లలో ఇప్పటికే వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి, వీటిని కొత్త సోనెట్ కారులో కూడా కొనసాగించవచ్చు.

భద్రత విషయానికి వస్తే, కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా హ్యుందాయ్ వెన్యూ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ను కూడా పొందుతుంది.

ఇది కూడా చదవండి: కేబీసీ 2023లో కోటి రూపాయలు గెలుచుకున్న మయాంక్కు హ్యుందాయ్ i20 గిఫ్ట్

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్

యాంత్రికంగా, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎటువంటి మార్పు ఉండదు. ఇది ప్రస్తుత మోడల్ యొక్క ఇంజన్ ఎంపికలతో కొనసాగుతుంది: 120 PS 1-లీటర్ టర్బో-పెట్రోల్, 116 PS 1.5-లీటర్ డీజిల్ మరియు 83 PS 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్. టర్బో పెట్రోల్ ఇంజిన్ తో 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ DCT గేర్ బాక్స్, డీజిల్ ఇంజిన్ తో 6-స్పీడ్ iMT మరియు 6-స్పీడ్ AT, నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో 5-స్పీడ్ MT గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. 

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ప్రత్యర్థులు మరియు ధర అంచనా

Kia Sonet facelift rear

కొత్త కియా సోనెట్ కారు ధర ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం, సోనెట్ SUV ధర రూ .7.79 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుండి ప్రారంభమవుతుంది. 2024 కియా సోనెట్ హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

చిత్రం మూలం

మరింత చదవండి : సోనెట్ ఆటోమేటిక్

ద్వారా ప్రచురించబడినది
Anonymous
was this article helpful ?

Write your Comment on Kia సోనేట్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience