ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న Kia Sonet Facelift ఎక్స్టీరియర్ చిత్రాలు
కియా సోనేట్ కోసం rohit ద్వారా అక్టోబర్ 18, 2023 05:31 pm సవరించబడింది
- 183 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2024 కియా సోనెట్ కొత్త సెల్టోస్ మాదిరిగా ఫాంగ్ ఆకారంలో LED DRLలు మరియు కనెక్టెడ్ టెయిల్లైట్ సెటప్ తో అందించబడుతుంది.
-
కియా సోనెట్ సెప్టెంబర్ 2020 లో భారతదేశంలో విడుదల అయింది.
-
కవర్ లేకుండా మొదటిసారి ఈ ఫేస్ లిఫ్ట్ యొక్క ఎక్స్టీరియర్ చిత్రాలు విడుదల అయ్యాయి.
-
ఇందులో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ లు మరియు కొత్త బంపర్ ఉన్నాయి.
-
ఇంతకుముందు విడుదలైన చిత్రాలలో, ఈ కారులో కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, టాన్ మరియు బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ ఉన్నాయి.
-
కొత్త సోనెట్ కారు ధర రూ .8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది, ఇది 2024 ప్రారంభంలో భారతదేశంలో విడుదల కావచ్చు.
సబ్-4m SUV సెగ్మెంట్లో అత్యంత ప్రీమియం కార్లలో కియా సోనెట్ ఒకటి. కియా సోనెట్ దాదాపు మూడేళ్లుగా భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇప్పుడు కంపెనీ కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ పై పనిచేస్తోంది, ఇది టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఇప్పుడు కొత్త కియా సోనెట్ చిత్రాలు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. ఈ ఫేస్ లిఫ్ట్ యొక్క ఎక్స్టీరియర్ చిత్రాలు మొదటిసారి విడుదల అయ్యాయి.
ఏం గుర్తించబడ్డాయి?
కియా ఈ SUV కారు ఎక్ట్సీరియర్ డిజైన్ లో పలు మార్పులు చేసింది. 2024 కియా సోనెట్ ముందు భాగంలో రీడిజైన్ చేయబడిన హెడ్ లైట్ క్లస్టర్, ఫెంగ్ ఆకారంలో ఉన్న LED DRLలు మరియు మోడిఫైడ్ ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. ఈ వాహనం గ్రిల్ పరిమాణం మరియు డిజైన్ లో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ కనిపించే మోడళ్ళ కంటే ఇండియా-స్పెక్ కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ యొక్క డిజైన్ భిన్నంగా ఉంటుందని గమనించాలి.
సైడ్ ప్రొఫైల్ లో, ఇది రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ తో వస్తుంది, వెనుక భాగంలో, ఇది సెల్టోస్ లాంటి కనెక్టెడ్ LED టెయిల్ లైట్ మరియు పెద్ద బంపర్ తో అందించబడుతుంది.
కొత్త చిత్రాలలో, ఈ SUV కారు యొక్క రెండు వేరియంట్లు (బహుశా మిడ్ మరియు టాప్ వేరియంట్లు) చూడవచ్చు. 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ (ఒక మోడల్లో), క్రోమ్ ఫినిష్ (మరో మోడల్లో) ఉన్న ఈ రెండు మోడళ్లలో ఇచ్చిన విభిన్న డిజైన్లను బట్టి దీన్ని అంచనా వేయవచ్చు. టాప్-స్పెక్ వేరియంట్లో మల్టీ-రిఫ్లెక్టర్ LED హెడ్లైట్లు, మిడ్-స్పెక్ వేరియంట్లో హాలోజెన్ ప్రొజెక్టర్ లైట్లు ఉన్నాయి.
ఇంటీరియర్ వివరాలు
కొత్త చిత్రాలు ఫేస్ లిఫ్ట్ సోనెట్ SUV యొక్క ఇంటీరియర్ గురించి గ్లింప్స్ ఇవ్వలేదు. కానీ, ఇంతకు ముందు విడుదల చేసిన చిత్రాలలో, దాని క్యాబిన్కు సంబంధించిన అనేక ముఖ్యమైన సమాచారం మనకు లభించింది. ఇది కొత్త క్లైమేట్ కంట్రోల్, కొత్త బ్లాక్ మరియు టాన్ సీట్ అప్హోల్స్టరీని పొందుతుంది, ఈ ఫీచర్ను దాని టాప్ వేరియంట్లలో ఇవ్వవచ్చని అంచనా.
ఆశించిన ఫీచర్లు
కొత్త స్పై షాట్ లో ఈ SUV కారు సింగిల్ పెన్ సన్ రూఫ్ తో అందించబడుతుందని నిర్ధారించబడింది. వీటితో పాటు సెమీ డిజిటల్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, 10.25 అంగుళాల టచ్స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
భద్రత పరంగా, దీనిలో 360 డిగ్రీల కెమెరా మరియు అనేక అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) తో అందించవచ్చు. ఇది కాకుండా, ఆరు ఎయిర్ బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా ఫీచర్లు కూడా కొత్త కియా సోనెట్ లో లభిస్తాయి.
ఇది కూడా చదవండి: 360 డిగ్రీల కెమెరాతో 10 అత్యంత సరసమైన కార్లు: మారుతి బాలెనో, టాటా నెక్సాన్, కియా సెల్టోస్ మరియు ఇతరులు
ఇంజిన్ లో ఎలాంటి మార్పులు లేవు
2024 కియా సోనెట్ కారు ఇంజిన్లో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రస్తుత సోనెట్ యొక్క ఇండియన్ వెర్షన్ లో అందుబాటులో ఉన్న ఇంజన్-గేర్ బాక్స్ ఎంపికలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
స్పెసిఫికేషన్లు |
1.2-లీటర్ పెట్రోల్ |
1-లీటర్ టర్బో-పెట్రోల్ |
1.5-లీటర్ డీజిల్ |
పవర్ |
83PS |
120PS |
116PS |
టార్క్ |
115Nm |
172Nm |
250Nm |
ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ MT |
6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT |
6-స్పీడ్ iMT, 6-స్పీడ్ AT |
డీజిల్ ఇంజిన్ తో మళ్లీ రెగ్యులర్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కంపెనీ ఇవ్వొచ్చనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి దీనిపై కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని పంచుకోలేదు.
ఆశించిన ధరలు మరియు ప్రత్యర్థులు
కొత్త కియా సోనెట్ 2024 ప్రారంభంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ .8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్, మహీంద్రా XUV300 మరియు మారుతి ఫ్రాంక్స్ క్రాసోవర్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
మరింత చదవండి : సోనెట్ ఆటోమేటిక్
0 out of 0 found this helpful