• English
  • Login / Register

జీప్ రేనీగేడ్ భారతదేశంలో పరీక్ష జరుపుకుంటూ కనిపించింది. ఇది ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబోతోంది

ఫిబ్రవరి 02, 2016 02:02 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 18 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జీప్ రేనీగేడ్ భారత రోడ్లపై పరీక్ష జరుపుకుంటూ కనిపించింది. ఈ కారు భారతదేశం లో FCA- ఫియట్-క్రిస్లర్ ఆటోమొబైల్స్ నుండి మూడవ ఉత్పత్తిగా రాబోతుందని సమాచారం. ఈ కారు భారీ కవర్తో కప్పబడి ఉన్నపటికీ దాని పూర్తి ప్రత్యేకమయిన ఆకారం కనిపిస్తోంది. మొదట్లో, జీప్ మొదటి విడతగా గ్రాండ్ చెరోకీ మరియు రాంగ్లర్ అన్లిమిటెడ్ ని తీసుకు వచ్చింది. ఇప్పుడు రేనీగేడ్ దానిని అనుసరిస్తూ రావచ్చును.FCA ప్రస్తుతం భారతదేశం లో ఫియట్, అబర్త్ , మసెరటి మరియు ఫెరారీ వాహనాలని అందిస్తోంది. అదనంగా అయిదవ ఆప్షన్ గా జీప్ పోర్ట్ఫోలియో ఉండబోతోంది. FCA టాటా మోటార్స్ లిమిటెడ్ పాటు ఫియట్ రంజంగావున్  తయారీ కేంద్రంలో $ 280 మిలియన్ డాలర్ల  పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఒకసారి జీప్ బ్రాండ్ స్థాపించబడిన తరువాత జీప్ రేనీగ్రేడ్ కూడా స్థానికంగా తయారయిన RHD మరియు LHD మార్కేట్లని ఏర్పరుచుకుంటుంది. 

విదేశీ మార్కెట్లలో, రేనీగేడ్ ఒక 2.4l టైగర్ షార్క్  I4 మరియు ఒక 1.4 లీటర్ మల్టీ ఎయిర్  టర్బో ఇంజన్ తో నిర్మితమయి ఉంటుంది.రెండవది ఒక 9-స్పీడ్ 948TE ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్తో వస్తుంది. అయితే తర్వాతది 6-స్పీడ్ C635 మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్తో వస్తుంది. రేనీగ్రేడ్ యొక్క టాప్ మోడల్ 18-అంగుళాల x 7.0 అంగుళాల అల్యూమినియం చక్రాలు కలిగి రాబోతోంది. ఒకవేళ భారతదేశం లో విడుదల చేసినప్పుడు, కారు ఎక్కువగా ఒక ఆల్ టైం  4WD వేరియంట్ చిన్న ఫియట్ ఇంజన్తో , ఉండి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. జీప్ భారత మార్కెట్లోకి ప్రవేశించటానికి ఇంతకంటే మంచి సమయం ఇంకోటి లేదు. భారత కొనుగోలుదారు యొక్క ఆలోచన మొత్తం SUV మరియు క్విడ్  మరియు క్రిట లపై ఉన్నట్లు కనిపిస్తోంది. ఇవి భారతదేశంలో ఎక్కువగా విజయవంతమయినవి. 

భారతదేశం లో జీప్ యొక్క ప్రారంభం గురించి మాట్లాడుతూ FCA భారతదేశం మేనేజింగ్ డైరెక్టర్ మరియు అధ్యక్షుడు కెవిన్ ఫ్లిన్, ఈ విధంగా అన్నాడు." ఈ జీప్ బ్రాండ్ దిగ్గజం అయిన రేనీగేడ్ ని భారతదేశం లో ప్రారంభించ బోతున్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది" అన్నారు. నేడు FCA ఇతర వాహనాలు స్థాపించడానికి ఈ జీప్ బ్రాండ్ మైల్ స్టోన్ ఎంతగానో సహాయపడుతుందని భావిస్తున్నారు. "కొత్త జీప్ బ్రాండ్ వెబ్సైట్లో వారసత్వానికి నిజమై ఉంటున్న సమయంలో ప్రపంచంలో దాని పాదముద్రని విస్తరించేందుకు  ఒక కొత్త ఆశ చిగురిస్తుంది"అని కూడా జోడించారు. రాబోయే నెలల్లో భారతదేశం లో ఈ అద్భుతమైన బ్రాండ్ యొక్క రాక గురించి అందరూ మరింత ఉత్షాహంగా ఎదురుచూడాలి.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience