• English
  • Login / Register

జీప్ చెరోకీ హ్యాకింగ్ కారణంగా 1.4 మిలియన్ వాహనాలను వెనక్కి పిలిచిన ఫియాట్ క్రైస్లర్

జూలై 27, 2015 03:45 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: వాహనం యొక్క రక్షణకు సంబంధించి వాహనం యొక్క సాఫ్ట్ వేర్ మరియు రిమోట్ యాక్సెస్ అన్ని సమయాలలో అధికంగా ఉండడం వలన ఫియాట్ తమ వాహనాలను రీకాల్ చేస్తుంది. తమ భద్రతా పరిశోధకుడి చేత హ్యాక్ చేయబడిన కారణంగా ఫియాట్ క్రైస్లర్ ఇప్పుడు 1.4 మిలియన్ వాహనాలను వెనక్కి పిలిపించాలని నిర్ణయించుకుంది. 

ఒక జీప్ చెరోకీని ఇంటర్నెట్ కనెక్టివిటీ కలిగి ఉన్న వినోద వ్యవస్థ ద్వారా హ్యాక్ చేశారు. క్రైస్లర్ సంస్థ దాని వాహనాలను హ్యాక్ చేయడం ఒక "నేర చర్య" గా పేర్కొంటూ తన ప్రభావిత వాహనాలను సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయడానికి స్వచ్ఛందంగా ఒక రీకాల్ జారీ చేసింది. 

భద్రతా పరిశోధకులైనటువంటి చార్లీ మిల్లెర్ మరియు క్రిస్ వలసేక్ , ఒక హ్యాకర్ జీప్ చెరోకీ లో మొబైల్ నెట్ వర్క్ తో కనెక్ట్ అయి ఉన్నటువంటి రిమోట్ ద్వారా సాధ్యమయ్యే కారు యొక్క వినోద వ్యవస్థను ఎలా నియంత్రించగలరు అనే అంశం మీద వారు పరిశోధన కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు పరిశోధకులు, అధ్యయనానికి మరియు వ్యవస్థ అభివృద్ధికి కొన్ని సంవత్సరాలు పరిశోధన జరిపి, వచ్చే నెలలో జరగనున్న డెఫ్ కాన్ హ్యాకర్ సమావేశంలో వీటి గురించిన పూర్తి వివరాలను అందించనున్నారు. 

యుఎస్ లో మా సంస్థ యొక్క యు కనెక్టివిటీ సిస్టమ్ తో ఉన్నటువంటి కార్లను మాత్రమే మేము వెనక్కి పిలిచాము మరియు యుకె లో అమ్ముడైనటువంటి కార్ల విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు అని ఫియాట్ క్రైస్లర్ సంస్థ ప్రకటించింది. 

అయితే, దాని యొక్క డిజిటల్ రేడియో వ్యవస్థ ద్వారా ఒక కారును హ్యాక్ చేయడం సాధ్యమేనని యుకె యొక్క ఎన్ సి సి గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది. 

ఫియట్ క్రైస్లర్ సంస్థ కూడా ఈ యొక్క భద్రతా సమస్య అయిన హ్యాకింగ్ విషయం గురించి చర్చిస్తున్నామని చెబుతూ "అవసరమైన ఏకాగ్రత మరియు విస్తృత సాంకేతిక పరిజ్ఞానం, వాహనం యొక్క భౌతికమైన యాక్సెస్ గురించి దీర్ఘకాలికంగా ఒక అవగాహన మరియు కోడ్ వ్రాయడానికి దీర్ఘకాల సమయం వాటితో పాటుగా సాఫ్ట్ వేర్ ను అభిసంధానం చేయడం అవసరం అని తెలిపింది". అంతేకాకుండా, వీటినన్నింటిని క్రిమినల్ యాక్షన్ కింద పరిగణలోకి తీసుకుని చట్టపరంగా చర్య తీసుకోవచ్చు అని ప్రకటించింది. 

ప్రభావితమైన మోడల్స్ 

  •  2013-2015 ఎం వై  డాడ్జ్ వైపర్ ప్రత్యేక వాహనాలు 
  •  2013-2015 రామ్ 1500, 2500 మరియు 3500 పికప్స్ 
  •  2013-2015 రామ్ 3500, 4500, 5500 చాసిస్ క్యాబ్స్ 
  •  2014-2015 జీప్ గ్రాండ్ చెరోకీ మరియు చెరోకీ ఎస్యువి 
  •  2014-2015 డాడ్జ్ దూరాంగో ఎస్యువి 
  •  2015 ఎం వై  క్రైస్లర్ 200, క్రైస్లర్ 300 మరియు డాడ్జ్ ఛార్జర్ సెడాన్ 
  •  2015 డాడ్జ్ ఛాలెంజర్ స్పోర్ట్స్ కూపెస్
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience