బ్రెయిన్ వేవ్స్ కొలిచేందుకు సిక్స్త్ సెన్స్ మైండ్ సైన్స్ పరిశోధన చేస్తున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్

ప్రచురించబడుట పైన Jun 25, 2015 01:48 PM ద్వారా Bala Subramaniam

  • 1 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై: జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్త రహదారి భద్రత టెక్నాలజీ వ్యవస్థను మన ముందుకి తీసుకు రాబోతున్నారు అది, వారు రోడ్లపై ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అభివృద్ది చేస్తోన్న కొత్త పరిశోధనా పథకం. ఈ కొత్త పరిశోధన ప్రాజెక్టును కంపెనీ, మైండ్ సెన్స్ పరిశోధన అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు మొదలుకొని, మెడిసిన్ మరియు ఏరోస్పేస్, డ్రైవర్ యొక్క హార్ట్ రేట్ మానిటర్, శ్వాసక్రియ, మరియు డ్రైవర్ ఒత్తిడి గుర్తించడానికి మెదడు సూచించే స్థాయిలు, అలసట, మరియు ఏకాగ్రత లేకపోవడం, చిన్నగా చెప్పాలంటే, నాడీ స్పందన మరియు కంపనాల ద్వారా మీ శరీరం మరియు మెదడు యొక్క హెచ్చరికలను అర్థం చేసుకోగలుగుతుంది. 

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ అయిన డాక్టర్ వోల్ఫ్ గ్యాంగ్ ఎపిల్ మాట్లాడుతూ " ప్రస్తుతం ఏరోస్పేస్ మరియు వైద్యశాస్త్రం లో వాడుతున్న కొన్ని సాంకేతిక పరిఙ్ఞానాలను మేము నమ్ముతున్నాము, ఇది రహదారి భద్రతను మెరుగుపరచడానికి సహాయ పడుతుందని మరియు డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము అని అన్నారు. ప్రస్తుతం కారు ఒక స్మార్ట్ వినియోగంగా మారింది మరియు కటింగ్ ఎడ్జ్ సెన్సార్లను ఎక్కువగా వినియోగించుకుంటున్నాయి. ఈ పరిశోధనా ప్రాజెక్టులు ఇంకా పరిశీలిస్తున్నాము , ఇది వినియోగదారులకు మరియు ఇతర రోడ్ వినియోగదారుల ప్రయోజనం కోసం ఎలా వినియోగపడుతుందో ఆ విధంగా మేము దీనిని మీకు అందించే ప్రయత్నం చేస్తాము". అని ఆయన వాఖ్యానించారు. 

ఈ కొత్త పరిశోధన యొక్క ఒక కీలకమైన అంశం ఏమిటనగా డ్రైవర్ అప్రమత్తంగా మరియు డ్రైవింగ్ పైన దృష్టి పెట్టి ఉన్నాడా లేదా అనే విషయం బ్రెయిన్ వేవ్స్ ని కొలిచే మానిటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ, డ్రైవర్ చూపు రోడ్ పైన ఉండి దృష్టి మాత్రం వేరే చోట ఉన్న యెడల డ్రైవర్ డ్రైవింగ్ పైన దృష్టి పెట్టలేదని అర్థం, అటువంటి సమయం లో ఆ సెన్సార్స్ ఒక హెచ్చరిక చిహ్నం లేదా ధ్వని ని డ్రైవర్ కి అందజేస్తుంది లేదా కొంచెం జాగ్రత్తగా ఉండమని రోడ్డు మీద ఉన్న ఇతరులకి హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి మేము దీనిని ఎలా గుర్తించాలి మరియు ప్రమాదాలు జరగకుండా ఎలానియంత్రించాలి అనే అంశం మీద పరిశోధన చేస్తున్నాము అన్నారు. 

మైండ్ సెన్స్ ఎలా తెలుసుకోగలదు అంటే, ఒకవేళ, డ్రైవర్ పగటి కలలో లేదా ప్రయాణ సమయంలో నిద్రిస్తున్న అనుభూతి ని ఉన్నట్లయితే స్టీరింగ్ వీల్ సెన్సార్లు ద్వారా సిస్టమ్ బ్రెయిన్ వేవ్స్ ని చదవగలుగుతుంది తద్వారా యాక్సిలేటర్ పెడల్ ద్వారా కంపనాల తో డ్రైవర్ కి హెచ్చరికలు జారీ చేస్తుంది. 

ఇతర పరిశోధనలు వచ్చేసి డ్రైవర్ సంక్షేమ పర్యవేక్షణ కొరకు, ఇది డ్రైవర్ సీటులో ఇమిడి ఉన్న మెడికల్ గ్రేడ్ సెన్సార్ ను ఉపయోగించి డ్రైవర్ శ్రేయస్సును పర్యవేక్షిస్తుంది. ముందు సమాచార స్క్రీన్, మిడ్ఎయిర్ టచ్ ను ఉపయోగించి డ్రైవర్ యొక్క చేతి కదలికలను ట్రాక్ చేసి, సిస్టమ్ ఎనేబుల్తో కారులో పొందుపర్చిన కెమెరాల ద్వారా కనుగొనవచ్చు. డ్రైవర్ ఏ బటన్ ను నొక్కాలో తెలియనప్పుడు అది బటన్ ఎంపిక మిడ్ ఎయిర్ లో జరుగుతుంది. హప్టిక్ యాక్సిలిరేటర్ పెడల్ ను ఉపయోగించి డ్రైవర్ స్పందన వేగం పెంచడానికి కమ్యూనికేట్ చేయడానికి మరియు సరైన చర్య తీసుకోవడానికి నిర్ధారణ కోసం దీనిని ఉపయోగిస్తారు.

ద్వారా ప్రచురించబడినది

Write your వ్యాఖ్య

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?