జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ఇన్ కంట్రోల్ యాప్స్ ని ప్రారంభిస్తుంది

ప్రచురించబడుట పైన Dec 21, 2015 04:03 PM ద్వారా Raunak

  • 1 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ ప్లాట్‌ఫార్మ్ బోష్ తో కలిపి అభివృద్ధి చేయబడింది

జైపూర్: జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా Bosch ప్రవేశపెట్టిన ఇన్‌కంట్రోల్ యాప్స్ తో ఒక కొత్త స్మార్ట్ఫోన్ సంఘటితమైన వేదికగా ఉంది. దీని సహాయంతో, వినియోగదారులు వాహనం యొక్క సమాచార వినోద వ్యవస్థ టచ్ స్క్రీన్ ని ఫోన్ యొక్క ఇంటర్ఫేస్ తో ప్రతిభింబించేలా చేయవచ్చు మరియు ఎన్నుకున్న ప్రముఖ యాప్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. కంపెనీ కారు యొక్క సమాచార వినోద వ్యవస్థ నుండి ఉపయోగించడానికి అప్లికేషన్ల ప్రారంభ సెట్ ని విడుదల చేసింది, ఈ యాప్స్ NDTV, హంగామా, MapmyIndia మరియు Zomato వంటి యాప్స్ వలే భారత వినియోగదారులకు నిర్దిష్టమైనవి. అంతేకాక, ఫోర్డ్ ఇండియా SYNC సమాచార వినోద వ్యవస్థతో ఇదేవిధమైన ఏకీకరణ అందిస్తుంది. ఈ లక్షణం తదుపరి సంవత్సరం ప్రారంభం నుండి JLR కార్లలో అందుబాటులో ఉంటుంది.

"InControl యాప్స్ మా వాహనాల మొత్తం లగ్జరీ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు వారి ఇష్టమైన యాప్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి మరింత అనుకూలమైన ఎంపికను అందిస్తాయి. ఇది ఇప్పటికే వారి డిజైన్, ప్రదర్శన, పనితనం, లగ్జరీ విషయాలలో ఆధరణ పొందిన ల్యాండ్ రోవర్ వాహనాలలో ఒక అద్భుతమైన కొత్త టెక్నాలజీ చేరిక." అని రోహిత్ సూరి, అధ్యక్షుడు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా తెలిపారు.

రాబర్ట్ బోస్చ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్,MD, విజయ్ రత్నాపర్కే మాట్లాడుతూ " ఫోన్లు అనేవి కార్లతో మమైకంగా ఉంటాయా లేదా ఫోన్లు బహుశా నావిగేషన్ వ్యవస్థను భర్తీ చేస్తాయా అని తరచుగా అడుగుతుంటారు. ఈ స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ పరిష్కారం ఇరువురికి చాలా ఉత్తమమైనది. మేము చివరికి టెక్నాలజీని ఒక అనుకూలమైన మరియు సురక్షితంగా పనిచేసేలా చేస్తాము. టెక్ అవగాహన వినియోగదారుల కోసం, మా ఉత్పత్తులు ఆనందంగా రూపొందించబడతాయి. మేము జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా తో కలిసి పనిచేస్తున్నందుకుగానూ చాలా ఆనందంగా ఉన్నాము." అని తెలిపారు.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది

Write your వ్యాఖ్య

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?