చైనా లో జరిగిన పేలుడు కారణంగా 5,800 జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు ధ్వంశం అయ్యాయి

ప్రచురించబడుట పైన Aug 24, 2015 11:52 AM ద్వారా Nabeel

  • 0 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

తాజాగా చైనా లోని టియాంజిన్ పోర్ట్ కెమికల్ వర్హౌస్ లో జరిగిన పేలుడు ఘటనలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాలు దగ్గరలో పార్క్ చేసి ఉండగా ధ్వంశం అయ్యాయి. పబ్లిక్ కి ప్రవేశం నిషేధించడం వలన మొత్తం నష్టం ఇంకా తెలియలేదు.  

ఆరోజు పోర్టులో 5,800 కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి అని బాంబే స్టాక్ ఎక్చేంజ్ కి టాటా మోటర్స్ వారు తెలిపారు. దాదాపు అన్ని ద్వంశం అయ్యే అవకాశం ఉంది కానీ ఇంకా సరైన సమాచారం అందలేదు. ఈ 5,800 కార్లు ఈమధ్యే చైనా కి రవాణా చేయబడ్డాయి మరియూ పొస్ర్ట్ లోని వివిధ ప్రదేశాలలో పార్క్ చేయబడి ఉఇన్నాయి. ఇవి రెండు వారాల వ్యవధిలో చైనా లో డెలివరీ చేయవలసి ఉంది. "పేలుడు జరిగిన ప్రదేశంలో ప్రవేశం నిషేధం కాబట్టి, వాహనాలు ధ్వంశం అయ్యినప్పట్టికీ మొత్తం సంఖ్య తెలియరాలేదు," అని ఒక ప్రకటన లో కంపెనీ వారు పేర్కొన్నారు.

టియాంజియన్ పోర్టులో రెనాల్ట్, మిత్సుబిషి, హ్యుండై, ఫోక్స్వేగన్ ,కియా మరియూ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మొదలగు వారికి చెందిన 15,000 వాహనాలు ఉన్నాయి అని సమాచారం. ఇవి దాదాపుగా రూ.6,500 కోట్ల ఖరీదు గలవి.  

జేఆరెల్ దాదాపుగా ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోదు అని మార్నింగ్ స్టార్ యొక్క ఆటో ఏనలిస్ట్ అయిన పియూష్ జైన్ పేర్కొన్నారు. ఎప్పుడైనా ఒక కస్టమరు లగ్షరీ కారు సెగ్మెంట్ లో కారు తీసుకుంటే, వారు ఆ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం తక్కువ. "డెలివరీ లో జాప్యం రావొచ్చునేమో కానీ కస్టమర్లు నిర్ణయం వెనక్కు తీసుకోవడం జరగకపోవచ్చును," అని ఆమె పేర్కొన్నారు. 

ఎకనామిక్ టైంస్ వారు అడిగిన ప్రస్నలకు బదులుగా, జేఆరెల్ కి ప్రతినిద్ది అయిన డెల్ సెహ్మార్ గారు ఈ-మెయిల్ లో ఏమన్నారంటే, " మేము పోర్టు అధికారులతో పని చేస్తున్నాము. పోర్ట్ లోకి మాకు ప్రవేశం అందిన వెనువెంటనే మాకు నష్టం యొక్క పూర్తి లెక్క తెలుస్తుంది. ఇప్పట్లో ఖచ్చితమైన వివరాలు చెప్పడం కష్టం," అని వివరించారు. 

ద్వారా ప్రచురించబడినది

Write your వ్యాఖ్య

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?