• English
  • Login / Register

గుంతలను గుర్తించి & ఇతర వాటికి సమాచారం ఇచ్చే నూతన సాంకేతిక పరిఙ్ఞానంతో జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్

జూన్ 15, 2015 10:36 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: జాగ్వార్ ల్యాండ్ రోవర్ చేసిన పరిశోధన యొక్క వినూత్న ప్రయత్నమే ఈ "పాత్ హోల్అలెర్ట్". ఈ రేంజ్ రోవర్ ఎవోక్ పరిశోధన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా రోడ్లపై ఉన్న గుంతలను గుర్తించి, వాటి యొక్క తీవ్రతను విశ్లేషించి మరియు మ్యాన్ హోల్స్ పైన ఉన్న కప్పుల స్థితిని గ్రహించి వాటి నిలుపుదలను మిల్లీసెకన్లలో సర్దుబాటు చేస్తుంది. ఈ గొప్ప పరిశోధన భద్రత సూచీని పెంచుతుంది అందుకే జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇంజనీర్లకు కూడా ఈ పరిశోధన ఒక క్లిష్టమైనదిగా అనిపించింది. ఈ పరిశోధన యొక్క మరొక అంశం ఏంటంటే అదే రోడ్ పైన ఉన్న ఇతర కార్లకు కూడా క్లౌడ్స్ ద్వారా ఈ సమాచారాన్ని అందజేస్తుంది. ఇది ఇతర రోడ్ వాహకులకు ప్రమాదకర మైన గుంతలు లేదా విభజించబడిన ఓపెన్ మ్యాన్ హోల్స్ యొక్క పైకప్పుల గురించి సమాచారం అందివ్వడం వలన వారు తమ వాహన వేగాన్ని తగ్గించుకుని మరియు ప్రమాదాన్ని నివారించుకునేందుకు ముందే హెచ్చరికలు జారీ చేస్తుంది.

దీనిలో హైలైట్ అంశం మాగ్నెరైడ్ ఇది అధిక పనితీరు మరియు సెమీ యాక్టివ్ సస్పెన్షన్ నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంది. ఈ అధునాతన వ్యవస్థ, నిజ సమయంలో శరీరం మరియు వీల్ మోషన్ సెన్సార్ల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా రోడ్ మరియు డ్రైవింగ్ పరిస్థితులకు స్పందిస్తుంది.దీనిలోని అయస్కాంత అణువులు ఒక ప్రత్యేక నియంత్రణా ద్రవంను కల్గి ఉండడం వలన వీలైనంత త్వరగా ఈ వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. ఈ అణువులు అయస్కాంత క్షేత్రానికి గురయ్యేటపుడు ఈ అవరోధక ద్రవంఘనీభవించి పెరగడం లేదా తగ్గడం వలన ఆ యొక్క అవలంబనం అవసరాన్ని బట్టి గట్టిగా లేదా సున్నితంగా మారుతుంది.

ఈ సందర్భంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్, గ్లోబల్ కనెక్ట్ కారు డైరెక్టర్, డాక్టర్ మైక్ బెల్ మాట్లాడుతూ "మా మాగ్నె రైడ్ ని రేంజ్ రోవర్ ఎవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ వాహనాల అధారంగా అమర్చారు, వీటి యొక్క ఆధునిక సెన్సార్లు ఆ వాహనం ప్రొఫైల్ ని తీసుకుని వాహన చక్రాలు కింద ఉన్నటువంటి రహదారి ఉపరితలం పైన ఉన్న గుంతలను, మ్యాన్ హోల్స్ పైకప్పులను, విరిగిన డ్రెయిన్ కవర్ల వివరాలను డ్రైవర్లకు చేరవేస్తుంది. అలాగే, ఇది మా వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన రైడ్ ఇస్తుంది. వాహనాల నుండి సెన్సార్స్ ద్వారా సమాచారం తీసుకుని బిగ్ డాటా ను అందించడం, మరియు ఇతర రోడ్ వినియోగదారులు క్షేమం కోసం సమాచారం చేరవేయడం మాకు దొరికిన భారీ అవకాశం అని అనుకుంటున్నాము. ఈ పరిఙ్ఞానం వాహనం చెడిపోవడం మరియు రోడ్డు మరమ్మతు మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience