నిస్సాన్ ఎక్స్-ట్రైల్ మార్కెట్లోకి మళ్లీ తిరిగి రానుందా?
జైపూర్: నిస్సాన్ నివేదిక ప్రకారం వచ్చే పండుగ సీజన్లో భారతదేశం లో తమ యొక్క ఆఫ్ రోడ్ ఎక్స్- ట్రైల్ ను తిరిగి మార్కెట్ లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారు దాని క్షీణించిపోతున్న అమ్మకాల వలన 2014 లో నిలిపివేయబడింది. అప్పటి వరకు ఇది తయారీదారు సంస్థకి ఫ్లాగ్షిప్ ఎస్యూవీగా పనిచేసింది. నిస్సాన్ వారిచే తాజాగా తయారు చేయబడిన ఈ కొత్త కారు డిజైన్ చాలా స్పోర్టి లుక్ తో కనిపిస్తోంది. నిస్సాన్ కూడా దీనిని నెమ్మదిగా పునరుద్ధరణ చేసి భారతదేశం లోని దాని శ్రేణిలో ఒకటిగా నిలవాలని ప్రయత్నం చేస్తోంది.
మునుపటి ఎక్స్-ట్రైల్ తో పోలిస్తే, కొత్తది స్పోర్టీ అప్పీల్ తో, ఇది ముఖ్యంగా ఒక విలక్షణమైన గ్రిల్ మీద దృష్టి సారించి కోణీయ హెడ్ల్యాంప్స్ ను కలిగి ఉంది. ఫ్లోయింగ్ సైడ్స్, ఒక సమకాలీన వెనుక సెటప్ తో పాటుగా ఉంటుంది. దీని లోపలి వైపు నాణ్యత ప్లాస్టిక్ మరియు నలుపు -లేత గోధుమరంగు మరియు సిల్వర్ ఇన్సర్ట్స్ కలయికతో తయారు చేయబడిన లేయర్డ్ డాష్ బోర్డ్ వంటి డిజైన్ తో ఇది రూపొందించబడింది. అంతేకాకుండా, నిస్సాన్ దీనిలో కొత్త సమాచార వ్యవస్థను మరియు ఇన్స్ట్రుమెంటేషన్ వ్యవస్థను కూడా జతచేసింది. దీనిలో సీట్లు 6 ప్రయాణీకులకు ప్లస్ డ్రైవర్ కు రూపొందించినట్లుగా భావిస్తున్నారు.
హుడ్ కింద నిస్సాన్ 2.0 డిసి ఐ మోటార్ నికలిగి ఉండి సివిటి గేర్బాక్స్ వ్యవస్థతో జత చేయబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తరువాత ఇది ఏడబ్లుడి వ్యవస్థతో జతచేయబడి అవుట్గోయింగ్ మోడల్ కి విరుద్ధంగా మరింత ఎక్కువ ఆఫ్ రోడింగ్ సామర్ధ్యానికి తగ్గట్టుగా ఉండవచ్చని ఊహిస్తున్నారు.
ఎక్స్ ట్రెయిల్ చాలా గొప్ప ఉత్పత్తి. కానీ ఇది సిబియు మార్గం నుండి రావడం మూలాన అధిక ధరను కలిగియుండి ఫార్చ్యూనర్ మరియు ఇతర కార్లను పక్కకి నెట్టి వేసింది. ఈ కారు చూడడానికి మిడ్ సైజెడ్ ఎస్యువిలా కనిపిస్తుంది. ఇది సిబియు లేదా సికెడి పద్దతి ద్వారా వచ్చే అవకాశం ఉంది.