ఇండియా టయోటా ఫార్చ్యూనర్ ప్రత్యర్థి MG D 90 SUV చివరకు డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది!
MG D 90 ఇటీవల భారతదేశంలో టెస్ట్ కి గురయ్యింది
- చైనాలోని గ్వాంగ్‌జౌ ఆటో షోలో MG D90 డీజిల్ ప్రదర్శించబడినది.
- ఇప్పటి వరకు, ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉండేది.
- కొత్త 2.0-లీటర్ డీజిల్ 8-స్పీడ్ AT తో 215PS పవర్ మరియు 480Nm టార్క్ ని అందిస్తుంది.
- 2020 ద్వితీయార్ధంలో ఇండియా లాంచ్ ఉండవచ్చని భావిస్తున్నాము.
- రూ .25 లక్షల నుంచి 30 లక్షల మధ్య ధరలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నారు.
- దీనిని చైనాలో D90 అని పిలుస్తారు, భారతదేశంలో ఇది కొత్త పేరుతో వచ్చే అవకాశం ఉంది
2021 ప్రారంభంలో భారతదేశంలో నాలుగు కొత్త SUV లతో హెక్టర్‌ను అనుసరిస్తామని MG మోటార్ హామీ ఇచ్చింది. వాటిలో ఒకటి మాక్సస్ D90 SUV అని భావిస్తున్నారు, ఇది భారతదేశంలో టెస్టింగ్ లో ఉన్నట్లు గుర్తించబడింది. SAIC గ్రూప్ (MG మరియు మాక్సస్ మాతృ సంస్థ) ప్రస్తుతం జరుగుతున్న గ్వాంగ్‌జౌ ఆటో షోలో SUV యొక్క 2.0-లీటర్ డీజిల్ ఇంజన్-అమర్చిన వేరియంట్‌ను ప్రదర్శించింది. కాబట్టి వీటన్నిటినీ ఏది కనెక్ట్ చేస్తుంది?
ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్‌లకు ప్రత్యర్థిగా ఉన్న ఈ బాడీ-ఆన్-ఫ్రేమ్, పూర్తి-పరిమాణ SUV ఇప్పటివరకు చైనా మార్కెట్ లో కేవలం టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో అమర్చబడి ఉంది. ఇది ఇప్పుడు కొత్త ఇంజిన్ 215Ps పవర్ మరియు 480Nm టార్క్ అందించే ట్విన్-టర్బో డీజిల్ యూనిట్ తో అందించబడుతుంది. ఇది పెట్రోల్ ఇంజిన్ వలె అదే 8-స్పీడ్ ZF ఆధారిత ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది.
2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ యూరో 6b ఎమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతుంది. అందువల్ల, రాబోయే డీజిల్ ఇంజిన్ నుండి ఇలాంటి ఎమిషన్ స్థాయిలను మేము ఆశిస్తున్నాము, ఇది త్వరలో అమలు చేయబోయే BS 6 ఎమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా సహాయపడుతుంది. SUV బోర్గ్ వార్నర్ నుండి N365 AWD వ్యవస్థను కూడా పొందుతుంది, ఇది ఆఫ్-రోడ్ క్రెడిన్షియల్స్ కి తోడ్పడుతుంది.
భారతదేశంలో, ఇది టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మహీంద్రా అల్టురాస్ G 4 వంటి వాటికి పోటీగా ఉంటుంది. 2020 ద్వితీయార్ధంలో భారతదేశానికి వచ్చినప్పుడు దీనికి కొత్త పేరు వచ్చే అవకాశం ఉంది. SUV ధరలను అంచనా వేయడానికి చాలా తొందరగా ఉన్నప్పటికీ, రూ .25 లక్షల నుంచి రూ .30 లక్షల మధ్య ఎక్కడైనా ఖర్చవుతుందని మరియు భారతదేశంలో MG కోసం ఫ్లాగ్‌షిప్ SUV గా అవతరించాలని మేము భావిస్తున్నాము.