రెనాల్ట్ క్విడ్ వాహనాన్ని, ఉత్పత్తి హబ్ గా ప్రకటించిన భారతదేశం

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం nabeel ద్వారా జనవరి 27, 2016 03:02 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Renault Kwid

రెనాల్ట్ భారతదేశం, క్విడ్  హాచ్బాక్ కోసం ఏకైక ఉత్పత్తి కేంద్రంగా ఉంటుంది అని నిర్ణయించింది. ఇది, దావోస్, స్విట్జర్లాండ్ లో కొనసాగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వద్ద ఈ రెనాల్ట్- నిస్సాన్ సిఈవో అయిన కార్లోస్ ఘోసన్ మాట్లాడుతూ నిర్ధారించాడు. త్వరలో ప్రపంచానికి ఎగుమతి చేయడం, రెనాల్ట్ క్విడ్ భారతదేశం లో మాత్రమే తయారు చేయబడుతుంది మరియు భారత తీరాల ద్వారా రవాణా చేయబడుతుంది. క్విడ్, భారత ఆటోమోటివ్ మార్కెట్ నుండి విభ్రాంతికరమైన స్పందన ను సేకరించింది మరియు ఇప్పటికీ మంచి వేగ గమనాన్ని కలిగి ఉంది. 

క్విడ్, ఉత్పత్తి విధానంలో 97% పైగా స్థానికీకరణ ను కలిగి ఉంది. దీని ఫలితంగా, ఇది రూ 2.56 - 3.53 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) చౌకైన ధర ను కలిగి ఉంది. ఇటువంటి పోటీ ధరతో, రెనాల్ట్ క్విడ్ 85,000 పైగా బుకింగ్ లను స్వీకరించింది. ఈ వాహనానికి, 799 సిసి స్థానభ్రంశం గల 3 సిలండర్ పెట్రోల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్, అత్యధికంగా 53 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 72 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ వాహనం, త్వరలో ఏ ఎంటి ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వాహన విజయంతో రెనాల్ట్ సంస్థ, 2016 ఆటో ఎక్స్పోలో క్విడ్ యొక్క ఏఎంటి మరియు 1- లీటర్ వెర్షన్ ను ప్రదర్శించనుంది. ఈ క్విడ్ యొక్క 1000 సిసి ఇంజన్ ఇటీవల బ్రెజిల్ లో గూడచర్యం చేయబడింది మరియు ఆటో ఎక్స్పో అనంతరం భారతదేశంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

రెనాల్ట్ కూడా డిసెంబర్ మధ్యలో క్విడ్ యొక్క ఉత్పత్తిని పెంచేందుకు నిర్ణయించింది. అంతేకాకుండా, ఈ క్విడ్ వాహనాల బుకింగ్స్ 50,000 గుణాంకాన్ని దాటింది. రెనాల్ట్ సంస్థ, ఈ క్విడ్ వాహనాల ఉత్పత్తిని నెలకు 6,000 నుండి 10,000 యూనిట్లకు పెంచనుంది. ఈ పెరుగుదల, ఫిబ్రవరి లేదా మార్చి 2016 లో ఉండే అవకాశం ఉంది. రెనాల్ట్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయిన సుమిత్ సావ్నే మాట్లాడుతూ, "క్విడ్ ఒక గొప్ప విజయాన్ని సాదించింది మరియు ఈ సామర్ధ్యం తో ఈ వాహనానికి ఉండే డిమాండు మరింత పెరిగింది. 98 శాతం స్థానిక కంటెంట్ తో పాటు మా విక్రేతలతో ఈ వాహన ఉత్పత్తి ని మరింత పెంచదలిచారు. చెన్నై వర్షాలు చాలా భాద కలిగించాయి కానీ, డిమాండ్ ను నిలబెట్టుకోవడం కోసం అదనపు గంటలు పని చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు".  

ఇది కూడా చదవండి: రెనాల్ట్ ఇండియా నవంబర్ లో 144% అమ్మకాలు వృద్ధి నమోదు చేసుకొనేందుకు దోహదపడిన క్విడ్​

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన రెనాల్ట్ క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience