• English
  • Login / Register

ఇండియా బౌండ్ : బహిర్గతమయిన హోండా బీఅర్ వి ప్రోటో టైప్ -ఇండోనేషియా నుండి లైవ్ షో

హోండా బిఆర్-వి కోసం raunak ద్వారా ఆగష్టు 20, 2015 01:56 pm ప్రచురించబడింది

  • 17 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

బిఆర్-వి రెనాల్ట్ డస్టర్, హ్యుందాయ్  క్రెటా మరియు నిస్సన్ టెరానో కి హోండా యొక్క సమాధానం లాంటిది. ఇది 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ తో మరియు 7-సీటర్ తో రాబోతున్నది. 

టాంగెరాంగ్: హోండా తమ యొక్క బిఆర్-వి మోడల్ ను ప్రస్తుతం జరుగుతున్న 2015 గైకిండో ఇండోనేషియా అంతర్జాతీయ ఆటో షో (జి ఐ ఐ ఏ ఎస్) లో అధికారికంగా వెల్లడించింది. ఇండోనేషియా లో బిఆర్-వి ధర 230-265 మిలియన్ ఇండోనేషియన్ రుపియా (ఐ డి ఆర్) మొదలుకుని ఉంది అనగా దాదాపు రూపాయలు 10.80-12.40 లక్షలు ఉంటుంది. ఇండోనేషియా లో దీని బుకింగ్స్ ప్రారంభం చేశారు మరియు దీని డెలివరీలు 2016 సంవత్సరం ప్రారంభంలో నిర్ణయించారు. అయితే హోండా దీనిని భారతదేశం లో ప్రవేశపెట్టే విషయాన్ని నిర్ధారించలేదు, కానీ ఈ సంస్థ తమ తదుపరి ప్రారంభంతో ఫిబ్రవరి 2016 లో భారతీయ ఆటో ఎక్స్పోలో బహిర్గతం చేయవచ్చునని ఆశిస్తున్నారు.

హోండా బిఆర్-వి లో ఆఫర్ ఏముంది? 

  • మొదటగా, ఇది యాక్టివ్ సాలిడ్ మోషన్ డిజైన్ ఫిలాసఫీ తో మరియు ఎల్ ఈడి పొజీషనింగ్ లైట్లతో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ స్పోర్ట్స్ అంశంతో కూడిన క్రోమ్ గ్రిల్ ను కలిగి ఉంది. ఇంకా ఇది ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ ఒక ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేటు మరియు క్రోమ్ ఇన్సర్ట్స్ తో కూడి ఉంది.
  • దీని సైడ్ ప్రొఫైల్ ను చూసినట్లయితే, ఇది బ్రియో/ అమేజ్ / మొబిలియో వంటి కార్ల యొక్క క్యారెక్టర్ లైన్స్ పోలికను గుర్తుచేస్తుంది. 

  • ఈ వాహనం 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో సవారీ చేయబడుతుంది మరియు ఇది 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది. 

  • బీఅర్ వి, ఎల్ ఇ డి టెయిల్ లైట్స్ లక్షణంతో అనుసంధానం చేయబడి ఉంది.   
  • దీని అంతర్భాగాలు సూక్ష్మమైన ట్వీక్స్ తో సిటీ మరియు జాజ్ ని పోలి ఉంటాయి. 
  • భారతదేశం లో హోండా పూర్తి శ్రేణిలా, బీఅర్ వి  టచ్స్క్రీన్ ఆడియో వీడియో మరియు నావిగేషన్ సమాచార వ్యవస్థ లక్షణాలను కూడా  కలిగి ఉంది.    
  • బీఅర్ వి లో ప్రధాన లక్షణం, దాని పోటీదారుల వలే కాకుండా ఇది మూడు వరుస సీటింగ్ తో ఏడుగురు కూర్చునే విధంగా ఉంటుంది. మూడవ వరుసలో సీట్లు 50:50 నిష్పత్తిలో మడవగలిగి మరియు అన్ని వరుసలు ఎసి వెంట్లను కలిగి ఉంటాయి.  

భద్రత 

  • విఎసే- వాహన స్టెబిలిటీ మేనేజ్మెంట్
  • హిల్ స్టార్ట్-అసిస్ట్
  • ఈబిడి తో ఏబిఎస్
  • డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్

రంగులు 

  • టఫ్ఫెటా వైట్
  • ఆధునిక సిల్వర్ మెటాలిక్
  • క్రిస్టల్ బ్లాక్ పర్ల్
  • మిస్టీ గ్రీన్ పర్ల్
  • లూనార్ సిల్వర్ మెటాలిక్
  • పాషన్ రెడ్ పర్ల్

ఇంజిన్ ఎంపికలు పరంగా, ఇది  1.5-లీటర్ ఐ-విటెక్ ఇంజన్ తో    6600rpm వద్ద  120ps శక్తిని మరియు  4600rpm వద్ద  145nm టార్క్ ని అందిస్తూ సివిటి ఆటోమెటిక్ తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. అయితే, భారత మార్కెట్  1.5 లీటర్ ఐ-విటెక్పెట్రోల్ తో పాటు 1.5 లీటర్ ఐ-డి టెక్ ని అందిస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Honda బిఆర్-వి

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience