2015 ఐఐఎంఎస్ (ఇండోనేషియా అంతర్జాతీయ మోటార్ షో) వద్ద జిఎల్ సి ని ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్
ఆగష్టు 21, 2015 04:29 pm nabeel ద్వారా సవరించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మెర్సిడెస్ బెంజ్ 2015 ఐఐఎంఎస్ (ఇండోనేషియా అంతర్జాతీయ మోటార్ షో) వద్ద జిఎల్ సి ని ప్రదర్శించింది. ఈ కారు మొదట జర్మనీ లో బహిర్గతమైంది , కానీ అది జిఎల్ సి యొక్క ప్రపంచ ఆటో షో ప్రీమియర్. భారతదేశంలో ఇది 2016 మధ్య భాగంలో ప్రారంభం కావచ్చని అంచనా. ఈ కొత్త కారు ప్రస్తుత తరం జిఎల్ కె కంటే చాలా విశాలంగా ఉంది. మెర్సిడీస్ సంస్థ జిఎల్ సి పెద్ద షోల్డర్ రూం, లెగ్రూం మరియు 1,600 లీటరు బూట్ సామర్ధ్యంతో 1550 లీటరు పాత దాని కంటే పెద్దది అని తెలిపింది. కారు పరిమాణం దాని ముందు కంటే కొద్దిగా పెద్దది కానీ 19% అధిక ఇంధన సామర్ధ్యం అందిస్తుంది. జిఎల్ కె లా కాకుండా కొత్త జిఎల్ సి కుడి చేతివైపు డ్రైవింగ్ లో అందుబాటులో ఉంది మరియు సి-క్లాస్ యొక్క మాడ్యులర్ వెనుక చక్రాల ఆర్కిటెక్చర్ (ఎం ఆర్ ఎ వేదిక) పై ఆధారపడి ఉంటుంది.
ఇండోనేషియా జిఎల్ సి 250 4 మాటిక్ వేరియంట్ ని అందుకుని 211hp శక్తిని మరియు 350Nmటార్క్ ని 2 లీటర్ నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజన్ నుండి అందిస్తుంది. 9-స్పీడ్ 9జి-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ జిఎల్ సి ని 8 సెకెన్లలో 0 -100 కిలోమీటర్లు వెళ్ళేలా మరియు 222Km/h గరిష్టంగా చేరుకొనేలా చేస్తుంది.
మెర్సిడీస్ బెంజ్ జిఎల్ సి ప్రారంభంలో ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సహా 4 వేరియంట్లతో ప్రపంచంతో ప్రారంభించబడుతుంది చెప్పారు. అన్ని జి ఎల్ సి మోడళ్ళు జిఎల్ సి 220డి, జిఎల్ సి 250 డి, జిఎల్ సి 250 మరియు జీఎల్ సి350ఇ లగ్-ఇన్ హైబ్రిడ్ ఇవన్నీ 2.0 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో అందుబాటులో ఉంది.
Diesel
MODEL | BHP | TORQUE |
GLC 220d | 170 | 400 Nm |
GLC 250d | 204 | 500 Nm |
Petrol
MODEL | BHP | TORQUE |
GLC 250 | 211 | 350 Nm |
GLC 350e | 320 | - |
ఈ జిఎల్ సి 350 ఇ ప్లగ్- ఇన్ హైబ్రిడ్ 38.46 కె ఎం/ఎల్ ఇంధన సామర్ధ్యాన్ని మరియు 34కి.మీ విద్యుత్ ద్వారా అందిస్తుంది.
ఈ 2 లీటర్ ఇంజిన్ 9జి ట్రానిక్ ఆటోమేటిక్ యూనిట్ తో అమర్చబడి ఉంటుంది. అలానే హైబ్రిడ్ 7జి-ట్రానిక్ ఆటోమేటిక్ యూనిట్ తో అమర్చబడి ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ లో 4 మాటిక్ అన్ని జి ఎల్ సి నమూనాలలో ఒక ప్రామాణికమైన లక్షణంగా ఉంచింది. ఎయిర్మాటిక్ ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థ ఆఫ్-రోడ్ ప్యాక్ కోసం ఆప్ష్నల్ గా అందించబడుతుంది.