హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మళ్ళీ మా కంటపడింది, త్వరలో లాంచ్ కానుంది
హ్యుందాయ్ వెర్నా 2020-2023 కోసం sonny ద్వారా మార్చి 03, 2020 01:56 pm ప్రచురించబడింది
- 35 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కామో తో కప్పబడి ఉన్నప్పటికీ, ఇది రష్యా-స్పెక్ హ్యుందాయ్ సెడాన్ లాగా కనిపిస్తుంది
- ఫేస్‌లిఫ్టెడ్ వెర్నా లాంచ్ కి ముందు టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది.
- ఇది ఇటీవల వెల్లడించిన రష్యా-స్పెక్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.
- కొత్త వెర్నా కనెక్ట్ చేయబడిన కార్ టెక్ కలిగి ఉన్న పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో అప్‌డేట్ చేయబడిన డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది.
- ఇది కొత్త BS 6 పవర్‌ట్రైన్‌లను - 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ లను న్యూ-జెన్ క్రెటా నుండి పొందుతుంది.
- ఫేస్‌లిఫ్టెడ్ వెర్నా ఏప్రిల్ 2020 నాటికి లాంచ్ అవుతుందని భావిస్తున్నాము.
హ్యుందాయ్ వెర్నా అప్‌డేట్ చేసిన BS6 పవర్‌ట్రెయిన్ లతో పాటు ఫేస్‌లిఫ్ట్‌ను అందుకోనుంది. రాబోయే ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ ఇప్పుడు రహస్యంగా టెస్టింగ్ చేయబడింది మరియు ఇది ఇటీవల ఆవిష్కరించబడిన రష్యా-స్పెక్ మోడల్ లాగా కనిపిస్తుంది.
స్పైడ్ మోడల్ సోలారిస్ అని పిలువబడే రష్యా-స్పెక్ మోడల్ వలె అదే అలాయ్స్ మరియు మెష్ గ్రిల్‌ను కలిగి ఉంది. దీని వెనుక భాగం కొత్త సోలారిస్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇంతకు ముందు చూసిన చైనా-స్పెక్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మరింత పోలరైజింగ్ రూపాన్ని కలిగి ఉంది మరియు హ్యుందాయ్ బదులుగా మరింత సూక్ష్మమైన ఫేస్‌లిఫ్ట్‌ను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తత్ఫలితంగా, వెర్నా దాని స్పోర్టియర్ అంశాలలో కొన్నింటిని కోల్పోతుంది.
ఇంటీరియర్ విషయానికొస్తే, కొత్త వెర్నాలో ఫ్లోటింగ్ 8.0-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే మరియు కొత్త ఎయిర్ వెంట్స్‌తో అప్‌డేట్ చేయబడిన డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంటుంది. కొత్త IRVMలో చూసినట్లుగా, ఫేస్‌లిఫ్టెడ్ సెడాన్ లో బ్లూలింక్ కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది బహుశా ప్రస్తుత మోడల్ మాదిరిగానే స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్ కన్సోల్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. వెర్నా సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల రూపంలో సౌకర్యాలను అందిస్తూనే ఉంటుంది.
హ్యుందాయ్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్నాను కొత్త BS6 ఇంజన్ ఆప్షన్స్‌తో అప్‌డేట్ చేస్తుంది, ఇది న్యూ-జెన్ క్రెటాతో పంచుకుంటుంది. అయినప్పటికీ, ఇది 1.5-లీటర్ పెట్రోల్ (115Ps / 114Nm) మరియు డీజిల్ (115Ps / 250Nm) ఇంజన్లను మాత్రమే పొందుతుంది, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (140 Ps/ 242Nm) ను కోల్పోతుందని భావిస్తున్నాము. రెండు BS 6 ఇంజన్లు ఆటోమేటిక్ ఆప్షన్‌ను కూడా పొందుతాయి. ప్రస్తుత శ్రేణి BS 4 ఇంజన్లు - 1.4-లీటర్ డీజిల్, 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ 2020 ఏప్రిల్ నాటికి నిలిపివేయబడతాయి.
2020 వెర్నా ఫేస్‌లిఫ్ట్ అవుట్‌గోయింగ్ మోడల్ యొక్క ఎంట్రీ-స్పెక్ తో సమానంగా ఉంటుంది, టాప్-ఎండ్ లో ధర ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం, వెర్నా ధర రూ .8.18 లక్షల నుండి రూ.14.08 లక్షల(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను మార్చిలో విడుదల చేయనున్నారు. న్యూ-జెన్ హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, BS 6 స్కోడా రాపిడ్, మరియు BS 6 వోక్స్వ్యాగన్ వెంటో వంటి వాటికి వ్యతిరేకంగా ఇది తన పోటీని కొనసాగిస్తుంది.
మరింత చదవండి: వెర్నా ఆటోమేటిక్
0 out of 0 found this helpful