హ్యుందాయ్ పాత ఎలైట్ ఐ20 మోడళ్ళలో ఆండ్రాయిడ్ ఆటో నవీకరణను అందిస్తుంది
ఏప్రిల్ 22, 2019 10:19 am cardekho ద్వారా ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ ఇండియా ఎలైట్ ఐ 20 కి ఆండ్రాయిడ్ ఆటో కోసం ఒక సాఫ్ట్వేర్ నవీకరణను విడుదల చేసింది. 2017 ఏప్రిల్లో ఉత్పత్తి చేయబడిన నమూనాలకి మాత్రమే ఈ నవీకరణ వర్తించబడుతుంది. ఆటో ఎక్స్పో 2018లో ప్రవేశపెట్టిన 2018 ఎలైట్ ఐ 20 ఫేస్లిఫ్ట్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీ వంటివి దాని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కు అంతర్నిర్మితంగా ఉంది.
హ్యుందాయ్ సంస్థ 2015 చివరి రెండో భాగంలో, మొదట 7 అంగుళాల ఏవిఎన్ యూనిట్ను ఎలైట్ ఐ 20 కు జత చేసింది. ఈ వ్యవస్థ వీడియోలను, ఇన్బిల్ట్ మ్యాప్ లను ప్లేబ్యాక్ చేయగలదు మరియు బ్లుటూట్, ఆక్స్ అలాగే యుఎస్బి కనెక్టివిటీతో అందుబాటులో ఉంది. ఏప్రిల్ 2017 తరువాత అందించబడిన హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 నమూనాలకు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే రెండింటినీ అందిస్తున్నాయి. మీ కారు నవీకరణ కోసం అర్హత ఉందా అని తెలుసుకోవడానికి, మీ సేవా సలహాదారులను సంప్రదించండి.
పూణే మరియు ఢిల్లీలో ఉన్న హ్యుందాయ్ సర్వీసు కేంద్రాలతో కార్దెకో ఈ విధంగా మాట్లాడారు, అపాయింట్మెంట్ ఒకే అయిన తర్వాత అర్హతగల వినియోగదారులు సాఫ్ట్వేర్ నవీకరణ కోసం సేవా కేంద్రాలకు తమ వాహనాలను పంపవచ్చని తెలుసుకున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ కనీసం సగం రోజు పడుతుంది కానీ ఎక్కువ సమయం ఉంచడానికి భావిస్తున్నారు, సేవ కేంద్రాలు- ఒక రోజు మొత్తం కారును వదలాలని వినియోగదారులకు సలహా ఇచ్చారు. సాఫ్ట్వేర్ నవీకరణ తర్వాత, ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు యుఎస్బి పోర్ట్ ద్వారా వారి వాహనాల ఇన్ఫోటైన్మెంట్ యూనిట్లకు కనెక్ట్ చేయగలరు మరియు ప్రామాణిక ఆండ్రాయిడ్ లో అందుబాటులో ఉన్న గూగుల్ మ్యాప్స్, గూగుల్ మ్యూజిక్, ఫోన్ కాంటాక్టులు మరియు ఇతర విడ్జెట్లను ఉపయోగించగలరు. ఇవి కూడా చదవండి: హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 వర్సెస్ హోండా జాజ్ : సివిటి ఆటోమేటిక్ వేరియంట్స్ పోలికలు
ఎలైట్ ఐ 20 వాహనాన్ని కలిగి ఉన్న యజమానులు, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తే ఈ వార్తలు వారికి మంచివి. అయితే, ఆపిల్ యజమానులకు ఇంకా కార్ప్లే సౌలభ్యం పొందలేరు. మారుతి సుజుకి కూడా ఇదే ఆండ్రాయిడ్ ఆటో సాఫ్ట్ వేర్ కోసం నవీకరణను తెలిపింది, ఈ సంస్థ మునుపటి సంవత్సరం జూలైలో - ఎస్ఎల్డిఏ (స్మార్ట్ఫోన్ లింక్గేజ్ డిస్ప్లే ఆడియో) కోసం సియాజ్, బాలెనో మరియు ఎస్- క్రాస్ టాప్ మోడళ్లను రూపొందించింది. ఇవి కూడా చదవండి: హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 సివిటి ప్రారంభం; ఈ వాహనం, బాలెనో మరియు జాజ్ ఆటోమేటిక్ లకు ప్రత్యర్థిగా నిలబడబోతుందా.
మరింత చదవండి: ఎలైట్ ఐ 20 డీజిల్