• English
  • Login / Register

రాబోయే రోజుల్లో భారతదేశం లో హ్యుందాయ్ కొత్త వేరియంట్ విడుదల - క్రీటా

హ్యుందాయ్ జెనిసిస్ కోసం sourabh ద్వారా జూన్ 02, 2015 02:18 pm సవరించబడింది

  • 23 Views
  • 9 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హ్యుందాయ్ వేరియంట్లు భారతదేశంలో నలుమూలలా విస్తరించేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, నేడు క్రీటా వంటి నామకరణం కలిగిన ఒక కొత్త SUV ను ప్రకటించింది. భారతదేశం ఈ SUV విభాగంలో పెరుగుతున్న డిమాండ్ కారణం గా, తయారీదారుడు ఒక క్రొత్త వేరియంట్ ఉత్పత్తిని భారతదేశం లో 2015 ద్వితీయార్థంలో ప్రారంబించనున్నారు. ఆ తరువాత వాటి అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించనున్నారు.

హ్యుందాయ్ ప్రకారం, క్రీటా అనేది కొరియన్ వాహన తయారీదారుడైన ఒక అంతర్జాతీయ ఉత్పత్తి. అంతేకాకుండా ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాహన విభాగం లో ఒకటి. సంస్థ జారీ చేసిన ఒక పత్రిక విడుదలలో ఇలా ఉంది "క్రీటా అనేది హ్యుందాయ్ మోటార్స్ ఆధునిక ప్రీమియం మోడల్- ఇది "సాధారణ, సృజనాత్మక, సంరక్షణ" 'క్రీటా' పేరు సాధారణ మరియు గుర్తుంచుకోవడానికి సులభం. క్రీటా యొక్క ఉచ్చారణ 'క్రియేటివ్' పదంతో స్వాగతం పలికేలా ఉంటుంది. రానున్న రోజుల్లో క్రీటా పేరు అన్ని ప్రపంచ మార్కెట్లలో ఉపయోగించపడబోతుంది."

SUV విభాగంలో, హ్యుందాయ్ భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ హ్యుందాయ్ సాంటా ఫీ. దీని ధర 26 లక్షల నుండి 30 లక్షల ధర పరిధిలో ఉంది. ఈ హ్యుందాయ్ లో ఇప్పటి వరకూ కాంపాక్ట్ SUV లేదు. రాబోయే రోజుల్లో రానుంది. ఇది ప్రవేశపెట్టిన తరువాత ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు రెనాల్ట్ డస్టర్ వాటితో పోటీ పడే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం SUV విభాగంలో మహింద్రా మరియు టాటా వాహనాలు ప్రధమ స్థానంలో ఉన్నాయి.  

గత నెల మే లో హ్యుందాయ్ కార్లు అయినటువంటి ఎలైట్ ఐ 20 మరియు ఐ 20 యాక్టివ్ వాహనాల అమ్మకాలు ఈ విధంగా చోటు చేసుకున్నాయి. ఈ వాహనాలు రీటైల్ మార్కెట్ లో 52,515 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. మరియు దేశీయ మార్కెట్ లో 37,450 యూనిట్ల అమ్మకాలను చోటు చేసుకుంది. ఇది అంతా ఇలా ఉండగా ఇతర దేశాలకు 15,065 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది.  

 ఇప్పుడు హ్యుందాయ్ పేరు మాత్రమే ప్రకటించింది. తర్వాత నెలల్లో కంపెనీ, వాహనాల పవర్ట్రెయిన్ వివరణ మరియు ఫీచర్ల జాబితా బహిర్గతం చేయవచ్చు. త్వరలో మరిన్ని వార్తలను వీక్షించడానికి సిద్దంగా ఉండండి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Hyundai జెనిసిస్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కూపే కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience