• English
  • Login / Register

11 నెలల్లో ఐ 20 ఎలైట్ ద్వారా 1 లక్క యూనిట్లు అమ్మకాలు సాధించిన హ్యుందాయి ఇండియా

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 కోసం sourabh ద్వారా జూన్ 23, 2015 11:16 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హ్యుందాయ్ ఇండియా దాని ప్రీమియం హాచ్ ఎలైట్ ఐ 20 సాధించిన విజయంతో చాలా ఎత్తుకు కి చేరుకోగలిగేలా కనిపిస్తుంది. వాహన తయారీదారుడు దేశంలో 1,00,000 యూనిట్లు అమ్మకాలు చేసి మైలురాయిని చేరుకోగలిగింది. హ్యుందాయ్ ఆగస్టు నెలలో తదుపరి తరం ఎలైట్ ఐ 20 ప్రారంభించింది మరియు 11 నెలల అతి తక్కువ పరిధిలోనే కారు తయారీదారుడు ఒక లక్ష యూనిట్లని అమ్మగలిగారు. 2014-15 సంవత్సరంలో, ఎలైట్ ఐ 20, కార్దేకో యొక్క ప్రీమియం హ్యాచ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డులతో పాటూ పలు అవార్డులని సొంతం చేసుకుంది. 

హచ్ ప్రవేశపెట్టిన రెండవ నెలలోనే భారతదేశం లో టాప్ 10 అత్యంత అమ్ముడైన బ్రాండ్ల జాబితాకి చేరుకొని ఒక కొత్త బెంచ్ మార్కుని సృష్టించగలగడం అత్యంత ప్రశంసించవలసిన అంశం. 

దీని బాహ్య ప్రొఫైల్ విషయానికి వస్తే, ముందరి భాగం స్టైలిష్ కొత్త హెక్సాగోనల్ ఎయిర్ డ్యామ్, పునఃరూపకల్పన చేసిన హెడ్ల్యాంప్స్ మరియు బూమేరాంగ్ ఆకారంలో ఉన్న వెనుక టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. అంతర భాగానికి వస్తే, పూర్తిగా కొత్త డాష్బోర్డ్ నలుపు మరియు లేత గోధుమరంగు థీమ్ తో వెండి చేరికలతో అలంకరించబడుతున్నది. వీటిలో ఇంకా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఒక పెద్ద స్క్రీన్ తో అప్గ్రేడ్ ఆడియో వ్యవస్థ మరియు ఒక ఆధునిక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటూ ఏసి వెంట్లు మరియు పుష్ బటన్ స్టార్ట్ ని కలిగి ఉంది. 

ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో, హెచ్ఎంఐఎల్ సీఈవో అయిన మిస్టర్ బి ఎస్ సియో ఈ విధంగా మాట్లాడారు, " ఎలైట్ ఐ 20 11 నెలల్లో 100,000 అమ్మకాలు స్వీకరించడం ద్వారా వినియోగదారుల అపూర్వమైన ప్రతిస్పందన ఫలితంగా ఆనందంలో మునిగి తేలుతున్నాము. ఈ విజయం వినియోగదారులను మరింత చేరువయ్యేలాగ మరియు హ్యుందాయ్ ఉత్పత్తులపై విశ్వాసం పెంచుకునేలాగా చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మా ఉత్పత్తి ఎలైట్ ఐ 20 ని ఎంచుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన వారికి మరియు మైలురాయిని చేరుకోడానికి కృషి చేసిన వారికి, అలానే వినియోగదారులకి, ఛానల్ పార్ట్నర్స్ కి, మా ఉద్యోగులకిమరియు మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అని తెలిపారు. 

ఈ హాచ్ 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఆధారిత ఇంజిన్ 83పి ఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిష్టంతో అమర్చబడి ఉంటుంది. యు2 1.4 లీటర్ సీఅర్ డి ఐ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అమర్చబడి ఉండి గరిష్టంగా 90పి ఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 

was this article helpful ?

Write your Comment on Hyundai ఎలైట్ ఐ20 2017-2020

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience