ఎలీట్ ఐ 20 ప్రారంభమయిన దగ్గర న ుండి 1,50,000 అమ్మకాలను సాధించిన హ్యుందాయి సంస్థ
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 కోసం raunak ద్వారా నవంబర్ 27, 2015 04:51 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండవ తరం ఐ20 అనగా ఎలీట్ ఐ20 యొక్క 1,50,000 యూనిట్లు విక్రయించబడ్డాయని ప్రకటించింది. ఈ గణాంకాలు ఎగుమతివి కాకుండా కేవలం దేశీయ అమ్మకాల గణాంకాలు మాత్రమే. హాచ్బాక్ మార్చి 2014 లో దేశంలో దాని తొలి ప్రపంచ ప్రదర్శన చేసింది మరియు (ICOTY) 2015 ఇండియన్ కార్ ఆఫ్ ద్ ఇయర్ ను పేరుని సంపాదించుకుంది. దక్షిణ కొరియా వాహన తయారీసంస్థ ఎలీట్ఐ20 ఇప్పుడు భారత ఆటో మార్కెట్ ప్రీమియం కాంపాక్ట్ సెగ్మెంట్లో 66% మార్కెట్ షేర్ ఆశిస్తున్నట్టు చెప్పారు.
బలమైన అమ్మకాల పనితీరు మరియు బ్రాండ్ విజయం మీద వ్యాఖ్యానిస్తూ, హెచ్ఎంఐఎల్, సేల్స్ అండ్ మార్కెటింగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ Mr. రాకేష్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ " మేము ఎలీట్ ఐ 20 కోసం అపూర్వమైన 150,000 దేశీయ అమ్మకాలు స్వీకరించడం ద్వారా కస్టమర్ స్పందనతో ఆనందంలో మునిగి ఉన్నాము. ఇది కస్టమర్ తో అనుసంధానమయ్యి మరియు హ్యుందాయ్ ఉత్పత్తులపై విశ్వాసం ప్రతిబింభించేందుకు తోత్పడుతుంది. భారతదేశం లో ఒక అత్యుత్తమ పనితీరు గల వాహనంగా ఎలీట్ ఐ20 ని తీర్చిదిద్దినందుకు తోత్పడిన మా వినియోగదారులు, ఛానల్ పార్ట్నర్స్ మరియు ఉద్యోగులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము." అని వివరించారు.
ఇటీవలి మాసాలలో, హ్యుందాయ్ ఎలీట్ ఐ 20 హోండా జాజ్ మరియు ఇటీవల ప్రవేశపెట్టిన మారుతి సుజుకి బాలెనో నుండి కఠినమైన పోటీని ఎదుర్కొంటుంది. ఈ వాహన తయారీదారుడు కొన్ని నెలల క్రితం హోండా జాజ్ ని పునఃరుద్ధరించిన తరువాత ఎలీట్ ఐ 20 మరియు ఐ 20 యాక్టివ్ లో కూడా టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థను పరిచయం చేశాడు. జాజ్ మరియు బాలెనో పరిచయం అయిన తర్వాత పోటీ మరింతగా పెరిగినప్పటికీ ఎలీట్ ఐ 20 దేశంలో ప్రీమియం హ్యాచ్బ్యాక్ అమ్మకాల పట్టికలో తన దారి కొనసాగుతోంది.
ఇంకా చవండి
http://telugu.cardekho.com/car-news/Hyundai%20Mulling%20to%20Launch%20Tucson%20in%20India-17045
http://telugu.cardekho.com/car-news/Hyundais%20Creta%20Crosses%2070,000%20Bookings;%20Eyes%20Global%20Market-17060