• English
  • Login / Register

10,000 అడ్వాన్స్ బుకింగ్స్ ను సాధించిన హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం saad ద్వారా జూలై 15, 2015 03:32 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హ్యుందాయ్ క్రెటా, దేశవ్యాప్తంగా మంచి పేరుతో ప్రస్తుతం అందరి మనస్సుల్లో ఉంది. అందరూ కూడా హ్యుందాయ్ క్రెటా యొక్క ప్రారంభ తేదీ జూలై 21, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. భారతదేశం లో ఈ హ్యుందాయ్ యొక్క విజయగాధలో కొత్త అధ్యాయాన్ని రాయబోతున్నారు. దాని పూర్తి స్వింగ్ లో ఉత్సాహంతో పాటు, మరో సంచలన వార్తలను వెల్లడించింది. అది ఏమిటంటే, ఈ కాంపాక్ట్ ఎస్యువి అయిన క్రెటా, ముందుగానే 10,000 ఆర్డర్లను కైవశం చేసుకుంది. ఇది మాత్రమే కాదు, 28,000 పైగా ప్రజలు ఇప్పటివరకు క్రెటా గురించి విచారణ చేశారు.

హెచ్ఎంఐఎల్ యొక్క సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన రాకేశ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, "క్రెటా, దాని బోల్డ్ మరియు అందమైన లుక్స్ తో ఆవిష్కరించక ముందే అపారమైన ఉత్సాహాన్ని సృష్టించింది. క్రెటా మీద ప్రజలకు ఉండే ఆసక్తి ని ప్రత్యక్షంగా చూశాము. ఏ విధంగా అంటే, 28,500 పైగా విచారణలు మరియు 10,000 ముందస్థు బుకింగ్ లను గమనించినట్లైతే తెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు.

దీని గురించి క్లుప్తంగా చేప్పేదేమిటంటే, క్రెటా, హ్యుందాయ్ యొక్క ఫ్లూడిక్ స్క్లప్చర్ డిజైన్ ఫిలాసఫీ తో రాబోతుంది మరియు అనేక స్టైలింగ్ అంశాలను కలిగి ఉండటం వలన సాంట ఫీ లా కనిపించబోతుంది. అంతేకాకుండా, ఈ కాంపాక్ట్ ఎస్యువి ప్రతీ కోణం నుండి మురిపిస్తుంది. దీనిలో భాగంగా వాహనం యొక్క ముందు ప్రొఫైల్ విషయానికి వస్తే, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో పాటు డే టైం రన్నింగ్ హెడ్ ల్యాంస్ తో రాబోతుంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 17-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు బాడీ క్లాడింగ్ లను గమనించవచ్చు. రేర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ర్యాప్ రౌండ్ టైల్ ల్యాంప్స్ తో రాబోతుంది.    

ఈ క్రెటా యొక్క అందాన్ని వర్ణించడం లో మరొక భాగం అంతర్గత భాగాలు. దీని యొక్క లోపలి భాగాలను గమనించినట్లైతే, టచ్స్క్రీన్ సమాచార యూనిట్, ప్రీమియం అపోలిస్ట్రీ మరియు పుష్ ప్రారంభం బటన్ తో పాటు స్మార్ట్ కీ, రేర్ ఏసి వెంట్స్ మరియు అనేక లక్షణాలను కలిగి రాబోతుంది. ఇంకా చెప్పలంటే, ఈ వాహనం డ్యూయల్, సైడ్, కర్టైన్ ఎయిర్ బాగ్స్, ఏబిఎస్ మరియు ఈ బి డి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో వస్తుంది. ఈ వాహనం, వెర్న లో ఉండే, 1.4 లీటర్ అండ్ 1.6 లీటర్ సి ఆర్ డి ఐ డీజిల్ ఇంజన్ మరియు 1.6 లీటర్ విటివిటి పెట్రోల్ ఇంజన్ లతో రాబోతుంది.

ఈ సంస్థ, ఈ లిటిల్ మాస్టర్ ను సృష్టించడానికి INR 1000 కోట్ల పెట్టుబడి ను పెట్టింది. ఈ క్రెటా ప్రారంభం అయిన వెంటనే, అదే విభాగంలో ఉన్న రెనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియు రాబోయే మారుతి ఎస్-క్రాస్ వాహనాలకు పోటీగా నిలవబోతుంది. వచ్చే వారం, ఈ క్రెటా విడుదల వార్తల కోసం మరియు మరింత సమాచారం కోసం కార్దేకొ ను వీక్షిస్తూనే ఉండండి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience