• English
  • Login / Register

హోండా అకార్డ్ 2016 లో తిరిగి తీసుకురాబోతుంది!

మే 30, 2015 04:24 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: భారతదేశంలో 2016 లో ప్రీమియం సెడాన్ అయిన హోండా అకార్డ్ తిరిగి రాబోతుంది. కంపెనీ ఇటీవల నియమించిన అధ్యక్షుడు మరియు CEO కట్సుషి ఇనోయూ ఈ విధంగా ప్రకటించారు. ఏమనంటే, భారతదేశంలో ఈ హోండా అకార్డ్ 2.4 లీటర్ పెట్రోల్ మోటార్ అడుగు పెట్టబోతుంది అని ప్రకటించారు. అంతేకాకుండా దీనితో పాటు  హైబ్రిడ్ వేరియంట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు.

భారతదేశం లో  ఉన్న ఈ హోండా అకార్డ్ గురించి మట్లాడాలంటే, ఈ హోండా అకార్డ్ ను 2001 వ సంవత్సరం లో ప్రవేశపెట్టారు, తిరిగి 2014 వ సంవత్సరం లో తాత్కాలికంగా నిలిపివేసారు. హోండా సంస్థ ఏ వాహనాలను తిరిగి ప్రారంభించాలని ఏ ప్రణాళికలను కలిగి లేదు. ఈ సంస్థ యొక్క తయారీదారుడు ఈ చిన్న కారు ప్లాట్ఫాం పై దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతం హోండా బ్రయో, అమేజ్, మొబిలియో మరియు జాజ్ లను కలిగి ఉంది. కానీ, జాజ్ వాహనాల ఉత్పత్తి, 2013 వ సంవత్సరంలో చివరి దశకు చేరుకుంది. తిరిగి మరల ఇప్పుడు, హోండా జాజ్ ఎగుమతి కి సిద్దమైంది. విడుదల తేదీ కూడా జూలై 8, నిర్ధారించడమైనది. హోండా ఇప్పుడు అకార్డ్ పరిచయం ద్వారా దాని బ్రాండ్ బెంచ్మార్క్ ను తిరిగి సాధించాలని దృష్టి పెట్టింది.  

   

అకార్డ్, భారతదేశం లో 2014 వ సంవత్సరం లో నిలిపివేయడం జరుగుతుండగా, ప్రపంచంలో ఈ అకార్డ్ తొమ్మిదవ తరం సెడాన్ గా పేరు పొందింది. అందుచేత, 2016 వ సంవత్సరం లో అదే తొమ్మిదవ జనరేషన్ ఫేస్లిఫ్ట్ సెడాన్ ను తిరిగి ప్రవేశపెట్టబోతున్నారు.  

రాబోయే ఈ హోండా అకార్డ్, స్కోడా సూపర్బ్ కు మరియు వోక్స్వగన్ పస్సత్ కు పోటీగా రానుంది. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్ లో మంచి గిరాకి ఉన్న టయోటా కామ్రీ తో కూడా పోటీ గా రానుంది. ముఖ్యంగా దాని అమ్మకాలలో 70 శాతం వాటా హైబ్రిడ్ వేరియంట్వే.   

అంతేకాక, ఈ హోండా బ్రాండ్ ఆడి, బిఎండబ్ల్యూ మరియు మెర్సిడీస్ బెంజ్ వంటి బ్రాండ్లతో మరొక ఇబ్బందిని ఎదుర్కొంటుంది. అది ఏమిటంటే, ఆ బ్రాండ్లు మరింత సరసమైన ధరలను ఇవ్వడం వలన ఈ బ్రాండ్ కు పోటీగా నిలుస్తున్నాయి. ఆడి A3, మెర్సిడెస్ బెంజ్ CLA వంటి కార్లు, కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience