థాయిలాండ్ లో BRV ని ప్రారంభించిన హోండా సంస్థ
హోండా బిఆర్-వి కోసం raunak ద్వారా ఫిబ్రవరి 01, 2016 10:20 am ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
థాయిలాండ్ బిఆర్-V యొక్క మొదటి మార్కెట్, కాంపాక్ట్ క్రాస్ఓవర్ రాబోయే 2016 ఆటో ఎక్స్పోలో భారత ప్రదర్శన చేస్తుంది!
హోండా, థాయిలాండ్ లో బిఆర్-V కాంపాక్ట్ క్రాస్ఓవర్ / SUV ని ప్రారంభించింది, ఈ ఉత్పత్తి స్పెక్ మోడల్ కొన్ని నెలల క్రితం ప్రపంచ ప్రదర్శన చేసింది. ఇది మూడు వరుసల పూర్తి సీటింగ్ ని అందించే భారతదేశం యొక్క మొట్టమొదటి కాంపాక్ట్ SUV. థాయిలాండ్ లో ఇది 5 లేదా 7 సీట్లు ఎంపికతో వస్తుంది, దీనిలో 5-సీటర్ వెర్షన్ 750,000 భాట్(దాదాపుగా రూ. 14 లక్షలు) మరియు 7-సీటర్ 820,000 భాట్(దాదాపు రూ .15 లక్షలు) ధరకి అందించబడతాయి. భారతదేశం గురించి మాట్లాడితే BRV యొక్క ధరలు రూ.10 లక్షలు ఉండవచ్చని భావిస్తున్నారు మరియు ఇది ఫేస్లిఫ్ట్ రెనాల్ట్ డస్టర్ తదితరులతో కలిసి హ్యుందాయ్ క్రెటా తో ప్రధానంగా పోటీ పడుతుంది.
యాంత్రికంగా, అది ఒక 1.5-లీటర్ ఐ-Vtec పెట్రోల్ మరియు 1.5 లీటర్ ఐ-DTEC డీజిల్ ఇంజిన్ తో అందించబడుతుంది. ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ఈ వాహనం పెట్రోల్ మరియు డీజిల్ రెండు మోడళ్ళలోని ప్రామాణికంగా 6-స్పీడ్ మాన్యువల్ తో అందించబడుతుంది. కానీ పెట్రోల్ వెర్షన్ కూడా హోండా న్యూ CVT ఆటోమేటిక్ (ఎర్త్ డ్రీం టెక్నాలజీ)తో వస్తుంది. 1.5 లీటర్ ఐ-Vtec ఇంజిన్ 6600rpm వద్ద 120PS మరియు 4600rpm వద్ద 145Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ ఐ-DTEC డీజిల్ ఇంజిన్ 3600rpm వద్ద 100PS శక్తిని మరియు 1750rpm వద్ద 200Nm టార్క్ అందిస్తుంది.
లక్షణాల గురించి మాట్లాడుకుంటే BR-V వాహనం LED లైట్ గైడ్ మరియు LED టైల్లాంప్స్ తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో వస్తుంది. ఇది డైమండ్ కట్ అలాయ్ వీల్స్ మరియు బాడీ క్లాడింగ్ తో వస్తుంది. దీని డాష్బోర్డ్ సిటీ మరియు జాజ్ నుండి ఉద్భవించింది మరియు హోండా యొక్క ఎవియన్ టచ్ వ్యవస్థ, మూడు పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, నల్ల థీమ్ మరియు చివరి తరం సిటీ/సివిక్ స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంటుంది.