హోండా వారు 2,23,578 కార్లను ఉపసంహరించమని ఆదేశాలు జారీ చేసింది, ఇందులో మీ కార్లని చూసుకోండి!
జైపూర్:
హోండా వారి కొన్ని కార్లలో ఎయిర్-బ్యాగ్స్ కి సంబంధించి కొన్ని లోపాలు కనుగొన్న తరుణంలో ఈ జపనీస్ తయారీదారి దాదాపుగా 2,23,578 కార్లను స్వచ్ఛంద ఉపసంహరణ చేసి తద్వారా ఎయిర్-బ్యాగ్స్ భర్తీకై ఆదేశాలను జారీ చేయడం జరిగింది. యజమాన్యులు ఆన్లైన్ లో వారి మోడలు కూడా ఈ జాబితాలో ఉందో లేదో అన్న వివరాలను హోండా వారి అధికారిక వెబ్సైట్ అయిన www.hondacarindia.com లోకి వెల్లి 17 అక్షరాల వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VIN) ని వెబ్ పేజ్ లో అందించి తెలుసుకోవచ్చును.
కంపెనీ వారి 2007-2012 సమయంలో తయారు అయిన హోండా సిటీ, 2009-2011 సయంలో తయారైన హోండా జాజ్, 2003-2012 సమయంలో తయారు అయిన హోండా సివిక్ మరియూ 2004-2011 సమయంలో తయారు అయిన హోండా CR-V లను వెనక్కి స్వచ్చందంగా ఉపసమ్హరించమని పిలుపుని ఇచ్చారు. అన్నిటిలోకీ హోండా సిటీ దాదాపుగా 1,40,508 యూనిట్లు ఉండగా మరియూ కేవలం 13,073 యూనిట్లుగా సీఆర్-వీ కారు చివరి స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఉన్న ఇతర కార్లు జాజ్-15,707 యూనిట్లు మరియూ సివిక్-54,290 యూనిట్లుగా ఉన్నాయి. హోండా జాజ్ లో కొన్ని వాహనాలకు కేవలం డ్రైవర్ సైడ్ ఇంఫ్లేటర్స్ ని భర్తీ చేయాల్సి ఉండగా ఇతర కార్లకి డ్రైవర్ వైపు మరియూ ప్యాసెంజర్ వైపు కూడా ఎయిర్ బ్యాగ్ ఇంఫ్లేటర్ ని భర్తీ చేయాల్సి ఉంది.
Model | Year of Make | Driver Side Inflators Affected | Passenger Side Inflators Affected | Affected Units |
City | 2007-2012 | 1,40,508 | 2,646 | 1,40,508 |
Civic | 2003-2012 | 54,288 | 40,083 | 54,290 |
Jazz | 2009-2011 | 15,707 | NA | 15,707 |
CR-V | 2004-2011 | 8,330 | 11,495 | 13,073 |
Total | 2,23,578 |
ఈ ఉపసంహరణ పిలుపు అక్టోబర్ 12 నుండి దశలుగా జరుగుతుంది. ఆ సమయంలో హోండా వారు నేరుగా కస్టమర్లను కాంటాక్ట్ చేస్తారు. హోండా ఇండియా వారిచే ఆఖరి పిలుపు మే 2015 లో 2004 న జరిగిన CR-V మరియూ 2003-2007 లో తయారైన అక్కోర్డ్ లలో అమర్చబడిన లోపం కలిగిన ప్యాసెంజర్ వైపు ఎయిర్-బ్యాగ్ ఇంఫ్లేటర్ ని భర్తీ చేసేందుకు జరిగింది.