• English
  • Login / Register

హోండా ఇండియా వారు హోండా కనెక్ట్ ను ప్రదర్శించారు

డిసెంబర్ 16, 2015 05:11 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇది ఒక సంభాషించే స్మార్ట్‌ఫోన్ యాప్, ఈ యాప్ కారు యొక్క ముఖ్యమైన సమాచారాన్ని అందించబోతోంది, దానిని కుటుంబ సభ్యులకు షేర్ చేసుకొనే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది!!

జైపూర్: భారతదేశంలో హోండా వారు హోండా కనెక్ట్ యాప్ ని ప్రదర్శించారు. ఇది ఒక సౌకర్యవంతమైన సమాచారాన్ని కారుకి సంబంధించిన విశ్లేషణను మరియు సేవా వివరాలను అందించబోతోంది. ఈ హోండా కనెక్ట్ ఐ.ఒ.ఎస్ మరియు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫార్మ్ లలో ఉచిత డౌన్‌లోడ్ ద్వారా యాపిల్ ఆప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే లలో అందుబాటులో ఉంటుంది. ఇక విశేషాలలోకి వెళితే, కొన్ని ప్రత్యేకతలు కనెక్ట్ డివైజ్ ద్వారా అందుతుండగా మొదటి 20,000 వినియోగదారులకు హోండా వారు ఈ సేవలను తగ్గించిన ధరకు అంటే 2,999 వద్ద అందిస్తున్నారు. ఈ కనెక్ట్ డివైజ్ కారు వ్యవస్థను అనుసంధానించే విధంగా ఉండబోతోంది మరి దీనిని మిండా ఐ కనెక్ట్ వారు తయారుచేశారు. ఈ డివైజ్ అన్ని హోండా డీలర్ల వద్ద ప్రత్యేకంగా తమ హోండా జాజ్, హోండా సిటీ మరియు హోండా CR-Vవినియోగదారులకు లభిస్తుంది.

ఇంక ఈ సమాచార ప్లాట్‌ఫార్మ్ గురించి వివరిస్తూ, మిస్టర్. కత్సుషి ఇనాయ్, ప్రెసిడెంట్ మరియు సి.ఇ.ఒ, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు "ఈ రోజు టెక్నాలజీ మన జీవితంలో ఒక భాగమయ్యింది. ఈ హోండా కనెక్ట్ యొక్క అభివృద్ధి కీలక ఉద్దేశ్యం ఇటువంటి నవీకరణలను వినియోగదారుల మారుతున్న డిజిటల్ ఆధారిత జీవన శైలికి అనుగుణంగా తయారుచేయడం. ఈ విలువ ఆధారిత సమాచార సేవలు హోండా ను వినియోగదారులకు మరింత చేరువ చేస్తాయని భావిస్తున్నారు."

ఈ కొత్త యాప్ మరియు కనెక్ట్ డివైజ్ యొక్క విశేషాలను చూద్దాము

సౌలభ్య లక్షణాలు

సర్వీస్ బుకింగ్/అలర్ట్స్: ఈ సేవా ఫీచర్ ఆధారిత అలర్ట్ హోండా వినియోగదారినికి వాహన మెయింటెనెన్స్ సమాచారాన్ని సమయానికి అనుగుణంగా అందిస్తుంది. సంవత్సరంలోని సర్వీస్ అలర్ట్స్ షెడ్యూల్ చేయబడిన ఆన్‌లైన్ సేవా అపాయింట్‌మెంట్లు, మెయింటెనెన్స్ కు సంబంధించిన పూర్తి చరిత్ర మరియు వాహనాలకు చేయబడిన చర్యల వివరాలు,అపాయింట్‌మెంట్ డేట్లు మరియు డీలర్ వివరాలు, ఖరీదు, వగైరా అందించబడతాయి.

వాట్స్ న్యూ అండ్ ఫీడ్ బ్యాక్ సిష్టం: ఈ హోండా కనెక్ట్ వినియోగదారులకి కొత్త కారు విశేషాలు మరియు ప్రచార వివరాలు అందిస్తుంది. అధనంగా వినియోగదారులు తమ యొక్క ఫీడ్ బ్యాక్ ని నేరుగా సంస్థకి అందించగలుగుతారు.

వినియోగ లక్షణాలు:

మాన్యువల్ SOS ఫీచర్స్: ఏదైనా అనుకోని సంఘటన వాహనదారులకు ఎదురైనప్పుడు ఒక క్లిక్ ద్వారా ఆ సమాచారాన్ని వారి కుటుంభ సభ్యులకు తెలియజేయగలుగుతుంది.

పిట్ స్టాప్స్: వాహనానికి సంబంధించిన సమీప డీలర్ మరియు ఇంధన స్టేషన్ వివరాలు రియల్ టైం నావిగేషన్ వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడ నుండి అయినా ఏ సమయంలోనైనా అందించగలుగుతుంది.

ఇన్సూరెన్స్ అండ్ puc రెన్యువల్: ఈ సౌకర్యం కారు ఇన్సురెన్స్ మరియు puc రెన్యువల్ వివరాలను మరియు తేదీలను హోండా కారు యజామానులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.

డాక్యుమెంట్ వాలెట్: ఈ డాక్యుమెంట్ వాలెట్ ద్వారా వినియోగదారులు కారుకి సంబంధించిన డాక్యుమెంట్లు మరియు వినియోగదారుల ఫొటోలు పొందుపరచుకోవచ్చు.

ఫ్యుయల్ లాగ్: ఈ సేవ ద్వారా కారు ఇంధనం ఎప్పుడు అందించబడింది ఎంత ఇంధన సామర్ధ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్న వివరాలను తెలుసుకోవచ్చు.

భద్రత మరియు రక్షణ (ఇవి కేవలం కనెక్టెడ్ డివైజ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్నాయి)

ఇంపాక్ట్ అలర్ట్: ఈ కనెక్ట్ డివైజ్ లో అందించిన సెన్సార్ ద్వారా కారు యొక్క 3D వ్యవస్థ ఒక 100 రెట్లు ఒక సెకెన్ కు పనిచేస్తూ మరియు దాని ఇన్‌బిల్ట్ ఆల్గారిధం ద్వారా కారుకు సంభవించబోయే జర్క్ గాని కుదుపులు గాని జరిగే అవకాశాలను తెలియజేస్తుంది. అధనంగా ఈ అలర్ట్ HCIL సేవల ద్వారా హోండా వారి సేవా సెంటర్ కు ఈ వివరాలను 24/7 అందించగలుగుతుంది. తద్వారా కస్టమర్ సేవా విభాగం వారు అత్యవసర సమాచారాన్ని అందుకొని వినియోగదారులకు ఎక్కడ ఉన్న అత్యవసర సేవలను అందించగలుగుతారు.

లొకేట్ మై కార్: లోకట్ మై కారు సేవ ద్వారా వినియోగదారులు కారు యొక్క లొకేషన్ ను ప్రతీ కొద్ది సెకెన్ల వ్యవధిలోని తెలుసుకోవచ్చు.

ట్రిప్ అనాల్సిస్: ఈ సేవ ద్వారా వాహనం నడిపే వినియోగదారులు కారు యొక్క డ్రైవింగ్ శైలిని ఎంచుకున్న దారిని యావరేజ్ స్పీడ్ ని మరియు బండి ఐడలింగ్ టైం ను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా దీని ద్వారా వాహనం వేగంగా నడపబడుతుందా లేదా అనే విషయాలు తెలుసుకోవచ్చు.

మై కార్ హెల్త్: ఈ సేవ ద్వారా వాహనం యొక్క పూర్తి ఆరోగ్యం మానిటర్ చేసే అవకాశం ఉంది. అంటే ఇంజిన్ మరియు బ్యాటరీ సామర్ధ్యాలు, కారు యొక్క ఇతర లెవెల్స్ వగైరా వివరాలతో అందించబడతాయి. ఒకవేళ ఏదినా సమస్య తలెత్తినట్లయితే వినియోగదారులకు హోండా సేవా సెంటర్ వారి దగ్గర నుంచి సమయానుకూలంగా సలహాలు అందించబడతాయి.

షేర్ మై లొకేషన్: ఈ భద్రత మరియు ఫన్ సేవ ద్వారా వినియోగదారుల యొక్క ప్రస్తుత లొకేషన్ వివరాలు స్నేహితులకు మరియు వారి ప్రుయమైన వారికి ఎప్పటికప్పుడు తెలపబడతాయి. అంతేకాకుండా దీని ద్వారా 15 నిమిషాల నుండి 12 గంటల వరకు ఒక షేరింగ్ సెషన్ ను నడపవచ్చు.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience