Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

తన పోటీదారులతో MG కామెట్ EV ధర వివరాలు: స్పెసిఫికేషన్‌ల పోలిక

ఎంజి కామెట్ ఈవి కోసం ansh ద్వారా ఏప్రిల్ 27, 2023 03:04 pm ప్రచురించబడింది

ఈ అల్ట్రా-కాంపాక్ట్ EV అన్నీ ఫీచర్‌లను కలిగిన ఏకైక వేరియంట్‌గా విడుదల అయ్యింది

ఈ రెండు-డోర్‌ల అల్ట్రా-కాంపాక్ట్ MG కామెట్ EV, దేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఆఫరింగ్ؚలలో ఒకటి. దీనికి ప్రత్యక్ష పోటీదారులు లేనప్పటికీ, దీని ధర కారణంగా ఇది టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3 వంటి వాటితో ఎంట్రీ-లెవెల్ EV ఎంపికగా పోటీ పడుతుంది.

టాటా మరియు సిట్రోయెన్ ఎలక్ట్రిక్ మోడల్‌లతో పోలిస్తే కామెట్ ఏ స్థానంలో నిలుస్తుందో ఇప్పుడు చూద్దాం:

కొలతలు

కొలతలు

MG కామెట్ EV

టాటా టియాగో EV

సిట్రోయెన్ eC3

పొడవు

2,974మిమీ

3,769మిమీ

3,981మిమీ

వెడల్పు

1,505మిమీ

1,677మిమీ

1,733మిమీ

ఎత్తు

1,640మిమీ

1,536మిమీ

1,604మిమీ

వీల్ؚబేస్

2010

2450

2540

బూట్ స్పేస్

240 లీటర్ లు

315 లీటర్ లు

పోల్చి చూసినప్పుడు 3,000 మిమీ కంటే తక్కువ పొడవుతో కామెట్ EV అతి చిన్న కారుగా నిలిస్తుంది, కానీ ఈ పోలీకలో ఇదే అత్యంత ఎతైన మోడల్‌గా ఉంది. దాదాపు అన్నీ కొలతలలో సిట్రోయెన్ eC3 పెద్ద మోడల్‌గా నిలుస్తుంది, టియాగో EV కంటే కూడా గణనీయంగా పెద్దది. మొత్తం మీద, టియాగో EV ఇక్కడ ఉన్న వాటిలో రెండవ పెద్ద మోడల్.

బ్యాటరీ ప్యాక్ పరిధి

స్పెసిఫికేషన్‌లు

MG కామెట్ EV

టాటా టియాగో EV

సిట్రోయెన్ eC3

బ్యాటరీ

17.3kWh

19.2kWh

24kWh

29.2kWh

పవర్

42PS

61PS

75PS

57PS

టార్క్

110Nm

110Nm

114Nm

142Nm

పరిధి

230కిమీ

250కిమీ

315కిమీ

320కిమీ

ఇక్కడ కూడా, అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ మరియు అత్యధిక మైలేజ్‌ను అందించే వాహనం సిట్రోయెన్ eC3, కానీ దీని పవర్ అవుట్ؚపుట్ టియాగో EV చిన్న బ్యాటరీ ప్యాక్ వర్షన్ కంటే తక్కువ. eC3 నేరుగా టాటా టియాగో EV పెద్ద బ్యాటరీ ప్యాక్ వేరియెంట్ؚలతో పోటీ పడుతుంది.

ఇది కూడా చదవండి: రూ.7.98 లక్షల ధరతో కామెట్ EVని విడుదల చేసిన MG; టాటా టియాగో EV కంటే మరింత చవకైనది

మరొక వైపు, కామెట్ EV ఈ మూడిటిలో అత్యంత చిన్న బ్యాటరీ ప్యాక్ؚను పొందింది, టాటా ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ చిన్న బ్యాటరీ ప్యాక్ వేరియెంట్‌లతో పోటీ పడుతుంది.

ఈ పోలీకలో రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఎంపికలను అందిస్తున్న ఏకైక మోడల్‌గా టాటా టియాగో EV నిలుస్తుంది

ఫీచర్‌లు భద్రత

ఉమ్మడి ఫీచర్‌లు

MG కామెట్ EV

టాటా టియాగో EV

సిట్రోయెన్ eC3

  • స్టీరింగ్ؚకు అమర్చిన ఆడియో కంట్రోల్ؚలు
  • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు
  • EBDతో ABS ​​​​​​​
  • రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు ​​​​​​​
  • రేర్ పార్కింగ్ కెమెరా
  • డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ​​​​​​​
  • వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ؚప్లే​​​​​​​
  • మాన్యువల్ AC​​​​​​​
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)​​​​​​​
  • ఏడు-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ​​​​​​​
  • వైరెడ్ అండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ؚప్లే​​​​​​​
  • ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ ​​​​​​​
  • క్రూజ్ కంట్రోల్ ​​​​​​​
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)
  • 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ​​​​​​​
  • వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ؚప్లే​​​​​​​
  • మాన్యువల్ AC​​​​​​​
  • హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్

ఇతర వాహనాలతో పోలిస్తే, MG కామెట్ EV భారీ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేతో వస్తుంది. టియాగో EVలో ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్‌లను అందిస్తుంది. కామెట్ EV మరియు eC3 రెండూ వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేలతో వస్తాయి, కానీ టియాగో EV విషయానికి వస్తే ఇది వైర్ؚలెస్ కాదు.

దీన్ని కూడా చదవండి: చిత్రాలలో వివరించబడిన MG కామెట్ EV రంగుల వివరాలు

భద్రత విషయానికి వస్తే, మూడు మోడల్‌లు కూడా డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్ؚబ్యాగ్ؚలు, EBDతో ABS, రేర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు రేర్ కెమెరాను అందిస్తున్నాయి. అయితే, కామెట్ EV మరియు టియాగో EV టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ؚను (TPMS) కూడా అందిస్తాయి.

ధర

MG కామెట్ EV

టాటా టియాగో EV

సిట్రోయెన్ eC3

రూ.7.98 లక్షల నుండి

రూ.8.69 లక్షల నుండి రూ. 11.99 లక్షల వరకు

రూ.11.50 లక్షల నుండి రూ. 12.76 లక్షల వరకు

అన్నీ పరిచయ ఎక్స్-షోరూమ్ ధరలు

MG కామెట్ EV ప్రారంభ ధరను బట్టి, ఈ అల్ట్రా-కాంపాక్ట్ EV దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఆఫరింగ్‌గా నిలుస్తుంది. దీని ధర టాటా టియాగో EV కంటే తక్కువగా ఉంటుంది మరియు ఇది సిట్రోయెన్ eC3కి చవకైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఇక్కడ మరింత చదవండి: MG కామెట్ EV ఆటోమ్యాటిక్

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 69 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన ఎంజి Comet EV

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.10.99 - 15.49 లక్షలు*
Rs.14.74 - 19.99 లక్షలు*
Rs.7.99 - 11.89 లక్షలు*
Rs.6.99 - 9.40 లక్షలు*
Rs.60.95 - 65.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర