సీమా వద్ద ర్యాలీ ప్రేరిత ఫోకస్ ఎస్టి వాహనాన్ని ప్రదర్శించబోతున్న ఫోర్డ్
నవంబర్ 02, 2015 02:05 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫోర్డ్ మోటార్ సంస్థ, లాస్ వెగాస్ లో నవంబర్ 3 నుండి 9 మధ్యలో జరుగుతున్న వార్షిక సీమా ప్రదర్శనలో ఒక ర్యాలీ -ప్రేరిత ఫోకస్ ఎస్ టి వాహనాన్ని ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ఈ వాహనం తో పాటు మార్పుచేయబడిన ముస్టాంగ్లను, ఎఫ్- 150 పికప్ ట్రక్, ఫియస్టా ఎస్టీ లను మరియు ఈ సంస్థ నుండి రాబోతున్న ఇతర ఫోర్డ్ వాహనాలను ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఫోకస్ ఎస్ టి వాహనం యొక్క తెలుపు రంగు స్కీం పై, పొదునైన ముందు వైపు తో పాటు సొగసైన క్రింది లిప్ స్ప్లిట్టర్ కు అలాగే సైడ్ మరియు వెనుక స్పాయిలర్స్ కు ఎరుపు అంశాలు అందించబడతాయి. ఈ వాహనం యొక్క ముందు భాగాన్ని వర్ణించడానికి వస్తే, ఎల్ఈడి బార్ లైట్ అందించబడుతుంది మరియు దీనిని మహింద్రా థార్ వాహనం లో చూడవచ్చు. ఈ వాహనం యొక్క వీల్ ఆర్చులకు, 19 అంగుళాల బారీ గ్రాఫైట్ ఫినిషింగ్ కలిగిన వీల్స్ అందించబడతాయి మరియు ఇవి, నిట్టో NT555 టైర్లతో కప్పబడి ఉంటాయి.
ఈ వాహనం యొక్క అంతర్గత భాగం విషయానికి వస్తే, నాలుగు పాయింట్ల హార్న్సెస్ తో పాటు సర్దుబాటయ్యే రేసింగ్ బకెట్ సీట్లు అందించబడతాయి మరియు భద్రతను నిర్ధారించడానికి, అది నాలుగు పాయింట్ల రోల్ కేజ్ తో బిగించి ఉంటుంది. సౌకర్య లక్షణాల విషయానికి వస్తే, క్యాబిన్ లో ఉండే ప్రయాణికులకు వినోదాన్ని అందించడం కోసం ఎల్ఈడి అంతర్గత లైట్లు మరియు సంగీత వ్యవస్థ వంటివి అందించబడతాయి. అయితే, వాహనం యొక్క సంగీతం వ్యవస్థ కంటే ఇంజన్, ఎక్కువ శబ్ధాన్ని అందిస్తుంది.
మరోవైపు ఈ వాహనం, పనితీరు ఇంటేక్ వ్యవస్థ తో పాటు స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ వ్యవస్థ మరియు మంచి అల్యూమినియం ఇంటర్ కూలర్ లను కలిగిన 2.0 లీటర్ ఈకోబూస్ట్ 4 సిలండర్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 252 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 366 ఎన్ ఎం గల అత్యధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు హాట్ హెడ్ ప్లాంటెడ్, పనితీరు కాయిల్ ఓవర్ సస్పెన్షన్, స్లాటెడ్ రోటర్లను మరియు ప్యాడ్లను కలిగి ఉంటుంది.
ఇతర ఫోడ్ కార్లు కూడా సీమా (స్పెషాలిటి ఎక్యూప్మెంట్ మార్కెట్ అసోసియేషన్)వద్ద ప్రదర్శించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.