సెల్ఫ్-డ్రైవింగ్ కార్ల తయారీ కోసం గూగుల్ తో టై అప్ అవ్వడానికి సిద్ధమవుతున్న ఫోర్డ్
published on డిసెంబర్ 23, 2015 06:17 pm by sumit
- 1 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ:
ఫోర్డ్ మోటార్ కంపెనీ స్వయంప్రతిపత్తి (స్వీయ డ్రైవింగ్) కార్ల తయారీకి సంబంధించి ఒక ఒప్పందం కోసం టెక్ దిగ్గజం గూగుల్, తో చర్చలు జరుపుతోంది. అన్ని కార్ల తయారీసంస్థలు వారి విస్తృతి విస్తరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ చర్చలు వచ్చాయి. ఈ ఒప్పందం జనవరి 2016 న ఖరారు చేయబడవచ్చు మరియు ఈ రెండు కంపెనీలు త్వరలో ఈ మేరకు ఒక ప్రకటన చేయవచ్చు.
అయితే వాహనతయారీసంస్థలతో చర్చలు జరిగాయన్న విషయాన్ని గూగుల్ నిర్ధారించింది. దీని యొక్క వివరాల గురించి అడిగినప్పుడు అమెరికన్ సంస్థ అస్పష్టంగానే ఉండిపోయింది.
అయితే, ఫోర్డ్ ఈ విషయం గురించి సంవత్సరం అంతటా ఏవోవో సందేశాలను అందించింది, కానీ ఈ విషయం గురించి అడిగినప్పుడు మాత్రం నిశ్శబ్భంగా ఉంది. "మేము ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలతో పనిచేశాము. మేము కొన్ని కారణాల వలన ఈ విషయాలను సీక్రెట్ గా ఉంచుతున్నాము మరియు ఈ ఊహాగానాలపై మేము స్పందించదలుచుకోలేదు. " అని ఫోర్డ్ ప్రతినిధి, అలాన్ హాల్ తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో ఫోర్డ్ CEO మార్క్ ఫీల్డ్స్, ఆపిల్ మరియు గూగుల్ తో పార్ట్నర్‌షిప్ గురించి మాట్లాడుతూ " కేవలం మా యొక్క స్వయం సమర్ధత ద్వారా అందుకొనే ఉత్పత్తి కన్నా మెరుగైనటువంటి ఉత్పత్తి సామర్ధ్యాన్ని వేరే తయారీదారులతో అనుసంధానం ద్వారా పొందవచ్చని భావిస్తున్నాము మరియు నిరంతరం మెరుగైన సేవల కోసం ప్రయత్నించే సంథ గా ఇది ఒక ప్రయత్నం." ఇలా అన్నారు.
"ఆటోమేకర్స్ గూగుల్ తో కలిసి పనిచేయడం పోటీతత్వం పెంచడానికి మరింతగా దోహద పడుతుంది." అని తిలో కొస్లోస్కవి తెలిపారు.
ఇప్పటివరకూ ఈ అమెరికన్ కార్ల తయారీసంస్థ నుండి ఈ విషయం గురించి ఎటువంటి వివరాలు అందలేదు. ఒకవేళ ఇదివరకటి కార్లలోనే కెమెరా సెన్సార్స్ వంటి టెక్నాలజీలను అమర్చనున్నారా లేక కొత్త వాహనాలను పూర్తిగా తయారుచేయనున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. దీని వివరాలు స్పష్టంగా తెలిస్తే గనుక మీకు మరిన్ని వివరాలను అందించగలుతాము.
- New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
- Sell Car - Free Home Inspection @ CarDekho Gaadi Store
0 out of 0 found this helpful