ఫోర్డ్ ఇండియా ఒక నూతన ఉత్పత్తి కోసం ఆహ్వానాలు పంపుతుంది
ఫోర్డ్ ఇండియా ఒక కొత్త ఉత్పత్తి కోసం ఆహ్వానాలను పంపించడం ప్రారంభించింది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కొత్త ఉత్పత్తి మరియు దానితో పాటుగా రాబోయే ఫోర్డ్ మస్టాంగ్ జనవరి 28న ప్రారంభించబడతాయి.
ముస్తాంగ్ వాహనం భారత మార్కెట్లో ఫోర్డ్ అందించే మొదటి 2-డోర్ RWDస్పోర్ట్స్ కారుగా ఉండనున్నది. ఇది చివరకు ఒక కుడి చేతివైపు డ్రైవింగ్ ఆకృతీకరణతో "గ్యాలప్ గుర్రం" బ్యాడ్జ్ తో కారు మొదటి సారి భారతదేశంలోనికి రానున్నది. మునుపటి మస్టాంగ్ లు అన్నీ కూడా ఎడమ చేతివైపు డ్రైవింగ్ ఆకృతీకరణ లో అందించబడినవి, కానీ అమెరికన్ వాహనతయారి సంస్థ ఈ వైవిధ్యమైన ఉత్పత్తితో 6 వ తరం మార్కెట్ ని విస్తరించుకుంటోంది ఈ ఉత్పత్తి UK లాంటి దేశాలలో కుడి చేతివైపు డ్రైవింగ్ తో కూడా వస్తుంది. ఇది నిజంగా మనకి అదృష్టం అని చెప్పవచ్చు అమెరికానా సంప్రదాయం భారత వీధుల్లో తిరగనున్నది.
స్పోర్ట్స్ కారు అనేక సందర్భాలలో భారతదేశం లో అనధికారికంగా కనిపించింది మరియు 5.0-లీటరు V8 ఇంజిన్ తో ఏఆర్ఏఐ వద్ద దర్శనమిచ్చింది. ఈ భారీ ఇంజిన్ బహుశా భారతదేశానికి రావచ్చు. V8 ఇంజిన్ 6500rpm వద్ద 418Ps శక్తిని మరియు 524Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది. అదేవిధంగా 2.3-లీటర్ టర్బోచార్జెడ్ ఎకోబూస్ట్ వేరియంట్ కూడా రాబోయే ముస్తాంగ్ తో అందించబడుతుంది. ఈ పవర్ప్లాంట్స్ ప్రామాణిక 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆప్షనల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి.
RWDఅమెరికన్ స్పోర్ట్స్ గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 5 నుండి 9 వరకూ జరగనున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో రాబోతుంది.
ఇంకా చదవండి