ఫోర్డ్ ఫిగో క్రాస్ఓవర్ ని నిర్ధారించిన MD
ఫోర్డ్ ఫిగో 2015-2019 కోసం manish ద్వారా జనవరి 25, 2016 03:25 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫోర్డ్ ఇండియా వారి ఫిగో హ్యాచ్బ్యాక్ క్రాస్ఓవర్ వెర్షన్ ని ప్రారంభించే అవకాశంతో ఆనందంగా ఉంది. క్రాస్ హ్యాచ్లు ప్రస్తుతం మార్కెట్ లో హవా నడుపుతున్నాయి మరియు ఈ నిజాన్ని ఫియట్ అవెంచురా, ఐ 20 ఆక్టివ్ మరియు ఇతరులు వాటి అమ్మకాలతో ధృవీకరించారు. ఫోర్డ్ సంస్థ కి ప్రస్తుతం ఈ ప్రసిద్ధ విభాగంలో పోటీదారులు లేరు మరియు భారత మార్కెట్ ప్రస్తుత పరిస్థితులు ద్వారా ఈ అంశంపై ఫోర్డ్ కి ఒక మంచి అవకాశం లభించబోతోంది. అవకాశంపై వ్యాఖ్యానిస్తూ, ఫోర్డ్ ఇండియా MD మరియు అధ్యక్షుడు, నిగెల్ హారిస్ వ్యాఖ్యానిస్తూ, ఈ అవకాశం, ఇది సుసాధ్యం చేయడమనేది అమలు చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. మేము దాని కొరకు చూస్తున్నాము. భారతదేశ వినియోగదారులు ప్రామాణిక వాహనాలైన ఫిగో లేదా ఆస్పైర్ వంటి వాహనాలపై ఆశక్తి చూపిస్తున్నప్పటికీ వారు క్రాసోవర్ వంటి కొత్త విభాగాలపైన కూడా ఈ మధ్య కాలంలో ఆసక్తి చూపడం అనేది దీనికి ప్రయోజనకరంగా ఉంది.
స్టాక్ ఫిగో ఒక క్రాస్ఓవర్ వేరియంట్ కొరకు ఆదర్శ ఫౌండేషన్లు అందిస్తుంది. ఈ కారు 1.5-లీటర్, 100Ps డీజిల్ మిల్లు ని కలిగియుండి హాచ్బాక్ కి గ్రంట్ ని అందిస్తుంది మరియు వేరియంట్ కి సంబంధించినంతవరకు, 100Ps వేరియంట్ విభాగంలో అత్యంత శక్తివంతమైన సమర్పణగా ఉంటుంది. పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే, అదే 1.5 లీటర్ మిల్లుతో అమర్చబడి ఉంటుంది. ఫిగో హ్యాచ్బ్యాక్ మరియు ఎకోస్పోర్ట్ కి అదనంగా ఫోర్డ్ ఇండియా యొక్క శ్రేణిలో ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్, ఎండీవర్ SUV మరియు ఫియస్టా సెడాన్ కూడా ఉన్నాయి.
ఇంకా చదవండి
2016 భారత ఆటో ఎక్స్పో వద్దకు రానున్న ఫోర్డ్ మాండియో మరియు కౌగా