• English
  • Login / Register

ఫోర్డ్ ఇండియా మరియు మహీంద్రా జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించాలని చూస్తున్నాయి

అక్టోబర్ 04, 2019 10:10 am dhruv ద్వారా ప్రచురించబడింది

  • 35 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ ఒప్పందం జరిగితే మహీంద్రా ఫోర్డ్ ఇండియా వ్యాపారంలో 51 శాతం వాటాను కలిగి ఉంటుంది

Ford India And Mahindra Looking To Enter Into Joint Venture

  •  రెండు సంస్థల మధ్య ఇది ​​మొదటి జాయింట్ వెంచర్ అయితే మాత్రం కాదు.
  •  ఈ ఒప్పందంలో ఫోర్డ్ యొక్క గ్లోబల్ బిజినెస్ లేదా సనంద్‌లోని ఎగుమతి-కేంద్రీకృత ఇంజిన్ ప్లాంట్ లేదు.
  •  ఫోర్డ్ భారతదేశంలో కొనసాగుతుంది మరియు దాని షోరూమ్‌లు మరియు డీలర్‌షిప్‌లు కొనసాగుతూనే ఉంటాయి.
  •  ఒప్పంద చర్చలు ఇంకా జరుగుతున్నందున రెండు సంస్థల నుండి ఇంకా అధికారిక మాటలు లేవు.

నివేదికల ప్రకారం, ఫోర్డ్ తన ఇండియా వ్యాపారంలో మహీంద్రాతో జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఫోర్డ్ మరియు మహీంద్రా భాగస్వామ్యం గురించి నివేదికలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు, ఇద్దరు కార్ల తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఒక చిన్న ఎస్‌యూవీ, అలాగే షేర్ ఇంజిన్‌లను అభివృద్ధి చేయడానికి జాయింట్ వెంచర్‌ లోకి ప్రవేశించారు.

ఏదేమైనా, కొత్త జాయింట్ వెంచర్లో ఫోర్డ్ తన ఇండియా కార్యకలాపాలపై మహీంద్రాతో భాగస్వామిగా ఉండాలని చూస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఒప్పందంలో ఫోర్డ్ యొక్క గ్లోబల్ బిజినెస్ లేదా గుజరాత్ లోని సనంద్ లోని ఇంజిన్ ప్లాంట్ ఉండవు, అక్కడ నుండి ఇంజన్లు ఎగుమతి అవుతాయి.

ఇది కూడా చదవండి: ఫోర్డ్ మరియు మహీంద్రా మూడేళ్ల కోర్ట్ షిప్ లోనికి ప్రవేశం

ఈ జాయింట్ వెంచర్ భారత మార్కెట్లో నిర్వహణ ఖర్చుల నుండి ఫోర్డ్ తనను తాను నిరోధించుకోవడానికి అనుమతిస్తుంది. మహీంద్రా కోసం, భారతీయ కార్ల తయారీ సంస్థ దాని ఇటీవలి ఉత్పత్తులైన అల్టురాస్ జి 4 మరియు ఎక్స్‌యువి 300 లతో ఏదైతే చేద్దామనుకుందో అదే విధంగా ఇది పట్టణ మార్కెట్లలోకి విస్తరించే అవకాశంగా ఉంటుంది.

Ford India And Mahindra Looking To Enter Into Joint Venture

ఈ ఒప్పందం జరిగితే, మహీంద్రా వెంచర్‌లో 51 శాతం మెజారిటీ వాటాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు, అయితే ఫోర్డ్‌కు సమాన ఓటింగ్ హక్కులు మరియు బోర్డు ప్రాతినిధ్యం ఉంటుంది. ఎటువంటి అధికారిక బాండ్ లేనందున ఈ జాయింట్ వెంచర్ అగ్గిపోవచ్చు కూడా. అయితే, రాబోయే రోజుల్లో జాయింట్ వెంచర్ ని ప్రజలకు ప్రకటించే అవకాశం ఉంది.

కొన్ని సంవత్సరాల క్రితం GM చేసినట్లుగా, ఈ ఒప్పందం ఏ విధంగానూ ఫోర్డ్ భారత మార్కెట్ నుండి వెళిపోతుంది అని అయితే ఏమీ లేదు. ఇది డీలర్‌షిప్‌లు మరియు సేవా కేంద్రాల రూపంలో భారత మార్కెట్లో ఉనికిని కొనసాగిస్తుంది, ఇది కొత్త జాయింట్ వెంచర్ సంస్థ పరిధిలోకి వస్తుంది అని నివేదిక పేర్కొంది.

ఈ కథ ప్రచురించబడిన సమయంలో ఫోర్డ్ లేదా మహీంద్రా జాయింట్ వెంచర్ వివరాలను ధృవీకరించలేదు. దీనిపై మరిన్ని వివరాల  కోసం Cardekho.com లో ఉండండి.

వార్తల మూలం

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience