ఫోర్డ్ ఫిగో ఆస్పైర్: సాంకేతిక నిర్దేశాలు బహిర్గతం
ఫోర్డ్ ఆస్పైర్ కోసం raunak ద్వారా జూలై 13, 2015 10:47 am ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫిగో ఆస్పైర్ యొక్క నవీకరణ చెందిన వెర్షన్ 1.5 లీటర్ టిడిసి ఐ డీజిల్ ఇంజన్ ను టోర్కియస్ట్ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా 100 PS పవర్ ను మరియు 215 Nm టర్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా దీనిలో అత్యంత శక్తివంతమిన పెట్రోల్ ఇంజన్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఆ పెట్రోల్ ఇంజన్, అత్యధికంగా 112 PS పవర్ ను విడుదల చేస్తుంది అదే విధంగా 136 Nm గల పీక్ టార్క్ ను కూడా విడుదల చేస్తుంది. ఈ ఇంజన్, 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది.
జైపూర్: -
రాబోయే కాంపాక్ట్ సెడాన్ అయిన ఫిగో ఆస్పైర్ యొక్క సాంకేతిక నిర్దేశాలు మరియు లక్షణాలను ఫోర్డ్ సంస్థ వెల్లడించింది. ఈ వాహనం, మూడు ఇంజన్ ఆప్షన్లతో మరియు మొదటి సారిగా ఈ విభాగంలో 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ కలిగిన రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలు లో రాబోతుంది. ఇది వచ్చే నెల అమ్మకానికి వెళ్ళబోతుంది మరియు రంగప్రవేశం తర్వాత వెంటనే రెండవ తరం ఫిగో హ్యాచ్బ్యాక్ ఆధారంగా ఒక వాహనాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకకుండా, స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఎక్సెంట్, టాటా జెస్ట్ వంటి వాహనాలకి గట్టి పోటీను ఇవ్వడానికి రాబోతుంది.
రాబోయే ఫిగో అస్పైర్ లో, ప్రామాణికంగా రెండు ఎయిర్బాగ్స్ అందించబడతాయి. అయితే, ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్ లలో 6 ఎయిర్బాగ్స్ అందించబడతాయి. అంటే, ముందు రెండిటితో పాటు సైడ్ మరియు కర్టైన్ ఎయిర్బాగ్స్ కూడా అందించబడతాయి.
ఇంజిన్ ఎంపికలు
- ఫోర్డ్ ఫిగో యొక్క 1.2 లీటర్ డురాతెక్ ఇంజన్ ను మార్పు చేసి, దాని స్థానంలో ప్రస్తుతం 1.2 లీటర్ టి ఐ-విసిటి ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్ 4 సిలండర్ల తో రాబోతుంది. అంతేకాకుండా తీసుకోవడం మరియు ఎగ్సాస్ట్ వాల్వ్ రెండిటి తో పాటు వాల్వ్ టైమింగ్స్ తో రాబోతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 6300 rpm వద్ద 88 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 4000 rpm వద్ద 112 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది.
- ఈకోస్పోర్ట్ మరియు ఫియాస్ట లో ఉండే 1.5 లీటర్ టిడిసి ఐ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్, దీనిలో ఉన్న దాని కంటే 10 PS పవర్ ను అధికంగా విడుదల చేస్తుంది. అంటే, ఈ ఇంజన్ అత్యధికంగా 3750 rpm వద్ద 100 PS పవర్ ను మరియు 1750 నుండి 3000 rpm మద్య 215 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్, 25.83 kmpl గల ఆకట్టుకునే మైలేజ్ ను ఇస్తుంది.
- మరొక పెట్రోల్ ఆప్షన్ విషయానికి వస్తే, ఈ వాహనం ఈకోస్పోర్ట్ లో ఉండే 1.5 లీటర్ టి ఐ-విసిటి పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 6300 rpm వద్ద 112 PS పవర్ ను విడుదల చేస్తుంది మరియు 4250 rpm వద్ద 136 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ అత్యంత శక్తివంతమైన ఈ ఇంజన్, 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.
కొలతలు
పొడవు: 3995 మి.మీ.
వెడల్పు: 1695 మి.మీ.
ఎత్తు: 1525 మి.మీ.
వీల్బేస్: 2491 మి.మీ.
గ్రౌండ్ క్లియరెన్స్: 174 మి.మీ.
బూట్ స్పేస్: 359 లీటర్లు