• English
  • Login / Register

ఫోర్డ్ ఫీగో చెన్నై లో షోకేసూ చేయబడింది

ఫోర్డ్ ఆస్పైర్ కోసం bala subramaniam ద్వారా మే 25, 2015 03:57 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

పది వారాల రోడ్డు షో లో భాగంగా, ఫోర్డ్ ఫీగో ఏస్పైర్ ని చెన్నై లో క్రిథం వారాంతం, సెంట్రల్ ఏట్రియం, ఎక్స్ప్రెస్ అవెన్యు మాల్ లో షోకేసు చేసారు.  అది గనుక మిస్ అయ్యినట్టు అయితే, చెన్నై లో మే 16-17 రోజులలో అంపా స్కైవాక్,అమింజికరై లో చూడొచు లేదా, జూను 6-7 రోజులలో, ఫీనిక్స్ మాల్, వాల్చెరి లో మళ్ళీ చూసే అవకాశం ఉంది. ఫీగో ఎస్పైర్ తో, ఫొర్డ్ కంపెనీ కాంపాక్ట్ సెగ్మెంట్ లోకి ప్రవేసించడంతో పాటుగా, కర్టైన్ బ్యాగ్స్ వంటి ఎన్నో ప్రథమ శ్రేని పరికరాలతో ముందుకు వస్తోంది. 

“ ఫోర్డ్ ఇండియాలో, ఎప్పుడూ కొత్తదనం మరియు కొనుగోలుదారులు కోరుకునేవీ, విలువనిచ్చేవి ఉత్పత్తులను తయారు చేయాలి అని సదా ప్రయత్నిస్తూనే ఉంటాము. రోడ్ షోల ద్వారా, ఫీగో ఎస్పైర్ కి ఉన్న ఆకర్షనీయమైన రూపం, గొప్ప వెసులుబాటు మరియూ స్మార్ట్ పరికరాలతో పాటుగా, దీనిని సొంతం చేసుకోడంలోని ఆనందాన్ని హైలైట్ చేయబోతున్నారు. ఈ సెడాన్ ని కొనుగోలుదారులు సైతం విస్తుపోయే విధంగా రూపొందించబడింది. '' అని ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్ కి  వైస్ ప్రెసిడేంట్  అయిన  రాజ్శేఖర్ చెపారు. “ చెన్నై కస్టమర్లకు మా ఈ ప్రతిపాదన తప్పక నచ్చుతుందనే అనుకుంటున్నాను. '' 

న్యూ ఫీగో ఎస్పైర్, ప్రీమియం డిసైన్ ని, ఉతామమైన రక్షణ ని, మరియూ ఆధునిక టెక్నోలజీని కలగలుపుకుంది. డ్రైవరు మొబైల్ ఫోన్స్ ని పెట్టుకోడానికి, శాటిలైట్ నావిగేషన్ సిస్టంస్ ని, ఎంపీత్రీ ప్లేయర్లని స్టోరు చేసుకోడానికి ఒక విన్నూత్నమైన పరికరం ఒకటి కల్పించడం వంటి ఉత్తమమైన టెక్నోలజీలను కలిగిన పరికరాలను ఈ కారు కలిగి ఉంది. 

ఫీగో ఎస్పైర్ లో డ్రైవరు ఫోను తో కంట్రోలు చేయగలిగే సింక్ విత్ ఆప్ అనే లేటెస్ట్ వెర్షన్ కార్ కనెక్టివిటీ సిస్టము కలిగి ఉంది. ఇందులో సులువైన వయిస్ ఫ్రీ కమండ్ తో ఆప్స్ మరియూ ఎంటర్టైన్మెంట్ ని కూడా కంట్రోలు చేయవచ్చు.   ఈ కొత్త ఫీగో ఎస్పైర్ ని 1.5-లీటరు టీడీసీఐ డీజిలు మరియు 1.2-లీటరు టీవీసీటీ పెట్రోలు ఇంజిను ఆప్షన్లతో లభ్యమౌతుంది.

was this article helpful ?

Write your Comment on Ford ఆస్పైర్

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience