• English
  • Login / Register

ఫిగో ఆస్పైర్ ప్రారంభం చేరువలోఉంది: ఫోర్డ్ మొదటి ఉత్పత్తి యూనిట్లు సనంద్ ప్లాంట్ నుండి వెల్లడి

ఫోర్డ్ ఆస్పైర్ కోసం saad ద్వారా జూన్ 17, 2015 10:11 am ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రస్తుతం ఇంటర్ వెబ్ అంతటా తేలియాడే ఈకారు మరోసారి వార్తలలో రానున్నది. అవును, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ యొక్క మొదటి ఉత్పత్తి యూనిట్, కాంపాక్ట్ సెడాన్  అయినటువంటి ఈ కారు  గుజరాత్ సనంద్ ప్లాంట్ తయారీ యూనిట్ నుండి బయటకి వచ్చింది. ఇది కొన్ని వారాలలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. భారతదేశం యొక్క ఎంచుకున్న నగరాల్లో డీలర్స్ ఇప్పటికే 50,000 ముందస్తు చెల్లింపు తో ముందుగానే బుకింగ్ మొదలుపెట్టారు. ఇది ప్రారంభమైన వెంటనే ఖచ్చితంగా స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, హోండా అమేజ్ వంటి వాటితో పోటీ పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ ఫోర్డ్ అస్పైర్ యొక్క ప్రకాశాన్ని ఇప్పటికే ఊపందుకుని ప్రారంభించిందని తెలుసు. అంతేకాకుండా ఈ వాహనాన్ని, కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ మరియు  నటుడు / దర్శకుడు అయిన ఫర్హాన్ అక్తర్ తో "వాట్ డ్రైవ్స్ యు" అను ప్రీ లాంచ్ కేంపైన్ ద్వారా ప్రదర్శించారు. ఈ ప్రచారం లో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో జరిగే పూర్తి స్వింగ్ తో పాటు రోడ్ షోల గురించి తెలిపారు.

ఫోర్డ్ సంస్థ, కొత్త ఫిగో అస్పైర్ వేరియంట్ ను త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ వాహనం పెట్రోల్, డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండబోతుంది. దీని యొక్క పెట్రోల్ ఇంజన్ 1.2 లీటర్ టి ఐ-విసిటి ఇంజన్ తో రాబోతుంది. అయితే డీజిల్ ఇంజెన్ విషయానికి వస్తే, 1.5 లీటర్ టిడిసి ఐ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్ లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టం తో జత చేయబడి ఉంటాయి. 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ను పెట్రోల్ వేరియంట్ లలో ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు.      

ఈ ఫోర్డ్ అస్పైర్ వేరియంట్ అనేక లక్షణాలతో రాబోతుంది. దీనిలో, ఫోర్డ్ ఎస్వైఎన్సి మరియు స్వర ఆదేశాలు అనుమతించే ఆప్ లింక్ సమాచార వ్యవస్థ, బ్లూటూత్ తో ఆప్ సింక్రోనైజేషన్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, మై డాక్ మరియు ఇతరాత్రా వంటి అనేక లక్షణాలతో రాబోతుంది. అంతేకాకుండా, ఈ అస్పైర్ లో 6 ఎయిర్బాగ్స్, ఏబిఎస్ తో పాటు ఈబిడి మరియు అత్యవసర బ్రేక్ అసిస్ట్ మరియు ఇతర భద్రత అంశాలతో రాబోతుంది.    

దీని యొక్క పోటీధారులైన వాహనాల ధరలు INR 5 లక్షల నుండి 8 లక్షల మద్య పరిది లో ఉన్నాయి. ఈ ఫోర్డ్ అస్పైర్ వాహనం యొక్క ధర కూడా దీని మద్యలో ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోర్డ్ అస్పైర్ ప్రవేశానికి సిద్దంగా ఉంది. బహుశా లాంచ్ కార్యక్రమం, వచ్చే నెలా ఉండే అవకాశాలు ఉన్నాయి.

was this article helpful ?

Write your Comment on Ford ఆస్పైర్

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience