ఫోర్డ్ భారతదేశం యొక్క వెబ్ సైట్ లో అధికారికంగా ప్రదర్శించబడిన ఫోర్డ్ ఎండీవర్ [వేరియంట్ల వివరాలు]
ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం manish ద్వారా డిసెంబర్ 24, 2015 03:02 pm ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూఢిల్లీ:
ఫోర్డ్ భారతదేశం అధికారికంగా, రాబోయే ప్రీమియం ఎస్యూవీ వాహనం అయిన ఫోర్డ్ ఎండీవర్ ను వారి వెబ్ సైట్ లో వివరంగా ఉంచారు. ముందుగా ఇచ్చిన నివేదికలు ప్రకారం, ఈ కారు వచ్చే ఏడాది జనవరి 19 న ప్రారంభానికి సిద్దంగా ఉంది ఫార్చ్యూనర్ కిల్లర్ ఏడు సీట్ల వాహనం, ఫోర్డ్ యొక్క కొత్త లేడర్ -ఫ్రేం ప్లాట్ఫార్మ్ ఆధారంగా వస్తుంది మరియు దీనిని, భాగస్వామ్యంగా చేసుకుని సంస్థ యొక్క రేంజర్ పికప్ ట్రక్ కూడా ఇదే ప్లాట్ఫాం ఆధారంగా వస్తుంది. ఈ ఎస్యువి యొక్క బాహ్య అలాగే లోపలి అంశాల వివరణ క్రింద ఇవ్వబడింది. ఫోర్డ్ అధికారికంగా నేడు, ఈ ఎండీవర్ ఆరు వేరియంట్ లలో రాబోతుంది అని తెలిపింది మరియు ఆ ఆరు వేరియంట్ లలో, రెండు డీజిల్ మోడళ్ళు అవి, 4X4 మరియు 4X2 డ్రైవ్ టైప్ లలో అందుబాటులో ఉన్నాయి.
ఈ వాహనం యొక్క పవర్ ప్లాంట్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో గాని మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో గాని అందుబాటులో ఉంటాయి. భావి కొనుగోలుదారులకు, ఒక నగర -పర్యటన ఆటోమేటిక్ ప్రీమియం ఎస్యూవీ కు మరియు ఒక పెద్ద ఆఫ్ రోడింగ్ ల కు మధ్య ఒక ఎంపిక అందుబాటులో ఉంటుంది. ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అందించబడింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 160 పి ఎస్ పవర్ ను అలాగే 385 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 3.2 లీటర్ డీజిల్ ఇంజన్ అత్యధికంగా, 200 పి ఎస్ పవర్ ను అదే విధంగా 470 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ పవర్ ప్లాంట్, అగ్ర శ్రేణి మోడళ్ళలో మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు చెవ్రోలెట్ ట్రైల్ బ్లాజర్ తో పోలిస్తే, చాలా తక్కువ అని చెప్పవచ్చు అలాగే చెవ్రోలెట్ వాహనాలు 30 ఎన్ ఎం అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.
ఫోర్డ్ సాల్వేషన్ అనునది ఒక అగ్ర శ్రేణి వాహనం అని చెప్పవచ్చు మరియు ఇది, 4X4 ఆకృతీకరణ తో అందుబాటులో ఉంటుంది అలాగే ట్రైల్బ్లాజర్ విషయానికి వస్తే, ఇది ఆటోమేటిక్ 4X2 డ్రైవ్ ట్రైన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎండీవర్ వాహనం, ట్రెండ్ మరియు టిటానియం అను రెండు వేరియంట్ లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, ఏబిఎస్ తో ఈబిడి, 7 ఎయిర్బ్యాగ్లు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఫోర్డ్ మై కీ, ప్రొజక్టార్ హెడ్ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అల్లాయ్ వీల్స్, హిల్ ప్రారంభం అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, అత్యవసర అసిస్టెన్స్, యాంబియంట్ లైటింగ్, లెధర్ అపోలిస్ట్రీ, విధ్యుత్ తో సర్ధుబాటయ్యే డ్రైవర్ సీటు, వెనుక పార్కింగ్ సెన్సార్, ఫాగ్ ల్యాంప్లు, ఆటోమేటిక్ వైపర్లు, విధ్యుత్తు తో సర్ధ్యుబాటు మరియు మడత వేయగల వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు వంటి అంశాలు ఈ వాహనానికి అందించబడ్డాయి.
క్యాబిన్ లో ఉండే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ప్లెథోరా యొక్క సమాచారాన్ని మరియు వివిధ డ్రైవర్ సహాయం వ్యవస్థలను ప్రదర్శిస్తుంది. ఈ వాహనం, పాంథర్ బ్లాక్, మూండస్ట్ సిల్వర్, స్మోక్ గ్రే, గోల్డెన్ బ్రాంజ్, సన్సెట్ ఆరెంజ్, మరియు డైమండ్ వైట్ అను ఆరు రంగులలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి: