ఫోర్స్ మోటర్స్ వారు 2016 ట్రాక్స్ క్రుయిజర్ డీలక్స్ ని రూ.8.68 లక్షలకు విడుదల చేశారు
అక్టోబర్ 26, 2015 11:27 am nabeel ద్వారా సవరించబడింది
- 21 Views
- 2 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫోర్స్ మోటర్స్ వారి ప్రఖ్యాత పీపల్ క్యారియర్ అయిన ట్రాక్స్ ని పునరుద్దరించి విడుదల చేసింది. ఈ మోడలు ని రూ. 8.68 లక్షలకు డ్యువల్ టోన్ అంతర్ఘతాలతో మరియూ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటుగా కొత్త డ్యాష్‌బోర్డ్ ని కలిగి ఉంటుంది. పైగా, ఈ వాహనానికి ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్ ఉంది. ఈ వాహనానికి 3 సంవత్సరాలు/3 లక్షల కిలోమీటర్ల వారెంటీ తో పాటు 7 ఉచిత సర్వీసులను అందిస్తున్నారు.
ఎయిర్ కండిషన్ ఉన్న ట్రాక్స్ డీలక్స్ కి మెర్సిడేజ్ MO616 నుండి పునికి తెచ్చుకున్న 2.6-లీటర్ ఇంజిను ఉండి ఇది 81bhp శక్తి ఇంకా 230Nm టార్క్ ని 1800-2000ఆర్పీఎం వద్ద విడుదల చేయగలదు. ఈ మోడలుకి బాహ్యంగా కొత్త ముందు వైపు గ్రిల్లు, కొత్త ముందు ఇంకా వెనుక బంపర్లు మరియూ గుండ్రటి హెడ్‌లైట్లు ఉంటాయి. ఇంకా, సొగసైన గ్రాఫిక్స్ పక్క వైపున, వీల్ ఆర్చెస్ మరియూ అందమైన వీల్ కవర్లు ఉండి మాడర్న్ గా కనపడుతుంది. సేల్స్ మరియూ మార్కెటింగ్ కి ప్రెసిడెంట్ అయిన మిస్టర్. అశుతోష్ ఖోస్లా గారు," ట్రాక్స్ పూర్తిగా దేశంలోనే తయారైంది. గత మూడు దశాబ్దాలుగా ఇది గ్రామీణ మరియూ పాక్షిక గ్రామీణ ప్రాంతాలలో మన్ననలను పొందుతూ వస్తోంది. ఈ కొత్త పునరుద్దరించిన సమర్పణ మా అభివృద్దిలో మరొక అడుగు," అని అన్నారు.
0 out of 0 found this helpful