ఫోర్స్ గుర్ఖా రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ (ఆరెఫ్సీ) ఇండియా : సీజన్ 2

ఫోర్స్ గూర్ఖా 2017-2020 కోసం అభిజీత్ ద్వారా జూలై 28, 2015 01:05 pm సవరించబడింది

  • 18 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ప్రపంచంలో పది అతి క్లిష్టమైన ఆఫ్-రోడ్ ఛాలెంజుల్లో ఒకటైన రెయిన్ ఫారెస్ట్ రెండో సారి భారతదేశంలో జరగనుంది. మలేసియా లో పుట్టిన ఈ పోటీ, ప్రస్తుతం వానలతో తడిసి ముద్ద అవుతున్న గోవా లో జులై 24న మొదలయ్యి జరుగుతోంది. ఈ 7 రోజుల కార్యక్రమం ఆఫ్ రోడింగ్ దిగ్గజాలను వారి ప్రతిభని పరీక్షిస్తుంది.   

క్రితం సంవత్సరం లాగే ఆరెఫ్సీ 2015 ఫోర్స్ గుర్ఖ వారిచే నిర్వహించబడుతుంది మరియూ ఇది క్రితం సంవత్సరం యొక్క డిఫెండింగ్ ఛాంపియన్. ప్రస్థుతం వారు గెలవటానికి చండిగడ్ నుండి జెర్రారీ ఆఫ్రోడర్స్ ని, చార్మినార్ ఆఫ్రోడ్ క్లబ్, కేరళా నుండి ఆఫ్రోడర్స్, గోవా నుండి, హైదరాబాద్, పొలారిస్ ఇండియా మరియూ ఇతరులతో ప్రయత్నిస్తున్నారు. 

ఈ కార్యక్రమం భిన్న విభాగాలలో, బండి హ్యాండ్లింగ్ నైపున్యాలు, కాపాడే గుణం, సమయం, సురక్షణ, చురుకుదనం మరియూ జట్టుగా కలిసి పని చేసె గుణాలను పరీక్షిస్తారు. ఇవి కాకుండా, ఈ పోటీకి ఎంతో మానసిక మరియూ శారీరక నిబ్బరం ఉండాలి. దీనికోసమై టీంలు అన్ని ఒక ఏడాది కాలం పాటు తయారు చేయబడుతున్నాయి. పోటీదారులు ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఎంటో చూద్దాము. 

ఈ పోటీలో ప్రొలోగ్, ప్రిడేటర్, టర్మినేటర్ మరియూ ట్వైలైట్ వంటి నాలుగు విభాగాలు ఉంటాయి. ఇందులో 24 ఉపవర్గాలు స్పెషల్ స్టేజెస్ పేరిట విభజించి ఉన్నాయి. ఈ ఉపవర్గాలు అన్నీటిలో జాడల మార్గాలు, సందులు, కందకాలు, సహజ అలానే కృత్రిమ అడ్డంకులు మరియు నీటి అగమ్య ప్రవాహాలు ఉంటాయి.

ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం మరియూ తాజా లైవ్ మైదానం నుండి, అంటే గోవా నుండి మీకు అందిస్తాము.

ఆరెఫ్సీ రోజు 1

మొదటి రోజు ఈకువ సమయం ప్రెస్స్ కాంఫరెన్స్ కి మరియూ ఇతర వాహనాలను పరీశీలించడానికే కేటాయించబడింది. డ్రైవర్ల పరిచయం తరువాత రాత్రికి పోటీతో ఈ ఉత్సవం ప్రారంభం అయ్యింది. 

ఆర్ ఎఫ్ సి డే 2

రెండవ రోజు ఫస్ట్ లెగ్ ఆర్ ఎఫ్ సి2015 పోటీలు నిర్వహించబడ్డాయి. వాటిలో 1-6 దశలు కలవు. చాలా మంది డ్రైవర్లు ఆర్ ఎఫ్ సి యొక్క చివరి సీజన్లో పాల్గొని కష్టాలను ఎదుర్కొన్నారు. వారితో పాటు కొత్తగా ప్రవేశించిన చార్మినార్ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ క్లబ్ యొక్క సభ్యులయినటువంటి డాక్టర్ చైతన్య చల్లా మరియు మన్ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. రాష్ట్రంలో వర్షం అధిక స్థాయి లో ఉండడం మూలాన ప్రస్తుతం ఉన్న ఆర్ ఎఫ్ సి గత సంవత్సరం కంటే, మరింత సవాలుగా రాబోతున్నది. కబీర్ వరాయిచ్ అనే వ్యక్తి రెప్పపాటు కాలంలో ఒక అడ్డంకి ఎదుర్కొని మహీంద్రా సి జె3బి జీప్ తిరబడి వైఫల్యానికి గురయ్యింది. కబీర్ గత సంవత్సరం పోటీల్లో 3వ స్థానం సంపాదించుకున్నారు.

కౌగర్ మోటర్ ప్రెవేట్ లిమిటెడ్ యొక్క స్థాపకుడు మరియు డైరెక్టర్ అయినటువంటి ఆశిష్ గుప్తా ఈ విధంగా మాట్లాడారు" పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది.ఆర్ ఎఫ్ సి మాతృ ఈవెంట్ కోసం గత సంవత్సరం మలేషియా వెళ్ళిన భారత జట్టు చాలా నైపుణ్యంతో పాల్గొన్నారు. అయితే, ఇప్పుడప్పుడే విజేతలు గురించి ఎటువంటి నిర్ణయానికి రాకూడదు. ఇది కేవలం మొదటి రోజు మాత్రమే ఇంకా ఆఖరి విజేతను ప్రకటించేందుకు చాలా సమయం ఉందని తెలిపారు".

ఆర్ ఎఫ్ సి డే 3 

మూడవ రోజు ఎస్ ఎస్7-12 యొక్క కొనసాగింపుగా ముందుకు తీసుకువెళ్ళబడింది. మనిందర్ సింగ్ చే నడపబడిన జీప్ నెం.117 , ఎస్ ఎస్ 12 వద్ద పక్కకు ఒరిగి ఆగిపోవడం వలన అతను రేస్ ను పూర్తి చేయలేకపోయాడు. అయితే, హైడ్రాస్ నియాజ్ చే నడపబడిన నీలం ట్రక్ నెం.112, 8వ స్టేజ్ వద్ద ముందరి స్టీరింగ్ ఆక్సిల్ దెబ్బతింది. 

ఎస్ ఎస్8 యొక్క ప్రాధానాధ్యక్షుడు రందీప్ మిగ్లానీ ,ఎస్ ఎస్ 8 ను పూర్తి చేసేందుకు 8 నిముషాల సమయం పడుతుందని తెలిపారు. అయితే, టాన్ ఎంగ్ జో అనే వ్యక్తి సుమారు 2 నిముషాల 50 సెకెన్లలో ఎస్ ఎస్ 8 ను పూర్తి చేయగలిగి బెంచ్ మార్క్ ని సృష్టించారు. కబీర్ వరాయిచ్ ఈ దశలో బాగా నమ్మకంగా కనిపించినప్పటికీ రేస్ ను పూర్తి చేయలేకపోయారు.

ఇంకా రానుంది : ఆరెఫ్సీ 2015 నుండి తాజా యాక్షంకై చూస్తూనే ఉండండి 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్స్ గూర్ఖా 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience