Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మేము 2019 లో పరీక్షించిన ఐదు అత్యంత ఇంధన సమర్థ పెట్రోల్ కార్లు

జనవరి 03, 2020 12:27 pm dhruv ద్వారా సవరించబడింది

మా జాబితాలోని ఐదు కార్లలో రెండు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను ఉపయోగిస్తాయి, అది కూడా AMT లు, దీనిబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు ఎంత దూరం వచ్చాయి అనేది హైలైట్ అవుతుంది

కొత్త కారు కొనడం అందరికీ భిన్నమైన అనుభవం. కొంతమంది కారు బాగుందా లేదా అని చూస్తారు, ఇంకొంతమంది పనితీరు బాగుందా లేద అని చూస్తారు, అయితే మరికొంతమందికి కావలసిన సౌకర్యాలు మరియు భద్రతా లక్షణాలు ఉండాలని అనుకుంటారు కానీ రెండవ అతి ముఖ్యమైన అంశం అందరు కావాలనుకొనేది మాత్రం ఫ్యుయల్ ఎఫిషియన్సీ.

ఆ కొనుగోలు నిర్ణయాన్ని వారికి సులభతరం చేయడానికి, మేము 2019 లో పరీక్షించిన అత్యంత ఫ్యుయల్ ఎఫిషియన్సీ కలిగిన ఐదు కార్ల జాబితాను మీ ముందు ఉంచాము. హైవే రన్ మరియు సిటీ రన్ చేయడం ద్వారా కార్ల ఫ్యుయల్ ఎఫిషియన్సీ పరీక్షించాము మరియు ఈ రెండిటినీ కలిపాము, ఈ రెండిటిని కలిపిన సంఖ్యలను సగం హైవే మరియు సగం సిటీ డ్రైవింగ్ ఉంటుందని ఊహించి చేశాము.

5. మారుతి వాగన్ఆర్ 1.2 MT

సిటీ లో పరీక్షించిన సామర్థ్యం: 15.2 కి.మీ.

హైవే పై పరీక్షించిన సామర్థ్యం: 20.73 కి.మీ.

సిటీ మరియు హైవే సామర్థ్యం యొక్క ఏవరేజ్: 17.97 కి.మీ.

క్లెయిం చేసిన ARAI సామర్థ్యం: 21.5 కి.మీ.

ఇంజిన్ డిస్ప్లేస్‌మెంట్ / మాక్స్ పవర్ / పీక్ టార్క్: 1.2-లీటర్ / 83 Ps / 113Nm

ధర: రూ .5.10 లక్షల నుంచి రూ .5.44 లక్షలు (ఎక్స్‌షోరూమ్, న్యూ ఢిల్లీ)

వాగన్ఆర్ సంవత్సరం ప్రారంభంలో పూర్తి జన్యు మార్పుకు గురైంది మరియు దానితో, మారుతి తన ఇతర మోడళ్లలో ఉపయోగించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను ఈ టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్‌లో ప్రవేశపెట్టింది. మరియు ఆశ్చర్యకరంగా, ఇది చాలా సమర్థవంతంగా ఉంది. దీని అర్థం ఏమిటంటే, మీకు తేలికైన ఫుట్ తో ఎక్కువ పవర్ ని రాబట్టుకొని మంచి ఫ్యుయల్ ఎఫిషియన్సీ ని అందిస్తుంది.

4. రెనాల్ట్ క్విడ్ 1.0 AMT

నగరంలో పరీక్షించిన సామర్థ్యం: 17.07 కి.మీ.

హైవేపై పరీక్షించిన సామర్థ్యం: 21.15 కి.మీ.

సిటీ మరియు హైవే సామర్థ్యం యొక్క ఏవరేజ్: 19.11 కి.మీ.

క్లెయిమ్ చేసిన ARAI సామర్థ్యం: 24.04 కి.మీ.

ఇంజిన్ డిస్ప్లేస్‌మెంట్ / మాక్స్ పవర్ / పీక్ టార్క్: 1.0-లీటర్ / 68 పిఎస్ / 91 ఎన్ఎమ్

ధర: రూ .4.63 లక్షల నుంచి రూ .4.92 లక్షలు (ఎక్స్‌షోరూమ్, న్యూ ఢిల్లీ)

క్విడ్ అక్కడ అత్యంత బడ్జెట్- ఫ్రెండ్లీ పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి మరియు దీనిని బడ్జెట్- ఫ్రెండ్లీ అని పిలుస్తారు. ఇదే కారణంతో దీనిని మా లిస్ట్ లో నాల్గవ స్థానంలో ఉంచాము. ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ కార్ల డిమాండ్ పెరుగుతుండటంతో, ఈ కారుని లిస్ట్ లో చూడటం ఒక మంచి పరిణామం.

3. మారుతి స్విఫ్ట్ MT

నగరంలో పరీక్షించిన సామర్థ్యం: 16.1 కి.మీ.

హైవేపై పరీక్షించిన సామర్థ్యం: 22.43 కి.మీ.

సిటీ మరియు హైవే సామర్థ్యం యొక్క ఏవరేజ్: 19.27 కి.మీ.

క్లెయిం చేసిన ARAI సామర్థ్యం: 21.21 కి.మీ.

ఇంజిన్ డిస్ప్లేస్‌మెంట్ / మాక్స్ పవర్ / పీక్ టార్క్: 1.2-లీటర్ / 83 పిఎస్ / 113 ఎన్ఎమ్

ధర: రూ .5.14 లక్షల నుంచి రూ .7.53 లక్షలు (ఎక్స్‌షోరూమ్, న్యూ ఢిల్లీ)

స్విఫ్ట్ మూడవ తరం లో ఉంది మరియు భారతీయ కార్ల కొనుగోలుదారులకు దీనిపట్ల ప్రేమ పెరుగుతునే ఉంది. స్పోర్టి లక్షణాలకు పేరుగాంచిన, స్విఫ్ట్ ఈ జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది, ఇది ఆల్ రౌండర్ గా నిలిచింది. ఇది జాబితాలో చేరిన మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ అనే వాస్తవం అన్నింటికన్నా ముఖ్యమైనది, ఎందుకంటే దాని స్పోర్టి స్వభావం AMT ఉండటం వల్ల మందగించబడదు.

2. తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్‌తో టయోటా గ్లాంజా MT

సిటీ లో టెస్టెడ్ ఎఫిషియన్సీ: 17.13 కి.మీ.

హైవే పై పరీక్షించిన సామర్థ్యం: 24.25 కి.మీ.

సిటీ మరియు హైవే సామర్థ్యం యొక్క ఏవరేజ్: 20.69 కి.మీ.

క్లెయిమ్ చేసిన ARAI సామర్థ్యం: 23.87kmpl

ఇంజిన్ డిస్ప్లేస్‌మెంట్ / మాక్స్ పవర్ / పీక్ టార్క్: 1.2-లీటర్ / 90 పిఎస్ / 113 ఎన్ఎమ్

ధర: రూ .7.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూ ఢిల్లీ)

మీరు ప్రస్తుతం ఏమి ఆలోచిస్తున్నారో మాకు తెలుసు - ఇది టయోటా బ్యాడ్జ్ ఉన్న బాలెనో. మీరు చాలా వరకూ కరెక్ట్. అయినప్పటికీ మేము పరీక్షించిన గ్లాంజా, సంబంధిత బాలెనో వేరియంట్ కంటే చాలా తక్కువ ధరతో ఉంది మరియు టయోటా హ్యాచ్‌బ్యాక్ వారెంటీతో వస్తుంది, ఇది బాలెనో తో మారుతి అందించే దానికంటే మంచిది. ఇంకా ఏమిటంటే, తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థ దీనిలో సరిగ్గా పనిచేస్తుంది!

1. మారుతి ఎస్-ప్రెస్సో AMT

సిటీ లో పరీక్షించిన సామర్థ్యం: 19.96 కి.మీ.

హైవేపై పరీక్షించిన సామర్థ్యం: 21.73 కి.మీ.

సిటీ మరియు హైవే సామర్థ్యం యొక్క ఏవరేజ్: 20.85 కి.మీ.

క్లెయిమ్ చేసిన ARAI సామర్థ్యం: 21.7 కి.మీ.

ఇంజిన్ డిస్ప్లేస్‌మెంట్ / మాక్స్ పవర్ / పీక్ టార్క్: 1.0-లీటర్ / 68 పిఎస్ / 90 ఎన్ఎమ్

ధర: రూ .4.68 లక్షల నుంచి రూ .4.91 లక్షలు (ఎక్స్‌షోరూమ్, న్యూ ఢిల్లీ)

ఎస్-ప్రెస్సో మారుతి నుండి సరికొత్త సమర్పణ మరియు జాబితాలో రెండవ AMT కూడా. రెండు పెడల్‌ లతో మాత్రమే వచ్చినప్పటికీ, ఇది అగ్రస్థానంలో నిలిచిన వాస్తవం మాకు ఆశ్చర్యం కలిగించింది. అయితే, ఇదంతా దాని అద్భుతమైన సిటీ సామర్థ్యం కారణంగా ఉంది. జాబితాలోని ఇతర కార్లలో దాని హైవే సామర్థ్యం అంతగా బాలేదని గమనించడం ఆసక్తికరంగా ఉంది, అయితే ఇది దాని సిటీ మరియు హైవే సామర్థ్యానికి మధ్య ఉన్న చిన్న గ్యాప్ వలన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

కారు యొక్క ఫ్యుయల్ ఎఫిషియన్సీ ఎక్కువగా డ్రైవింగ్ స్టైల్, కారు ఆరోగ్యం మరియు డ్రైవింగ్ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారకాలు ఏవైనా ప్రభావితమైతే సంఖ్యలు సులభంగా మారవచ్చు. మీరు జాబితాలో ఏదైనా కార్లను కలిగి ఉన్నారా? దిగువ వ్యాఖ్యలలో మీరు సాధించగల ఫ్యుయల్ ఎఫిషియన్సీ మాకు తెలియజేయండి.

d
ద్వారా ప్రచురించబడినది

dhruv

  • 21 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

A
anu jain
Jan 1, 2020, 4:04:18 PM

Vento Tsi 15 city 22 highway

J
joban lehal joban
Dec 29, 2019, 2:37:36 AM

Pb 18 p 1000

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర