Sonet Faceliftను మొదటిసారి అధికారికంగా విడుదల చేయనున్న Kia
కియా సోనేట్ కోసం rohit ద్వారా డిసెంబర్ 02, 2023 07:17 pm ప్రచురించబడింది
- 282 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సోనెట్ ఫేస్ؚలిఫ్ట్‌ను భారతదేశంలో డిసెంబర్ 14వ తేదీన ఆవిష్కరించనున్నారు
-
సోనెట్‌ను కియా మొదటిసారి 2020లో భారతదేశంలో పరిచయం చేసింది.
-
దీని మొదటి టీజర్‌లో నవీకరించిన గ్రిల్, LED DRLలు, హెడ్ؚలైట్ؚలు మరియు ఫాగ్ ల్యాంప్ؚలు కనిపించాయి.
-
క్యాబిన్ నవీకరణలలో సరికొత్త అప్ؚహోల్ؚస్ట్రీ మరియు కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉన్నాయి.
-
360-డిగ్రీల కెమెరా మరియు బహుశా ADAS వంటి అదనపు ఫీచర్‌లు ఉంటాయని అంచనా.
-
ప్రస్తుతం సోనెట్ؚలో ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్-గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది.
-
ధరలు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.
కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ ఆవిష్కరణ తేదీ గురించిన సమాచారం కొద్ది రోజుల క్రితమే తెలియజేశాం. ప్రస్తుతం, ఈ కారు తయారీదారు నవీకరించిన SUV టీజర్ؚను విడుదల చేయడం ద్వారా ఇది ధృవీకరించింది.
గమనించిన వివరాలు
ఈ వీడియోలో నవీకరించిన SUV ముందు భాగాన్ని చూడవచ్చు. ఇందులో సవరించిన గ్రిల్ డిజైన్, పదునైన మల్టీ-రిఫ్లెక్టర్ LED హెడ్‌లైట్ క్లస్టర్ؚలు మరియు ఫాంగ్ అకారపు LED DRLలు ఉన్నాయి. ఈ మార్పులను చైనా-స్పెక్ నవీకరించిన సోనెట్ؚలో ఇప్పటికే చూశాము, కానీ ఇండియా-స్పెక్ వర్షన్ؚలో కొన్ని తేడాలు ఉండవచ్చు. టీజర్ؚలో, నాజూకైన LED ఫాగ్‌లాంప్ؚలతో భిన్నమైన స్టైల్ؚతో ఉన్న ఫ్రంట్ బంపర్ؚను గమనించవచ్చు (ప్రస్తుత మోడల్ హాలోజెన్ ప్రొజెక్టర్ యూనిట్లను కలిగి ఉంది)
నలుపు రంగులో ఉన్న ORVM హౌసింగ్ؚలు మరియు నలుపు రంగు రూఫ్ؚతో సవరించిన ఆలాయ్ వీల్ డిజైన్ؚను కూడా చూడవచ్చు. దీని వెనుక భాగాన్ని ప్రస్తుతానికి వెల్లడించలేదు, అయితే నవీకరించిన కియా సెల్టోస్ؚలో ఉన్నట్లుగా కనెక్టెడ్ LED టెయిల్‌లైట్ సెట్అప్ ఇందులో ఉంటుందని అంచనా.
క్యాబిన్ మరియు ఫీచర్ మార్పులు
ఎక్స్ؚటీరియర్ؚ విధంగా కాకుండా, కొత్త కియా సోనెట్ ఇంటీరియర్ؚలో భారీ మార్పులు చేయలేదు. లోపలి వైపు కొత్త అప్ؚహోల్ؚస్ట్రీ మరియు బహుశా సవరించిన క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ؚను అందించడం ద్వారా లోపలి వైపు నవీకరించవచ్చు. టీజర్ؚలో ప్రస్తుత మోడల్ؚలో ఉన్న 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మరియు సెంట్రల్ AC వెంట్ؚలను చూడవచ్చు.
నవీకరించిన సోనెట్ సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 360-డిగ్రీల కెమెరాతో వస్తుందని అంచనా. ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ కాకుండా, సోనెట్ؚలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు సింగిల్-పేన్ సన్ؚరూఫ్ వంటి ఫీచర్‌లను కూడా నిలుపుకుంటుంది.
భద్రత విషయంలో, కియా దీనిలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ؚను (ADAS) అందించవచ్చు.
సుపరిచిత డ్రైవింగ్ ఫోర్స్
నవీకరించిన కియా సోనెట్ ప్రస్తుత మోడల్‌లో ఉన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలను నిలుపుకుంది. ఇవి 83 PS/115 Nm 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (5-స్పీడ్ MTతో), 120 PS/172 Nm 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (6-స్పీడ్ iMT లేదా 7-స్పీడ్ DCTతో) మరియు 116 PS/250Nm 1.5-లీటర్ డీజిల్ ఇంజన్) 6-స్పీడ్ iMT లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ؚ)
ఇది కూడా చదవండి: క్యాలెండర్ ఇయర్ చివరిలో కొత్త కారును కొనుగోలు చేయడంలో లాభాలు మరియు నష్టాలు
ధర మరియు పోటీదారులు
2024లో విక్రయాలు ప్రారంభంకానున్నాయి, కియా సోనెట్ ప్రారంభ ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా. ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్, మరియు మారుతి ఫ్రాంక్స్ క్రాస్ؚఓవర్ؚలతో పోటీని కొనసాగిస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: కియా సోనెట్ ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful