ఆగస్ట్టు 12 న ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఫిగో అస్పైర్ సెడాన్

ఫోర్డ్ ఆస్పైర్ కోసం saad ద్వారా ఆగష్టు 04, 2015 06:05 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫిగో అస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ను ఫోర్డ్ ఇండియా వచ్చే వారం ప్రారంభించటానికి ప్రణాళిక చేసింది. నివేదికల ప్రకారం, ఈ వాహనాన్ని ఆగస్టు 12 న సబ్ 4 మీటర్ల కారు లా ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నారు. 30,000 ముందస్తు చెల్లింపుతో 27 జూలై, 2015  నుండే ప్రీ బుకింగ్స్ ను ప్రవేశపెట్టారు. ఈ ఫిఎగో అస్పైర్, ఈ విభాగంలో ఉన్న స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ టాటా జెస్ట్ వంటి వాహనాలతో గట్టి పోటీ ను ఇవ్వడానికి రాబోతుంది.

ఈ ఫిగో అస్పైర్ వాహనం, కంటికి ఆకర్షణీయంగా ఉండేలా అనేక లక్షణాలతో రాబోతుంది. ఫోర్డ్ యొక్క కైనెటిక్ డిజైన్ వేదాంతం ఆధారంగా ఈ వాహనం రూపొందించబడి రాబోతుంది. దీనితో పాటు, ఫోర్డ్ ఫియాస్టా లో ఉండే ఆస్టన్ మార్టిన్ స్టైలెడ్ గ్రిల్ తో రాబోతుంది. అంతేకాకుండా, ఈ వాహనం లో డ్యూయల్ ఎయిర్ బాగ్స్ ప్రామాణికంగా అందించబడతాయి. అంతేకాకుండా, వీటితో పాటు వీటి అగ్ర శ్రేణి వేరియంట్ లో ఆరు ఎయిర్ బాగ్స్ అందించబడతాయి. సింక్ సమాచార వ్యవస్థ తో పాటు ఫోర్డ్ ఆప్ లింక్, స్మార్ట్ఫోన్లు చార్జింగ్ కోసం మరియు డాకింగ్ కొరకు మై ఫోర్డ్ డాక్, ఫోర్డ్ మై కీ వంటి అనేక అంశాలతో రాబోతుంది.

హుడ్ క్రింది విషయానికి వస్తే, ఫోర్డ్ ఫిగో అస్పైర్ వివిధ ఇంజన్ ఎంపికలతో రాబోతుంది. ఈ కాంపాక్ట్ సెడాన్ రెండు టి- వి సి టి పెట్రోల్ ఇంజిన్ లతో రాబోతుంది. దీనిలో ఒకటి 1.2 లీటర్ టి- విసిటి పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ అత్యధికంగా, 88 పిఎస్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా రెండవది అయిన 1.5 లీటర్ టి- విసిటి పెట్రోల్ ఇంజన్, అత్యధికంగా 112 పిఎస్ పవర్ ను విడుదల చేస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్  5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు, శక్తివంతమైన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఈ విభాగంలో మొదటి సారిగా 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క పెట్రోల్ వేరియంట్ లు 18.2 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తాయి. అదే విధంగా డీజిల్ వేరియంట్ లు అత్యధికంగా 25.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తాయి.

భారతదేశం లో, ఈ ఫిగో అస్పైర్ యొక్క ధర రూ. 5.5 నుండి 8.5 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇది నాలుగు వేరియంట్లతో వచ్చే అవకాశాలున్నాయి. వాటి యొక్క పేర్లు వరుసగా, ఆంబియంట్, ట్రెండ్, టైటానియం మరియు టైటానియం +.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ఆస్పైర్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience