ఈ పండుగ కాలానికి ఫియట్ వారు డబుల్ ధమాకా ఆఫర్ ని విడుదల చేశారు
అక్టోబర్ 14, 2015 10:13 am manish ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
వచ్చే పండుగ కాలానికి ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ (FCA) వారు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. పరిమిత కాలం ఆఫర్ల జాబితాను కంపెనీ వారు విడుదల చేశారు. ఇవి వారి చాలా కార్లకి అందుబాటులో ఉంచారు. పుంటో ఈవిఒ, అవ్వెంచురా, లీనియా ఎఫ్ఎల్ ఇంకా లీనియా క్లాసిక్ లపై కస్టమర్లు డబుల్ ధమాకా ఆఫర్లను అందుకోగలరు. ఆ వివరాలు ఈ విధంగా క్రింద తెలుపడం అయ్యింది:
- పుంటో ఈవో: రూ.70,000 వరకు లాభాలు + డబుల్ ధమాకా
- అవ్వెంచురా: రూ.80,000 వరకు లాభాలు + డబుల్ ధమాకా
- లీనియా ఎఫ్ఎల్: రూ.1,10,000 వరకు లాభాలు + డబుల్ ధమాకా
- లీనియా క్లాసిక్: రూ.40,000 వరకు లాభాలు + డబుల్ ధమాకా
ఈ డిస్కౌంట్లతో పాటుగా ఫియట్ వారు అబార్త్ పుంటో ఈవో యొక్క అక్టోబరు 19న విడూదలకై సన్నాహాలలో ఉన్నారు. ఈ కారుకి 1.4-లీటర్ మోటరు ఉండి ఇది 145 శక్తి విడుదల చేస్తుంది. ఈ ఇంజిను లీనియా సెడాన్ లో కూడా ఉంటుంది. అబార్త్ పుంటో ఈవో కి స్పోర్టీ అబార్త్ డీకాల్స్ ఉంటాయి, రేసింగ్ స్ట్రిప్స్ ఇంకా విభిన్నమైన వర్ణ స్కీములు కూడా ఉంటాయి. స్కార్పియన్ పైనర్ అల్లోయ్ వీల్స్ కి అన్ని వైపుల డిస్క్ బ్రేకులు జత చేయబడి ఉంటాయి. కారుకి బోలెడంత అబార్త్ బ్యాడ్జింగ్ లోపల ఇంకా బయట కూడా కనపడుతుంది. లోపల, స్పోర్టీ ఆల్-బ్లాక్ కలర్ స్కీము మరియూ సీటుపై విభిన్న కుట్టు కనపడుతుంది. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలతో ఫియట్ వారికి ఈ పండుగా కాలం బావుంటుంది.