Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

అబర్త్ పుంటో ఈవిఓ ను ఇండియాలో రహస్యంగా పరీక్షిస్తున్న ఫియాట్

ఫియట్ గ్రాండే పుంటో కోసం raunak ద్వారా జూన్ 16, 2015 04:00 pm ప్రచురించబడింది

ఈ అబార్త్ పుంటో ఈవిఓ అనే మోడల్ ఇటీవల టెస్ట్ డ్రైవ్ లో కనిపించింది. ఇది హాచ్బాక్ విభాగంలో ఉన్న వోక్స్వాగన్ పోలో జిటి టిఎస్ ఐ తో పోటీ పడటానికి రాబోతుంది. అంతేకాకుండా పోలో జిటి టిఎస్ ఐ వేరియంట్ తో పోలిస్తే, ఈ అబార్త్ పుంటో ఈవిఓ వాహనం 135bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, పోలో జిటి టిఎస్ ఐ తో పోలిస్తే, ఇది మాన్యువల్ వర్షెన్ లో రాబోతుంది.

జైపూర్: ఫియాట్ నిజంగా దేశానికి ఏదో ఒకటి విప్లవాత్మకంగా చేయాలని చూస్తోంది. ఇది భారతదేశం లో మొదటి నాన్ లగ్జరీ కారు తయారీ సంస్థ అవుఇతుంది, మరియు వారి ప్రదర్శన భారతదేశం- అబర్త్ లలో ఒక గొప్ప ప్రదర్శన వింగ్ అవుతుంది! అబర్త్ పరిధిలో మొట్ట మొదటి ఉత్పత్తి ఇది, అబర్త్ పుంటో ఇవిఒ మరియు అవెంచురా తరువాత ఆగస్ట్ లో 595 పోటీదారులతో రంగంలోకి దిగబోతుంది. కింద ఉన్న చిత్రాలు రహస్యంగా చిత్రీకరించిన రానున్న హాట్ హాచ్ యొక్క మొట్టమొదటి స్పష్టమైన షాట్లు . ఫియాట్ ఇండియా దీనిని హిమాచల్ ప్రదేశ్ పర్వతాల్లో పరీక్షిస్తోంది. ఈ విభాగంలో వోక్స్వాగన్ జిటి టిఎస్ ఐ తో పోలిస్తే, పుంటో ఈవి ఓ అత్యంత శక్తివంతమైన హాచ్బాక్. అంతేకాక, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తో పోలిస్తే, ఫియాట్ అవంచురా శక్తివంతమైనది అని చెప్పవచ్చు.

ఫియాట్ బ్రాండ్ అనేది ఒక నాన్ లగ్జరీ తయారీ సంస్థ, అంతేకాకుండా అధిక పనితీరునిచ్చే అబార్త్ పుంటో ఈవిఓ మరియు అవంచురా వంటి మోడళ్ళను ప్రవేశపెట్టింది.

ఫియాట్ పుంటో ఈవి ఓ వాహనం వీటి పోటీ దారులైన వోక్స్వాగన్ జిటి టిఎస్ ఐ వాహనతో పోలిస్తే, ఇది ఒక అత్యద్భుతమైన హాచ్బాక్ గా కనిపిస్తుంది. గూడచర్యం అయిన ఈ చిత్రాలలో ఏం కనిపిస్తుందంటే, అబార్త్ గ్రాఫిక్స్, విభిన్న రంగు లలో ఉండే వింగ్ మిర్రర్స్ మరియు 'స్కార్పియన్' అబార్త్ అల్లాయ్ వీల్ వంతివి కనిపించాయి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఏమిటంటే, ఏ రకమైన ఫియాట్ బ్యాడ్జ్లను అమర్చబడి ఉండవు. ఈ వాహనం అబార్త్ యొక్క స్కార్పియన్ బ్యాడ్జ్లను కలిగి ఉంది.

అంతర్గత భాగాల విషయానికి వస్తే, ఎమోషన్ పుంటో ఈవి ఓ అగ్ర శ్రేణి వేరియంట్ లో ఉన్న ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ తో ఈ అబార్త్ పుంటో ఈవి ఓ రాబోతుంది. వీటితో పాటు, నియాన్ కంట్రాస్టింగ్ స్టిట్చింగ్, అబార్త్ లోగోస్, అల్యూమినియం పెడల్స్ వంటి ఇతరాత్రా లక్షణాలతో రాబోతుంది. అయితే, యూరోపియన్ వెర్షన్ లో ఉండే విధంగా కాకుండా, అబార్త్ పుంటో ఈవిఓ వాహనం భారతదేశంలో స్పోర్ట్ సీట్లను పొందడానికి అవకాశం లేదు.

ఇంజన్ పరంగా చెప్పాలంటే, ఇప్పుడు అబార్త్ పుంటో ఈవిఓ వాహనం, లీనియా టి జెట్ లో ఉండే 1.4 లీటర్ టి జెట్ ఇంజన్ తో రాబోతుంది. రాబోయే ఫియాట్ అబార్త్ 595 కాంపిటీజియన్ వాహనం లో కూడా ఇదే ఇంజన్ ఉండబోతుంది. అయితే, ఇప్పుడు ఈ ఇంజెన్ అత్యంత శక్తివంతమైన ఇంజన్. ఈ పుంటో ఈవి ఓ లో ఉండే ఇంజెన్ 5500rpm వద్ద 135 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 3000rpm వద్ద 200Nm గల అత్యధిక టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఈ వాహనాలు 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరుకోవడానికి 10 సెకన్ల సమయం పడుతుంది, ఈ వాహనాలు మరోవైపు అత్యధికంగా 200kmph వేగాన్ని చేరుకోగలవు.

r
ద్వారా ప్రచురించబడినది

raunak

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన ఫియట్ Grande పుంటో

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర