Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ప్రత్యేకం: కర్వ్ؚను పోలిన స్టైల్‌తో మొదటి సారి కనిపించిన కొత్త టాటా నెక్సాన్

టాటా నెక్సన్ 2020-2023 కోసం sonny ద్వారా ఫిబ్రవరి 10, 2023 01:35 pm ప్రచురించబడింది

సరికొత్త లుక్స్, రీడిజైన్ చేసిన క్యాబిన్ؚతో ఇది సంపూర్ణమైన నవీకరణను పొందింది

  • నెక్సాన్ కొత్త వర్షన్, టాటా సరికొత్త డిజైన్‌తో వస్తుంది.

  • సుపరిచితమైన డిజైన్‌తో కనిపిస్తున్న కానీ భారీగా సవరించబడిన ముందు మరియు వెనుక ప్రొఫైల్ؚతో వస్తుంది.

  • పెద్ద డిస్ప్లేలు, మరిన్ని ఫీచర్‌లతో పునరుద్ధరించబడిన క్యాబిన్ؚతో వస్తుంది.

  • నెక్సాన్, టాటా కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది, డీజిల్ ఎంపిక కూడా ఉండవచ్చు.

  • డిజైన్ మరియు ఫీచర్‌లలో మార్పులు, నవీకరించిన నెక్సాన్ EVలో కూడా ఉండవచ్చు.

  • బహుశా కర్వ్ తర్వాత, నవీకరించబడిన నెక్సాన్ 2024లో మార్కెట్‌లోకి రానుంది.

ఎప్పటినుంచో టాటా నెక్సాన్ గణనీయమైన నవీకరణను పొందవలసి ఉంది, ఇటీవల ఈ సరికొత్త వర్షన్ؚ అందుబాటులోకి వచ్చినట్లు అనిపిస్తోంది. దాచిపెట్టిన్నట్లు కనిపించే 2024 నెక్సాన్ టెస్ట్ డిజైన్ వెర్షన్ మొదటిసారిగా కనిపించినట్లు తెలుసుకున్నాము మరియు ఇందులో ఉత్తేజ పరిచే ఎన్నో అంశాలు ఉన్నట్లు కనిపిస్తుంది.

నవీకరించబడింది కానీ సుపరిచితమైన డిజైన్

ఏకరీతిలో ఉన్న సైడ్ ప్రొఫైల్, సారూప్యమైన డిజైన్ కారణంగా కొత్త నెక్సాన్ؚను తేలికగా గుర్తించవచ్చు, ముందు మరియు వెనుక ప్రొఫైల్‌లు భారీ స్టైలింగ్ మార్పులను అందుకున్నాయి. నవీకరించబడిన SUVలో, ప్లాట్ؚఫారంకు ఎటువంటి మార్పులు లేనందున, వీల్ؚబేస్ؚలో కూడా మార్పులు ఉండవని ఆశించవచ్చు.

ముందు వైపు స్టైలింగ్, ఆటో ఎక్స్ؚపోలో ప్రదర్శించిన టాటా కాన్సెప్ట్ కార్‌లు అయిన కర్వ్, సియారా EV వంటి స్టైలింగ్‌లో ఉంటుంది. బంపర్ దిగువన అమర్చబడిన హెడ్ ల్యాంపులతో LED DRL స్ట్రిప్ బోనెట్ؚ పొడుగుతా అమర్చబడి ఉన్నాయి.

ఎక్స్‌పోలో ప్రదర్శించిన డిజైన్ విధంగా కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్‌లు, వెనుక విండ్‌షీల్డ్‌కు దిగువన ఎత్తు పెంచిన బూట్ లిప్ వెంబడి అమర్చే అవకాశం ఉంది.

సరికొత్త ఇంటీరియర్

తెలుసుకున్న దాన్ని బట్టి, కొత్త నెక్సాన్ నవీకరించబడిన క్యాబిన్ؚతో వస్తుందని ఆశించవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో నెక్సాన్ అత్యధికంగా అమ్ముడయ్యే SUV (నెలవారీ అమ్మకాల ప్రకారం) అయినప్పటికీ, ఈ నవీకరణ దీనికి ఎంతగానో అవసరమైనది.

నవీకరించబడిన ఈ SUV టాటా కొత్త 10.25-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ టచ్ؚస్క్రీన్ؚ‌తో వస్తుంది, దాని పోటీదారులలో ఉన్నట్లు నవీకరించిన డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మరిన్ని ప్రీమియం సౌకర్యాలను కూడా అందించవచ్చు.

సంబంధించినది: ఆటో ఎక్స్ؚపో 2023లో టాటా హ్యారియర్, సఫారీలలో పరిచయం చేసిన 5 సరికొత్త ఫీచర్‌లు

అనేక రకాల పవర్ؚట్రెయిన్ؚలు

ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ - మూడు ప్రధాన ఇంధన రకాల ఎంపికలతో అందించబడుతున్న ఒకే ఒక కారు నెక్సాన్. దీని నవీకరించబడిన వెర్షన్ కూడా వీటిని అందించడం కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి, 1.5-లీటర్ డీజిల్ కొనసాగవచ్చు. పరిధిని, పనితీరుని మెరుగుపరచడానికి నెక్సాన్ EV మోడల్‌లకు మరిన్ని నవీకరణలు అందించవచ్చు. నెక్సాన్ؚలో వచ్చిన డిజైన్, ఫీచర్ నవీకరణలు నెక్సాన్ EVలో కూడా ఉండవచ్చు.

అదే డిస్ؚప్లేస్ؚమెంట్ؚతో ప్రస్తుత యూనిట్ కంటే మరింత E20 అనుకూలత, మరింత శక్తివంతం అయిన కొత్త 1.2-లీటర్ TGDi (టర్బో చార్జెడ్ పెట్రోల్) ఇంజన్ؚతో నవీకరించిన నెక్సాన్ؚను టాటా అందించవచ్చు. దీని అవుట్‌పుట్ 125PS పవర్, 225Nm టార్క్‌లను అందిస్తుంది. అంతేకాకుండా డ్యూయల్-క్లచ్ ఆటోమ్యాటిక్ ఎంపికతో అందించవచ్చు. వీటితో పోలిస్తే, మార్కెట్‌లోకి విడుదల చేసినప్పటి నుంచి నెక్సాన్ؚలో ఒకే ఒక ఆటోమ్యాటిక్ ఎంపిక AMT (పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లు రెండిటికీ) అందుబాటులో ఉంది.

విడుదల అంచనా

సరికొత్త టాటా నెక్సాన్ؚ మొదటిసారిగా ఇప్పుడే కనిపించినందున, ఇది 2024 నాటికి మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధం అవుతుందని భావిస్తున్నాము. ఇది బహుశా కర్వ్ కాంపాక్ట్ SUV తరువాత కూడా రావచ్చు. మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి వాటితో ఈ మెరుగుపరిచిన, నవీకరించబడిన నెక్సాన్ తన పోటీని కొనసాగిస్తుంది.

ఇమేజ్ క్రెడిట్స్: రోహిత్ షిండే

ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ AMT

s
ద్వారా ప్రచురించబడినది

sonny

  • 73 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టాటా నెక్సన్ 2020-2023

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర