ప్రత్యేకం: డాట్సన్ భారతదేశపు 'క్రాస్ ఓవర్' మార్కెట్ లోకి అడుగు పెట్టే యోచనలో ఉన్నారు

సెప్టెంబర్ 04, 2015 03:47 pm cardekho ద్వారా సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

యోకోహామా: జపనీస్ వాహన డాట్సన్ కొత్త క్రాస్ఓవర్ మార్కెట్ తో సహా  భారతదేశం లో అనేక విభాగాలలోనికి ప్రవేశించడానికి శ్రద్ద చూపినట్టు తెలుస్తుంది. డాట్సన్ యొక్క గ్లోబల్ హెడ్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్  విన్సెంట్ కోబీ తో  ఈరోజు యోకోహామా (జపాన్) లో చర్చను బట్టి చూస్తుంటే డాట్సన్ భారతదేశపు కొత్త ధోరణి ని అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది మరియు కొత్తగా ఉద్భవిస్తున్న విభాగాలలో వారు కూడా ఉన్నారని భావనను కల్పిస్తుందని తెలుస్తుంది. ఇది ఒక కొత్త క్రాసోవర్ సెగ్మెంట్ ని కలగలుపుకుంటుంది - కానీ ఏమిటీ మరియూ దేనితో అనే విషయాలు ఇంకా మర్మమే. నిన్న అట్సుగీ సెంటర్లో మేము గో హ్యాచ్బ్యాక్ యొక్క డిజిటల్ మోడల్ పై డిజైనర్లు పనిచేయడం గమనించాము. రూఫ్ రెయిల్స్, పెద్ద ఆర్చెస్ మరియూ వేరే రకమైన వీల్ డిజైన్ వగైరా లు కూడా గమనించడం జరిగింది. ఈ క్రాస్-ఓవర్ కనుక వస్తే, ఇతర మార్కెట్లలోకి కూడా వస్తుంది అని ఆశించవచ్చును.

డాట్సన్ వారి నుండి కొత్త క్రాస్-ఓవర్ కనుక విడుదల అయితే బావుంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్థుత భారతీయ మార్కెట్ లో ప్రీమియం హ్యాచ్బ్యాక్ తరువాత అధికంగా ఇష్టపడేది కాపాక్ట్ ఎస్యూవీ లు మరియూ క్రాస్-ఓవర్లే. ప్రతి కారు తయారీదారి ఈ సెగ్మెంట్ లోనే ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. జే.డీ.పవర్ నివేదిక ప్రకారం, ఎస్యూవీ యొక్క అమ్మకాలు 3.8 లక్షల నుండి రెండింతలు పెరిగి ఇప్పుడు 9.08 లక్షలుగా ఏటా 2020 సంవత్సరానికి అమ్ముడు అవుతాయి.

మారుతీ, హ్యుండై మరియూ మహింద్రా వంటి పెద్ద కార్ తయారీదారులు ఇప్పటికే ఈ సెగ్మెంట్ పై ఎక్కువగా అధారపడి మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. మహింద్రా వారు వారి కాంపాక్ట్ ఎస్యూవీ అయిన టీయూవీ300 ని సెప్టెంబర్ 10న విడుదల చేస్తారు మరియూ మరొక పక్క మారుతీ మరియూ హ్యుండై వారు ఇప్పటికే వారు వాహనాలను విడుదల చేసేశారు. హ్యుండై వారికి అనూహ్యంగా 40,000 బుకింగ్స్ ఇప్పటికే వచ్చాయి ఇంకా మారుతీ వారు సరిపడ ఎస్-క్రాస్ లను అమ్మారు ఇప్పటికే.

డాట్సన్ క్రాసోవర్ భారతదేశానికి వచ్చినట్లయితే, దాని విభాగంలో ఇది అత్యంత సరసమైన కారు అవుతుంది. ఈ విభాగంలో టొయోటా ఎతియోస్ క్రాస్,వోక్స్వ్యాగన్ క్రాస్ పోలో మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటివి   కూడా ఉన్నాయి. ప్రస్తుతం, డాట్సన్ గో హాచ్బాక్ మరియు గో + కాంపాక్ట్ భారతీయ కారు మార్కెట్లో 0.63% మార్కెట్ వాటాను కలిగి ఉంది మరియు గో హాచ్బాక్ మరియు గో + రెండూ కూడా 1300 యూనిట్లు కంటే ఎక్కువ అమ్మకాలు చేస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience