Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ؚతో టాక్సీ మార్కెట్ؚలోకి ప్రవేశించనున్న సిట్రియాన్

సిట్రోయెన్ ఈసి3 కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 17, 2023 04:26 pm ప్రచురించబడింది

eC3 బేస్-స్పెక్ లైవ్ వేరియెంట్ టాక్సీ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది

  • సిట్రియాన్ eC3 29.2kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇది 320 కిమీ మైలేజ్ అందించవచ్చు.

  • దీని ఎలక్ట్రిక్ మోటార్ 57PS, 143Nm పవర్, టార్క్‌ను అందిస్తుంది.

  • ప్రత్యేకంగా టాక్సీ మార్కెట్ కోసం రూపొందించిన eC3లో కూడా సమానమైన స్పెసిఫికేషన్‌లతో రానుంది, అత్యధిక స్పీడ్ 80kmphకు పరిమితం చేయబడింది.

  • ఈ వాహనాన్ని లైవ్, ఫీల్ అనే రెండు వేరియంట్‌లలో అందిస్తున్నారు.

  • eC3 త్వరలోనే ప్రవేశపెట్టబడుతుందని అంచనా.

ఇటీవల సిట్రియాన్ eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ؚను ఆవిష్కరించింది, ధరలు తప్ప దాదాపుగా అన్ని వివరాలను వెల్లడించింది. కొన్ని వారాలలో మార్కెట్‌లోకి రానున్న తరుణంలో ఈ వాహన బుకింగ్ؚలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇటీవలి RTO డాక్యుమెంట్ ప్రకారం eC3, టాక్సీ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాము.

డాక్యుమెంట్ ప్రకారం, టాక్సీ యూనిట్‌ల గరిష్ట వేగం 80 kmphకు పరిమితం కానుంది, అయినప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ؚ 107kmph గరిష్ట వేగాన్ని చేరుకోగల సామర్ధ్యం కలిగి ఉంది. ఫ్లీట్ EV అయిన టాటా టిగోర్ X-Pres T EV వాహనం కూడా ఎలక్ట్రానిక్‌గా 80kmph గరిష్ట వేగానికి పరిమితం చేయబడింది, టాక్సీ విభాగంలోని ఈ వాహనాలకు స్పీడ్ పరిమితి సాధారణంగా కనిపిస్తుంది. టాక్సీ ప్రయోజనాల కోసం సిట్రియాన్ eC3 బేస్-వేరియంట్‌తో కస్టమర్‌ల ముందుకు వస్తుంది అని మేం భావిస్తున్నాము.

ఇది కూడా చూడండి: మళ్ళీ కెమెరాకు చిక్కిన 3-వరుసల సిట్రియోన్ C3, ఈసారి ఇంటీరియర్‌లను చూద్దాం

ఇది ఏమి అందిస్తుంది?

రెండు వేరియెంట్‌లలో వస్తున్న eC3లో అండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ؚప్లేతో 10.2-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోؚటైన్ؚమెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, ఎత్తును-సవరించగలిగిన డ్రైవర్ సీట్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ ఫీచర్‌లు చాలా వరకు eC3 బేస్ వేరియెంట్‌లో ఉండవు, ఈ బేస్-వేరియంట్ؚను టాక్సీ మార్కెట్ؚకు అందిస్తారని అంచనా.

ఇది కూడా చదవండి: అందుబాటులోకి వచ్చిన న్యూఢిల్లీ-దౌసా ఎక్స్ؚప్రెస్ؚవే; ఢిల్లీ-జైపూర్ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది

పవర్ؚట్రెయిన్ వివరాలు

సిట్రియాన్ eC3లో 29.2kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది 57PS, 143Nm పవర్, టార్క్‌ను అందించే ఎలక్ట్రిక్ మోటార్ؚకు శక్తిని అందిస్తుంది. ఈ వాహనం 0 నుండి 60kmph వేగాన్ని 6.8 సెకన్లలో అందుకుంటుంది, 320కిమీ మైలేజ్ అందించవచ్చు (MIDC రేట్ చేసింది).

ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ؚకు బహుళ ఛార్జింగ్ ఎంపికలు ఉన్నాయి, వీటిలో రెండు ప్రధానమైనవి – 154A ప్లగ్ పాయింట్ మరియు DC ఫాస్ట్ ఛార్జర్. వీటి సంబంధిత ఛార్జింగ్ సమయాలు క్రింద పేర్కొనబడ్డాయి

15A ప్లగ్ పాయింట్ (10 నుండి 100% వరకు)

10 గంటల 30 నిమిషాలు

DC ఫాస్ట్ ఛార్జర్ (10 నుండి 80% వరకు)

57 నిమిషాలు

ప్రారంభ తేదీ అంచనా ధరలు

సిట్రియోన్ eC3 విక్రయాలు ఫిబ్రవరి చివరిలో ప్రారంభం కావచ్చు, దీని ప్రారంభ ధర రూ. 11 లక్షలు ఉండవచ్చు. eC3 టాటా టియాగో EV, టాటా టిగోర్ EV వంటి వాటితో ఇది పోటీ పడుతుంది.

సాధారణ వర్షన్ؚతో పాటు eC3 ఫ్లీట్ వెర్షన్ విక్రయాలు కూడా ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నాం, ఇది టాటా టిగోర్ EV X-Pres-Tకి పోటీ ఇస్తుంది.

s
ద్వారా ప్రచురించబడినది

shreyash

  • 64 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన సిట్రోయెన్ ఈసి3

Read Full News

explore మరిన్ని on సిట్రోయెన్ ఈసి3

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.10.99 - 15.49 లక్షలు*
Rs.14.74 - 19.99 లక్షలు*
Rs.7.99 - 11.89 లక్షలు*
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.60.95 - 65.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర