• English
  • Login / Register

షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్ అక్టోబరు 21న విడుదల కానుంది

చేవ్రొలెట్ ట్రైల్ కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 12, 2015 11:15 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

షెవ్రొలే ఇండియా వారు వారి ఎస్‌యూవీ ట్రెయిల్‌బ్లేజర్ ని అక్టోబర్ 21న విడుదల చేయనున్నారు. ఇది మిత్సుబిషి పజెరో స్పోర్ట్ ఇంకా టొయోటా ఫార్చునర్ వంటి ఎస్‌యూవీలను తలదన్ని మొత్తం సెగ్మెంట్ లోనే అతి పెద్ద వాహనంగా నిలువనుంది. ఈ వాహనం CBU దారి ద్వారా మలేషియా గుండా రానుంది. ఇందులో ఒకే ఒక్క వేరియంట్ లభించనుంది.

వెనక్కి దువ్వినటువంటి హెడ్‌ల్యాంప్స్, నాజూకైన ఫాగ్‌ల్యాంప్స్, షెవీ యొక్క ప్రత్యేక గ్రిల్లు తో ముందువైపు తీర్చిదిద్దబడింది. పక్క వైపున పేలవమైన వీల్ ఆర్చెస్, పెద్ద అద్దాలు మరియూ వెనుక అద్దం వరకు ఉండే సీ-పిల్లర్. వెనుక వైపు డబ్బాలా ఉండి LED టెయిల్‌ల్యాంప్ క్లస్టర్, క్రోము పూత ఇంకా ఒక నాజూకైన క్రింది బంపర్ ఉన్నాయి.

కొలతల విషయానికి వస్తే, 4878x1902x1847 యొక్క పొడవు-వెడల్పు-ఎత్తు ఉండి అతి పెద్ద ఎస్‌యూవీగా నిలువనుంది. వాహనం యొక్క వీల్‌బేస్ 2845mm ఉండి దీని 2068mm బరువుని సులువుగా మోస్తూ ఒక 231mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

భారీ కొలతల కారణంగా లోపల వైపు ఖాలీగా ఉండి ప్రతీ ప్రయాణికుడికి సరిపడా చోటు ఉండి, మూడవ వరుస సీట్లు కూడా వెసులుబాటుగా ఉంటాయి.

 ఇంజిను విషయానికి వస్తే, దీనికి 2.8-లీటర్ DURAMAX-లేటెస్ట్ అమర్చబడి ఉంటుంది. ఇది 200bhp శక్తి ఇంకా 500Nm యొక్క టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి అంతటినీ వెనుక చక్రాలకి 4x4 లేదా మాన్యువల్ స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా సరఫరా చేయబడుతుంది. ఒకే ఒక్క వేరియంట్ ఉండటం చేత 4x4 లేదా మాన్యువల్ వంటి ఎంపికలు ఉండవు.

was this article helpful ?

Write your Comment on Chevrolet ట్రైల్

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience