Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కాప్టివా కి భర్తీగా వచ్చిన చెవ్రోలెట్ ట్రయల్బ్లేజర్ ; 2020 నాటికి 9 నమూనాలని ప్రవేశపెట్టనున్న చెవ్రోలెట్

చేవ్రొలెట్ ట్రైల్ కోసం nabeel ద్వారా అక్టోబర్ 23, 2015 11:36 am ప్రచురించబడింది

జైపూర్:

జిఎం అమెరికన్ ఆటో దిగ్గజం, ప్రపంచ మార్కెట్లో తమ నెట్వర్క్ ని విస్తరించేందుకు యోచిస్తున్నారు. ' మేక్ ఇన్ ఇండియా' ద్వారా వారి వాహనాలను ఉత్పత్తి చేయడం వలన ప్రభుత్వం నుండి కూడా మద్దతు లభిస్తుంది. వారు 1996 నుండి భారతదేశం లో $ 1 బిలియన్ పెట్టుబడి చేశారు మరియు తరువాత రూ. 6,400 కోట్లు ($ 1 బిలియన్) మరింతగా దేశంలో పునాదిని బలోపేతం చేయడానికి పెట్టుబడి పెట్టనున్నారు. జిఎం ఇండియా 2020 లోగా ఫేస్ లిఫ్ట్ తో సహా 10 కొత్త స్థానిక మోడల్స్ ని ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.

దీనికి తోడుగా చెవ్రొలెట్ నేడు దేశంలో దాని ప్రీమియం ఎస్యూవీ, ట్రయల్బ్లేజర్ ని ప్రారంభించింది. ఈ కారు థాయిలాండ్ నుండి సిబియు మార్గం ద్వారా దిగుమతి అయ్యింది . ఈ ఎస్యువి కాప్టివా భర్తీ వాహనంగా వచ్చి, దాని విభాగంలో టయోటా ఫార్చ్యూనర్ ఒక మంచి పోటీదారుగా నిరూపించబడింది. వీటితో పాటూ చెవ్రొలెట్ రాబోయే సంవత్సరాల్లో భారతదేశం లో దాని స్పిన్ ఎంపివి ని ప్రారంభించనుంది. ఈ ఎంపివి భారతదేశం లో తయారుచేయబడి 2017 లో మార్కెట్ లోనికి రానున్నది.

ఈ కార్లు కాకుండా, జనరల్ మోటార్స్ ఇండియా కూడా తదుపరి తరం మోడళ్లు మరియు ఇప్పటికే ఉన్న వాహనాల ఫేస్లిఫ్ట్ లను తీసుకురానున్నది. తదుపరి తరం కార్లు మధ్య మొదటిగా బీట్ మరియు క్రుజ్ రానున్నది. ఇది ప్రక్కన పెడితే, చెవ్రోలెట్ బీట్ ఆధారంగా ఒక కాంపాక్ట్ సెడాన్ ని పరిచయం చేయనున్నది, అది 2018 లో వెలుగు చూస్తుంది.

జనరల్ మోటార్స్ యొక్క ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేరీ బార మాట్లాడుతూ " చెవ్రోలెట్ దీర్ఘకాలం నుండి భారతదేశం కోసం కట్టుబడి ఉంది. ఇది మా భారత వినియోగదారుల కొరకు అత్యుత్తమ వాహనాలను మరియు వారు కోరుకున్న వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ఉన్న సంస్థ అని తెలిపారు."

n
ద్వారా ప్రచురించబడినది

nabeel

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన చేవ్రొలెట్ ట్రైల్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర